
అబుదాబి: చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోని వికెట్‌ను దక్కించుకోవడం మధురమైన క్షణమని కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అన్నాడు. బుధవారం నాటి మ్యాచ్‌లో కీలక సమయంలో ధోనిని బౌల్డ్ చేసిన వరుణ్ మ్యాచ్‌ను కోల్‌కతా వైపు తిప్పాడు. మ్యాచ్ అనంతరం సహచరుడు రాహుల్ త్రిపాఠితో మాట్లాడుతూ వరుణ్ ఆ సంగతిని గుర్తు చేసుకున్నాడు. ‘మూడేళ్ల క్రితం కేవలం ధోని బ్యాటింగ్ చూసేందుకే చెపాక్ స్టేడియానికి వెళ్లేవాడిని. ఇప్పుడు అతని ప్రత్యర్థిగా ఆడుతున్నా. దీన్ని నమ్మలేకపోతున్నా. జట్టును గెలిపించేందుకు మహి భాయ్ పోరాడుతున్నాడు. మంచి లెంగ్త్‌లో బంతిని సంధిస్తే అతని వికెట్ దక్కించుకోవచ్చు అని ఆశించా. అలాగే చేసి వికెట్ సాధించా. మ్యాచ్ తర్వాత ధోని సర్‌తో ఫొటో కూడా తీసుకున్నా’ అని వరుణ్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment