సోలో హీరోగా అరవింద్స్వామి | Bala next movie with arvind swamy as solo lead | Sakshi
Sakshi News home page

సోలో హీరోగా అరవింద్స్వామి

Published Sat, Oct 17 2015 12:55 PM | Last Updated on Sun, Sep 3 2017 11:06 AM

సోలో హీరోగా అరవింద్స్వామి

సోలో హీరోగా అరవింద్స్వామి

తనీ ఒరువన్ సినిమాతో విలన్గా మెప్పించిన అరవింద్ స్వామి ఒక్కసారిగా సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్గా మారిపోయాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి, ప్రస్తుతం విలన్గా కెరీర్ ఎంజాయ్ చేస్తున్న అరవింద్ స్వామి మరోసారి సోలో లీడ్గా కనిపించనున్నాడు.

కోలీవుడ్ లో రియలిస్టిక్ దర్శకుడిగా పేరున్న బాల దర్శకత్వంలో అరవింద్ స్వామి ఓ సినిమా చేయనున్నాడట. ప్రస్తుతం శశికుమార్, వరలక్ష్మీల కాంబినేషన్లో 'తారై తప్పట్టై' సినిమా చేస్తున్న బాల, ఈ సినిమా పూర్తయిన తరువాత అరవింద్ స్వామి లీడ్ రోల్లో సినిమా కోసం వర్క్ చేయనున్నాడు.

సాఫ్ట్గా స్టైలిష్ లుక్లో కనిపించే అరవింద్ స్వామి, బాల లాంటి దర్శకుడితో కలిసి పనిచేయగలడా అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా అరవింద్ స్వామి, బాలల కాంబినేషన్లో సినిమా దాదాపుగా కన్ఫామ్ అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement