captain dhoni
-
క్రికెటర్ ధోనీ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న ఏకైక సినీ హీరో
క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు మహేంద్ర సింగ్ ధోనీ.. తలైవా, జార్ఖండ్ డైనమైట్, కెప్టెన్ కూల్, ద ఫినిషర్ ఇలా అభిమానులు ఆయన్ను పిలుచుకుంటారు. ప్రపంచ క్రికెట్లో ఆయన ఒక చరిత్రను సృష్టించాడు. 2011 ప్రపంచకప్, 2007 T20 ప్రపంచకప్ భారత్‌కు అందించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. నేడు (జులై 7) ధోని 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో బర్త్‌డే కేక్‌ని ధోనీ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి సాక్షితో పాటు బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు.శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన మహీ బర్త్ డే వేడుకల్లో సల్మాన్ ఖాన్‌తో పాటు సాక్షి పాల్గొన్నారు. మిస్టర్ కూల్ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోను ఆయన భార్య సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బర్త్ డే వేళ ధోనీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చెన్నై టీమ్ ఒక అద్భుతమైన వీడియోతో మహీకి బర్త్‌డే విషెష్ చెప్పింది. క్రికెట్ ప్రపంచంలో ధోనీ క్రియేట్ చేసిన రికార్డ్స్‌ను అభిమానులు మరోసారి గుర్తుచేస్తున్నారు. ఇలా నెట్టింట సందడిగా #HBDMSDhoni హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది.బర్త్‌డేలో సల్మాన్ మాత్రమేధోనీ ప్రస్తుతం అనంత అంబానీ పెళ్లి వేడుకల్లో భాగంగా ముంబైలో ఉన్నాడు. ఈ క్రమంలోనే మహీ పుట్టినరోజు వేడుకల్లో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఒక ఫోటోను ఆయన పంచుకున్నారు. సోషల్ మీడియా ద్వారా హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ సాహెబ్ అంటూ సల్మాన్ తెలిపారు. ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటో భారీగా ట్రెండ్ అవుతుంది. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్స్ అంటూ నెటిజన్లు తెలుపుతున్నారు. బాలీవుడ్ బాప్, క్రికెట్ బాప్ కలిస్తే రచ్చే అంటూ మరోక నెటిజన్ తెలిపాడు. సోషల్‌మీడియాలో వారిద్దరి అభిమానులు 'డ్రీమ్ కమ్ ట్రూ' అంటూ తెగ సంబరపడిపోతున్నారు.ధోనీ కాళ్లకు నమస్కరించిన సతీమణిధోనీ భార్య సాక్షి సింగ్ ఒక వీడియో షేర్ చేసి తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. కేక్ కట్ చేసిన ధోని మొదట తన సాక్షికి తినిపించాడు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌కు ధోనీ కేక్ తినిపించారు. ఈ క్రమంలో ధోనీ కాళ్లకు సాక్షి సింగ్ నమస్కరించింది. చాలా సరదాగా ఉన్న ఆ వీడియోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. సల్మాన్, ధోనీ మధ్య ఉన్న బలమైన బంధాన్ని ఇలా మరోసారి అభిమానులకు చూపించారు. ఇటీవల జూలై 6న జరిగిన ఆనంద్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత వేడుకలో వారిద్దరూ కలిసి కనిపించారు. View this post on Instagram A post shared by Sakshi Singh (@sakshisingh_r)This clip is going to break internet!Salman Khan × MS Dhoni ❤#HappyBirthdayMSDhonipic.twitter.com/HMeFiymdUo— ` (@WorshipDhoni) July 6, 2024 -
ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..!
-
ఆ క్షణం ఎంతో మధురం...
అబుదాబి: చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ధోని వికెట్‌ను దక్కించుకోవడం మధురమైన క్షణమని కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అన్నాడు. బుధవారం నాటి మ్యాచ్‌లో కీలక సమయంలో ధోనిని బౌల్డ్ చేసిన వరుణ్ మ్యాచ్‌ను కోల్‌కతా వైపు తిప్పాడు. మ్యాచ్ అనంతరం సహచరుడు రాహుల్ త్రిపాఠితో మాట్లాడుతూ వరుణ్ ఆ సంగతిని గుర్తు చేసుకున్నాడు. ‘మూడేళ్ల క్రితం కేవలం ధోని బ్యాటింగ్ చూసేందుకే చెపాక్ స్టేడియానికి వెళ్లేవాడిని. ఇప్పుడు అతని ప్రత్యర్థిగా ఆడుతున్నా. దీన్ని నమ్మలేకపోతున్నా. జట్టును గెలిపించేందుకు మహి భాయ్ పోరాడుతున్నాడు. మంచి లెంగ్త్‌లో బంతిని సంధిస్తే అతని వికెట్ దక్కించుకోవచ్చు అని ఆశించా. అలాగే చేసి వికెట్ సాధించా. మ్యాచ్ తర్వాత ధోని సర్‌తో ఫొటో కూడా తీసుకున్నా’ అని వరుణ్ చెప్పుకొచ్చాడు. -
మూడో వన్డేలో భారత్ సూపర్ విక్టరీ
-
భారత్ బల్లే బల్లే...
► మూడో వన్డేలో ఘన విజయం ► 7 వికెట్లతో న్యూజిలాండ్ చిత్తు ► కోహ్లి భారీ సెంచరీ, రాణించిన ధోని ► నాలుగో మ్యాచ్ బుధవారం ఛేదనలో తనకు అలవాటైన రీతిలో కోహ్లి మరో అలవోక సెంచరీ... ఈ రోజు చెలరేగాల్సిందే అన్నట్లుగా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చి పట్టుదలగా చక్కటి ఇన్నింగ్స్ ఆడిన ధోని... ఇద్దరు అగ్రశ్రేణి ఆటగాళ్ల క్లాసిక్ బ్యాటింగ్ భారత్‌కు న్యూజిలాండ్‌పై కీలక విజయాన్ని అందించింది. గత మ్యాచ్‌లో ఎదురైన ఓటమి నుంచి వెంటనే కోలుకుంటూ సిరీస్‌లో మన జట్టు మళ్లీ ఆధిక్యంలో నిలిచింది. రికార్డుల విరాట్ చివరి వరకూ నిలిచి తనకే సాధ్యమైన రీతిలో మరో ఘన విజయాన్ని జట్టు ఖాతాలో చేర్చాడు. అంతకుముందు ఒక దశలో 46 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయినా... నీషమ్, హెన్రీ ఆదుకోవడంతో మెరుగైన స్కోరు సాధించగలిగిన న్యూజిలాండ్ చివరకు దానిని కాపాడుకోవడంలో మాత్రం విఫలం అయింది. మొహాలి (పంజాబ్): స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి (134 బంతుల్లో 154 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీకి తోడు కెప్టెన్ ధోని (91 బంతుల్లో 80; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే భారత్ వశమైంది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ధోని సేన 7 వికెట్లతో కివీస్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 49.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. లాథమ్ (72 బంతుల్లో 61; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా... నీషమ్ (47 బంతుల్లో 57; 7 ఫోర్లు), హెన్రీ (37 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) తొమ్మిదో వికెట్‌కు 67 బంతుల్లోనే 84 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 48.2 ఓవర్లలో 3 వికెట్లకు 289 పరుగులు చేసింది. కోహ్లి, ధోని మూడో వికెట్‌కు 151 పరుగులు జత చేశారు. ఈ ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. నాలుగో వన్డే బుధవారం రాంచీలో జరుగుతుంది. రాణించిన లాథమ్... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ మార్పులు లేకుండా బరిలోకి దిగింది. కివీస్ జట్టులో డెవ్‌సిక్ స్థానంలో నీషమ్ వచ్చాడు. కివీస్ ఓపెనర్లు గప్టిల్ (27), లాథమ్ జాగ్రత్తగా ఆడటంతో తొలి మూడు ఓవర్లలో 12 పరుగులే వచ్చాయి. కానీ పాండ్యా వేసిన తర్వాతి ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్ కొట్టిన గప్టిల్, అతని తర్వాతి ఓవర్లోనూ మరో ఫోర్, సిక్స్ బాదాడు. అయితే అతడిని ఎల్బీగా అవుట్ చేసి ఉమేశ్ భారత్‌కు తొలి వికెట్ అందించాడు. గత మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన విలియమ్సన్ (22) ఈసారి భారీ ఇన్నింగ్స ఆడలేకపోయాడు. అరుుతే వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పార్ట్‌టైమర్ కేదార్ జాదవ్ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. తన రెండో ఓవర్లోనే అతను కివీస్ కెప్టెన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఘోరమైన ఫామ్‌తో ఇబ్బందుల్లో ఉన్న రాస్ టేలర్ (57 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్) ఈ మ్యాచ్‌లోనూ ఆరంభంలో తడబడ్డాడు. పటేల్, మిశ్రా బౌలింగ్‌ను ఎదుర్కోలేక తొలి 28 బంతుల్లో 14 పరుగులే చేసిన అతను ఆ తర్వాత వేగంగా పరుగులు సాధించగలిగాడు. మరోవైపు చక్కటి షాట్లతో దూసుకుపోయిన లాథమ్ అర్ధ సెంచరీ 59 బంతుల్లో పూర్తయింది. అరుుతే ఈ దశలో వరుసగా నాలుగు ఓవర్లలో కివీస్ నాలుగు వికెట్లు కోల్పోయింది. మిశ్రా, జాదవ్ చెరో 2 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అండర్సన్ (6)తో పాటు క్రీజ్‌లో పాతుకుపోయిన లాథమ్‌ను జాదవ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే సాన్‌ట్నర్ (7), సౌతీ (13) కూడా వెనుదిరిగారు. ఒక దశలో 153/3తో మెరుగ్గా కనిపించిన న్యూజిలాండ్ 9.2 ఓవర్ల వ్యవధిలో 46 పరుగులు మాత్రమే జోడించి 6 వికెట్లు కోల్పోయింది. ఆదుకున్న జోడి... ఈదశలో నీషమ్, హెన్రీ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చకచకా పరుగులు సాధించారు. ముఖ్యంగా ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఇద్దరూ చెలరేగారు.ముందుగా నీషమ్ రెండు ఫోర్లు కొట్టగా, తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో హెన్రీ 6,4,4 బాదాడు. 44 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న నీషమ్ చివరకు ఉమేశ్ బౌలింగ్‌లోనే వెనుదిరగ్గా, మరో నాలుగు బంతుల తర్వాత కివీస్ ఇన్నింగ్స ముగిసింది. భారీ భాగస్వామ్యం... లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలోనే రహానే (5) వికెట్ కోల్పోగా, రోహిత్ (13) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఈ దశలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని, కోహ్లి కలిసి ఇన్నింగ్‌సను నడిపించారు. తనకు లభించిన లైఫ్‌ను కోహ్లి చక్కగా ఉపయోగించుకున్నాడు. చూడచక్కటి షాట్లతో కనువిందు చేశాడు. ధోని కూడా చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స ఆడాడు. వీరిద్దరు పోటీ పడి పరుగులు సాధించడంతో భారత్ స్కోరు చకచకా ముందుకు సాగింది. కివీస్ జట్టు వీరిద్దరిని నిరోధించడంలో విఫలమైంది. తీవ్రమైన మంచు కారణంగా కూడా ఆ జట్టు బౌలర్లకు బంతిపై పట్టు చిక్కలేదు. 49 బంతుల్లో కోహ్లి, 59 బంతుల్లో ధోని అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. చూస్తుండగానే వీరి భాగస్వామ్యం సెంచరీ దాటి 150 పరుగులకు చేరుకుంది. ఎట్టకేలకు 27 ఓవర్లు శ్రమించిన తర్వాత ఈ జోడీని విడదీయడంలో కివీస్ సఫలమైంది. హెన్రీ బౌలింగ్‌లో షార్ట్ కవర్స్‌లో టేలర్‌కు క్యాచ్ ఇచ్చి ధోని వెనుదిరిగాడు. అయితే మరోవైపు కోహ్లి జోరు మాత్రం ఆగలేదు. నీషమ్ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ దిశగా సింగిల్ తీసి 104 బంతుల్లో అతను సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మనీశ్ పాండే (34 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు) చక్కటి సహకారం అందించడంతో భారత్‌కు లక్ష్యం దిశగా ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. బౌల్ట్ వేసిన 48వ ఓవర్లో కోహ్లి ఏకంగా మూడు ఫోర్లు, ఒక సిక్సర్ సహా 22 పరుగులు రాబట్టడంతో స్కోర్లు సమం కాగా, తర్వాతి ఓవర్ రెండో బంతికి బౌండరీ కొట్టి పాండే మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : గప్టిల్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 27; లాథమ్ (సి) పాండ్యా (బి) జాదవ్ 61; విలియమ్సన్ (ఎల్బీ) (బి) జాదవ్ 22; టేలర్ (స్టంప్డ్) ధోని (బి) మిశ్రా 44; అండర్సన్ (సి) రహానే (బి) జాదవ్ 6; రోంచీ (స్టంప్డ్) ధోని (బి) మిశ్రా 1; నీషమ్ (సి) జాదవ్ (బి) ఉమేశ్ 57; సాన్‌ట్నర్ (సి) కోహ్లి (బి) బుమ్రా 7; సౌతీ (బి) ఉమేశ్ 13; హెన్రీ (నాటౌట్) 39; బౌల్ట్ (బి) బుమ్రా 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 285. వికెట్ల పతనం: 1-46; 2-80; 3-153; 4-160; 5-161; 6-169; 7-180; 8-199; 9-283; 10-285 బౌలింగ్: ఉమేశ్ 10-0-75-3; పాండ్యా 5-0-34-0; బుమ్రా 9.4-0-52-2; జాదవ్ 5-0-29-3; పటేల్ 10-0-49-0; మిశ్రా 10-0-46-2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) సౌతీ 13; రహానే (సి) సాన్‌ట్నర్ (బి) హెన్రీ 5; కోహ్లి (నాటౌట్) 154; ధోని (సి) టేలర్ (బి) హెన్రీ 80; పాండే (నాటౌట్) 28; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (48.2 ఓవర్లలో 3 వికెట్లకు) 289. వికెట్ల పతనం: 1-13; 2-41, 3-192. బౌలింగ్: హెన్రీ 9.2-0-56-2; బౌల్ట్ 10-0-73-0; సౌతీ 10-0-55-1; సాన్‌ట్నర్ 10-0-43-0; నీషమ్ 9-0-60-0. కోహ్లి క్యాచ్ వదిలేస్తే... ప్రపంచ క్రికెట్లో టాప్ బ్యాట్స్‌మన్, ఒక్కసారిగా నిలదొక్కుకుంటే ఎదురులేని ఆటతో మ్యాచ్ లాగేసుకోగలడు. గత మ్యాచ్‌లో కోహ్లి వైఫల్యంతోనే కివీస్‌కు పట్టు చిక్కింది. అలాంటి విరాట్ కోహ్లిని అవుట్ చేసే అవకాశాన్ని కివీస్ చేజేతులా కోల్పయింది. అతను 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు హెన్రీ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను వైడ్ స్లిప్‌లో టేలర్ నేలపాలు చేశాడు. నేరుగా చేతుల్లో పడిన బంతిని అతను అందుకోవడంలో విఫలమయ్యాడు. అంతే... ఆ తర్వాత దూసుకుపోయిన విరాట్, భారీ సెంచరీతో జట్టును విజయతీరం చేర్చాడు. కోహ్లి పరుగులు పెరుగుతున్న కొద్దీ టీవీ కెమెరాలు తననే చూపిస్తుండటంతో పాపం టేలర్ మొహం చిన్నబోయింది! ధోని @ : 9000 భారత్ కెప్టెన్ ఎమ్మెస్ ధోని వన్డేల్లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. సాన్‌ట్నర్ బౌలింగ్‌లో తనదైన శైలిలో భారీ సిక్సర్ కొట్టి అతను ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 17వ ఆటగాడు కాగా, భారత్ తరఫున సచిన్, గంగూలీ, ద్రవిడ్, అజహర్ తర్వాత ధోని ఐదో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో 50కి పైగా సగటు ఉన్న ఏకై క క్రికెటర్ అతనే. మరోవైపు వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కూడా సచిన్ (195) రికార్డును ధోని దాటాడు. మొత్తం కెరీర్లో ధోని 196 సిక్సర్లు బాదాడు. 26 కోహ్లి కెరీర్లో ఇది 26వ సెంచరీ. ఓవరాల్ జాబితాలో అతను సంగక్కర (25)ను దాటి నాలుగో స్థానంలో నిలిచాడు. అతనికంటే సచిన్ (49), పాంటింగ్ (30), జయసూర్య (28) మాత్రమే ముందున్నారు. నాకు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చింది. టేలర్‌ను చూస్తే బాధేసింది. మనం క్యాచ్ వదిలేశాక ఆ బ్యాట్స్‌మన్ భారీ స్కోరు చేస్తే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నేను క్యాచ్ వదిలేస్తే మెకల్లమ్ 300 చేశాడు. కివీస్‌ను ఎక్కువ పరుగులు చేయనిచ్చాం. ఛేదనలో మాది మంచి జట్టు కాబట్టి దీనిని ఒక అవకాశంగా భావించాం. ధోని ముందుగా బ్యాటింగ్‌కు దిగడం మేలు చేసింది. - విరాట్ కోహ్లి -
‘సెట్’ అయింది..!
‘సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్‌కు కావాల్సిన భారత జట్టు ఇదే’... నేను వర్తమానంలోనే జీవిస్తాను తప్ప భవిష్యత్తు గురించి మాట్లాడను అని తరచుగా చెప్పే కెప్టెన్ ధోని నోటినుంచి వచ్చిన మాట ఇది. ఇందులో ఆస్ట్రేలియాపై సాధించిన విజయగర్వంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా మెండుగా కనిపిస్తోంది. ఆసీస్ సిరీస్ ఇంతగా కెప్టెన్, జట్టు ఆలోచనలను మార్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అసలు వన్డేల్లో చిత్తుగా ఓడిన భారత జట్టు టి20ల్లో ఇంత బాగా ఆడుతుందని కూడా ఎవరూ అనుకోలేదు. కానీ టీమిండియా అనూహ్యంగా అద్భుతాన్ని చేసి చూపించింది. సిరీస్ గెలవడమే కాదు జట్టులో ప్రతీ ఆటగాడు తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చడంతో ఒక రకంగా టీమ్‌లో ప్రస్తుతం ఎలాంటి లోపం లేదన్నట్లుగా కనిపిస్తోంది. 11 మంది జట్టును మార్చకుండా సిరీస్ మొత్తం ఆడించడం చూస్తే జట్టు బలమేంటో అర్థమవుతుంది. ఇదే ఆటతీరు, సొంత మైదానాలు కలగలిస్తే భారత్‌కు వరల్డ్‌కప్‌లో తిరుగుండకపోవచ్చు. - సాక్షి క్రీడావిభాగం * ప్రపంచకప్‌కు భారత జట్టు సిద్ధం * నమ్మకం పెంచిన సీనియర్లు * ఆకట్టుకున్న కుర్రాళ్లు * ఆసీస్ టూర్ సూపర్ సక్సెస్ వరల్డ్ కప్‌కు ముందు సన్నాహకంగా భారత్‌కు అందుబాటులో ఉన్న కనీస టి20 మ్యాచ్‌ల సంఖ్య పది. గతంలో జరిగిన ఐదు టి20 ప్రపంచకప్‌ల కోసం కూడా ధోని సేన ఇంతగా ఎప్పుడూ సిద్ధం కాలేదు. ఈ కౌంట్‌డౌన్‌లో మొదటి మూడు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇక శ్రీలంకతో మూడు మ్యాచ్‌లు, ఆ తర్వాత ఆసియా కప్‌లో కనీసం ఐదు మ్యాచ్‌లు ఉన్నాయి. ఫైనల్‌కు చేరితే మరో మ్యాచ్ కూడా దక్కుతుంది. 2007లో తొలిసారి ఎవరూ ఊహించని విధంగా తొలి చాంపియన్‌గా నిలిచిన టీమిండియా... ఆ తర్వాత పొట్టి క్రికెట్లో ఎందుకో తమదైన ముద్ర వేయలేకపోయింది. అపారమైన ఐపీఎల్ అనుభవం వరుసగా మూడు టోర్నీలలో అక్కరకు రాకపోవడంతో కనీసం సెమీస్‌కు కూడా చేరలేని భారత్, గత టోర్నీలో మాత్రం ఫైనల్లో ఓడింది. ఈ కసితోనే కావచ్చు ఆటగాళ్లు, బీసీసీఐ కూడా ఈసారి టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. టాప్ లేపుతున్నారు బ్యాటింగ్‌లో భారత టాపార్డర్ తిరుగులేనిదిగా కనిపిస్తోంది. 20 ఓవర్ల ఆటకు మొదటి ముగ్గురు చాలు, తర్వాతి బ్యాట్స్‌మెన్ అవసరం లేదన్నట్లుగా వీరి జోరు సాగుతోంది. కోహ్లి టి20ల్లో 50 సగటును అధిగమించి ఈ ఫార్మాట్లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఆసీస్‌తో సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌లలోనే అతను 199 పరుగులు చేయడం అసాధారణం. రోహిత్ శర్మ కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ధావన్ ప్రభావమేమిటో చివరి టి20లో కనిపించింది. ఈ ముగ్గురి దూకుడు భారత్‌కు భారీ స్కోరు అందించగలదు. వీరి ధాటితోనే ఛేదన కూడా సులువవుతోంది. ఇక టి20ల్లో రైనా తన సామర్థ్యాన్ని సిడ్నీ మ్యాచ్‌లో చూపించాడు. ‘ఐపీఎల్లో అందరికంటే బెస్ట్ అయిన రైనానుంచి ప్రపంచకప్‌లో చాలా ఆశిస్తున్నాం’ అని ధోని వ్యాఖ్యానించడం అతను ఎంత కీలకం కానున్నాడో సూచిస్తుంది. ఇక అవసరమున్నప్పుడు ధోని మెరుపు బ్యాటింగ్ ముందుకు వస్తుంది. యువరాజ్ బ్యాటింగ్ ఫామ్‌పై ఇంకా స్పష్టత లేకపోయినా, అతని బౌలింగ్‌పై కెప్టెన్ నమ్మకముంచడం జట్టులో స్థానాన్ని దాదాపు ఖాయం చేసింది. అదే బ్యాటింగ్‌లోనూ చెలరేగితే తిరుగుండదు. గాయంతో ఈ సిరీస్ ఆడని రహానే అదనపు బ్యాట్స్‌మన్‌గా జట్టులో ఎలాగూ ఉన్నాడు. హార్దిక్ పాండ్యా రూపంలో మీడియం పేస్ ఆల్‌రౌండర్ దక్కడం ధోనికి కూడా సంతోషాన్ని కలిగిం చింది. సీనియర్లు లేకున్నా... సీనియర్ బౌలర్లు పదే పదే అదే తప్పులు చేయడంతో కొత్తగా ప్రయత్నించానని చెప్పిన ధోని అందుకు తగిన ఫలితాన్ని రాబట్టాడు. సాధారణంగా ఎవరినీ కెరీర్ ఆరంభంలోనే పెద్దగా ప్రశంసించని ధోని...నాక్కావలసింది ఇలాంటి బౌలరే అంటూ బుమ్రాను పదే పదే అభినందించాడు. ముఖ్యంగా కీలక సమయంలో తన యార్కర్లతో బుమ్రా ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. నమ్మకం నిలబెట్టిన వెటరన్ నెహ్రా కూడా ఐపీఎల్ అనుభవంతో భారత గడ్డపై కీలకం కావచ్చు. పాండ్యా బౌలింగ్‌తో కూడా జట్టు సంతృప్తిగా ఉంది. ఇషాంత్, ఉమేశ్ తిరిగి జట్టులోకి రావడం కష్టమేనని కెప్టెన్ చూచాయగా చెప్పడం కూడా పేస్ లైనప్ ఇదే అని అర్థమవుతోంది. ఇక ఆస్ట్రేలియాలో అంత ప్రభావం చూపలేకపోయినా... అశ్విన్, జడేజాలు భారత్‌లో ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. హర్భజన్ స్థానం గురించి ధోని ఎలాంటి హామీ ఇవ్వలేదు. పరిస్థితులను బట్టి అప్పటి జట్టును ఎంపిక చేస్తామని, అవసరమైతే ఒకటి రెండు మా ర్పులు మాత్రమే ఉంటాయని సూచించడంతో జట్టు కూర్పు పై టీమ్ మేనేజ్మెంట్కు స్పష్టత వచ్చినట్లే. వరల్డ్ కప్ తరహా పరిస్థితులే ఉండే శ్రీలంక సిరీస్, ఆసియా కప్‌లలో ఇక ఇదే జట్టుకు ఎక్కువ మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించడమే మిగిలింది. ధోని ‘స్ఫూర్తి సందేశం’ ఆసీస్‌పై సిరీస్ విజయం భారత జట్టులో కొత్త ఉత్సాహం నింపిందనడంలో సందేహం లేదు. సిరీస్ విజయం తర్వాత ధోనికి కూ డా మంచి ఊపొచ్చింది. అందుకే జట్టులో స్ఫూర్తి పెంచేందుకు ‘ఇక్కడినుంచి పడిపోవద్దు’ అంటూ డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక పేద్ద సందేశం ఇచ్చేశాడు. ‘అదో అద్భుతమైన ప్రసంగం. ఈ సిరీస్ విజయం ప్రాధాన్యతపై 20 నిమిషాల పాటు ధోని మాట్లాడాడు. ఆస్ట్రేలియా గడ్డపై మన జట్టు గతంలో ఇంత బాగా ఆడలేదని, తొలిసారి భారీ విజయం రుచి చూసిన కుర్రాళ్లు దీని విలువను తెలుసుకోవాలని, ఆత్మవిశ్వాసంతో వచ్చే మ్యా చ్‌లలోనూ ఇదే జోరును కొనసాగించాలని కెప్టెన్ చెప్పాడు’ అని టీమ్ మేనేజ్మెంట్లోని ఒక కీలక వ్యక్తి వెల్లడించాడు. ఇదే సమావేశంలో డెరైక్టర్ రవిశాస్త్రి... భారత ఆటగాళ్లు పులుల్లా ఆడారని, దిగ్గజాలు ఉన్న సమయంలోనూ మనం విదేశాల్లో ఇంత బాగా ఆడలేదని ప్రశంసించారు. కోహ్లికి టాప్ ర్యాంక్ ఆసీస్‌తో సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన విరాట్ కోహ్లి ఐసీసీ టి20 బ్యాట్స్‌మన్ ర్యాం కింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. నంబర్‌వన్‌గా ఉన్న ఆరోన్ ఫించ్ రెండో స్థానానికి దిగజారాడు. మొత్తం 892 రేటింగ్ పాయింట్లతో కోహ్లి ముందంజలో ఉండగా, ఫించ్ ఖాతాలో 868 పాయింట్లు ఉన్నాయి. రైనా 13, రోహిత్ 16వ స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్లలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. -
ఇంకా నేర్చుకుంటున్నారా..!
చివరి వన్డేలో భారత జట్టు ఓటమికి కారణమేంటి? కెప్టెన్ ధోనికి ఎదురైన సూటి ప్రశ్న ఇది. ‘ఈ ప్రశ్న ఇవాళ మాత్రం అడగొద్దు. వాళ్లు దాదాపు 450 పరుగులు చేశారు. మీరేమో తప్పు ఎక్కడ జరిగింది అని ప్రశ్నిస్తున్నారు. వారిని అడ్డుకునేందుకు అన్ని వ్యూహాలూ ప్రయత్నించాం’... సుడి గాలి వేగంతో ధోని ఇచ్చిన జవాబు! ఛలోక్తులు విసరడంలో ముందుండే ధోని, కాస్త హాస్యం జోడించే ప్రయత్నం చేసినా అది అతనిలోని ఒక రకమైన అసహనాన్ని బయట పెట్టింది. ఒక దశలో ఎవరితో బౌలింగ్ చేయించాలో, ఎక్కడ ఫీల్డర్ని పెట్టాలో అర్థం కాని స్థితిలో నిలిచిన కెప్టెన్.... తన బౌలర్లలో ఒక్కరూ నమ్మకాన్ని నిలబెట్టలేని సమయంలో పూర్తిగా చేతులెత్తేశాడు. ఈ పేసర్లతోనా... మన దగ్గర ఉన్నది ఫాస్ట్ బౌలర్లు కాదు, మీడియం పేసర్లేననేది జగమెరిగిన సత్యం. కానీ 135 కిలోమీటర్ల వేగం దాటని తమ బౌలింగ్‌తో భువీ, మోహిత్ విపరీతంగా షార్ట్ పిచ్ బంతులు విసిరిన వ్యూహం బెడిసికొట్టింది. దాంతో ఈ బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కొన్న సఫారీ బ్యాట్స్‌మెన్ పండగ చేసుకున్నారు. కనీసం 145 కిలోమీటర్ల వేగంతో వేస్తే కానీ ముంబైలాంటి వికెట్‌పై బౌన్స్ రాబట్టడం కష్టం. మన బలహీనతను గుర్తించి ధోని... లైన్ అండ్ లెంగ్త్‌కే కట్టుబడే విధంగా మరో వ్యూహాన్ని ఎంచుకోవాల్సింది. కానీ అతను దానిని అమలు చేయలేకపోయాడు. ‘మనం ఎంతో మంది పేసర్లను పరీక్షించాం. ఉన్నంతలో వీరే మెరుగు. దేశవాళీలోబాగా ఆడి వచ్చినవారు అంతర్జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్నారు’ అని ధోని చెప్పడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ఆల్‌రౌండర్ లేడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రస్తుతం భారత్‌లో బిన్నీ, అక్షర్, జడేజా మాత్రమే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలిగే బౌలింగ్ ఆల్‌రౌండర్లు అని ధోని వ్యాఖ్యానించడం అర్థం లేనిది. వన్డేల కోసమంటూ జట్టులోకి తీసుకున్న గుర్కీరత్ సింగ్‌కు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఇలాంటి వ్యాఖ్య చేయడం అతని స్థాయికి తగింది కాదు. ఫలితాలు ముఖ్యం కాదని ప్రక్రియ మాత్రమే ప్రధానమని తాను ఎప్పుడూ చెప్పే డైలాగే మరో సారి ఉచ్ఛరించిన ధోని... బ్యాటింగ్ ఆర్డర్‌ను అడ్డగోలుగా మార్చడం మినహా తాను కొత్తగా చేసిన ప్రయోగం ఏమీ ఈ సిరీస్‌లో కనిపించలేదు. ఇది సరిపోదా... గత నాలుగేళ్లుగా వన్డేల్లో వరుస విజయాలు... ఇటీవల ప్రపంచకప్‌లోనూ మెరుగైన ప్రదర్శన... ఆటగాళ్లందరికీ కావాల్సినంత అనుభవం. అయితే భారత కెప్టెన్ ధోని మాత్రం జట్టు ఇంకా ‘కుదురుకునే’ దశలోనే ఉందంటున్నాడు. జట్టులో అందరికంటే జూనియర్ అయిన అక్షర్ పటేల్ కూడా ఇప్పటికే 22 వన్డేలు ఆడేశాడు. వరల్డ్ కప్ వరకు బాగా ఆడిన జట్టు ఒక్కసారిగా బంగ్లాదేశ్‌లో, ఆ తర్వాత స్వదేశంలో ఇలా భంగపడటం అందరినీ నిరాశపర్చింది. పిచ్ బాగా లేదనో, స్పిన్నర్లకు అనుకూలించలేదనో చెప్పుకోవడం అర్థం లేనిది. ‘దీన్ని చెత్త ప్రదర్శన అనే మాట కూడా తక్కువే. అంతకంటే పెద్ద పదం ఏదైనా కావాలి’ అని ధోని స్వయంగా అంగీకరించడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది. వచ్చే జనవరిలో భారత జట్టు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లే వరకు ధోని సీన్లో ఉండకపోవచ్చు. కానీ అతనికి తగినంత సమయం ఉంది. అన్ని స్థానాల్లో సరిపోయే ఆటగాళ్లను సిద్ధం చేయాల్సి ఉందంటూ స్వయంగా తానే చెప్పిన మహి... అలాంటి ప్రణాళికలతో ఏమైనా ముందుకొస్తేనే ఇకపై ఇలాంటి పరాభవాలకు బ్రేక్ పడుతుంది. సాక్షి క్రీడావిభాగం -
పారా రెజిమెంట్‌లో ధోని శిక్షణ
న్యూఢిల్లీ: భారత సైన్యంలో లె ఫ్టినెంట్ కల్నల్ గౌరవ ర్యాంకులో ఉన్న వన్డే జట్టు కెప్టెన్ ధోని ఎలైట్ పారా రెజిమెంట్‌తో కలిసి రెండు వారాల పాటు ప్రాథమిక శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ శిక్షణ కోసం ఈనెల 5న ధోని ఆర్మీ ఉన్నతాధికారులకు లేఖ రాశాడు. ఈ కోర్సు పూర్తి కాగానే తను ఐదు సార్లు పారాచూట్ జంప్ చేసే అవకాశం ఉందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి సితాన్షు కర్ తెలిపారు. 2011లో ధోని తొలిసారిగా ఆర్మీ కమాండర్‌గా చేరగా పారాచూట్ రెజిమెంట్‌లో తనకు లెఫ్టినెంట్ కల్నల్ హోదానిచ్చారు. క్రికెట్ నుంచి తప్పుకున్నాక పూర్తి స్థాయిలో ఆర్మీలో సేవలందిస్తానని ధోని గతంలోనే చెప్పాడు. -
ధోని ‘మార్కెట్’ బాగుంది!
లండన్: టెస్టు క్రికెట్‌నుంచి తప్పుకున్నా వన్డే కెప్టెన్ ధోని మార్కెటింగ్ విలువ ఏ మాత్రం తగ్గలేదని మరో సారి రుజువైంది. ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ సంస్థ నిర్వహించిన ‘మోస్ట్ మార్కెటబుల్ స్టార్’ సర్వేలో ధోని 9వ స్థానంలో నిలిచాడు. క్రిస్టియానో రొనాల్డో (10), మెస్సీ (13)కంటే కూడా అతను ముందుండం విశేషం. టాప్-20 జాబితాలో ఉన్న ఏకైక క్రికెటర్ ధోని. రోజర్ ఫెడరర్ (1), టైగర్‌వుడ్స్ (2) అగ్రస్థానాల్లో ఉన్న ఈ లిస్ట్‌లో ఇద్దరు మహిళలు షరపోవా (12), సెరెనా (20) ఉన్నారు. -
బంగ్లా అంపైర్లపై ధోని బృందం ఫిర్యాదు!
న్యూఢిల్లీ : ఇటీవల వన్డే సిరీస్‌లో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న బంగ్లాదేశ్ అంపైర్లపై భారత్ అధికారికంగా బీసీసీఐకి ఫిర్యాదు చేయనుంది. ఈ మేరకు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి, కెప్టెన్ ధోనిల సంతకాలతో ఓ ఫిర్యాదును బోర్డుకు అందజేయాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఫిర్యాదును పరి శీలించిన తర్వాత ఈ అంశాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలని బీసీసీఐ భావిస్తోంది. ఓవరాల్‌గా బంగ్లాతో సిరీస్‌లో మూడు పెద్ద సంఘటనలు భారత్ జట్టును ఆగ్రహానికి గురి చేశాయి. తొలి వన్డేలో ముస్తాఫిజుర్‌ను ఢీకొట్టిన సంఘటనలో కేవలం ధోని పేరును మాత్రమే నివేదికలో ఉద్దేశపూర్వకంగా రాశారు. అలాగే తమీమ్ ఇక్బాల్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి బాగానే పట్టినా అవుట్ ఇవ్వలేదు. మూడో వన్డేలో రాయుడు అవుట్ కాకపోయినా ఇచ్చారు. -
'ముందు కప్... తర్వాతే పాప'
అడిలైడ్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని మనం కచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. అలాగే అతనిపై కాస్త జాలి కూడా చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకనుకుంటున్నారా... ధోని భార్య సాక్షిసింగ్ శుక్రవారం ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే ఆ సమయంలో ధోని తన కుటుంబాన్ని ఎంతగానో మిస్సయ్యాడన్నది వాస్తవం. ఈ సందర్భంగా ధోని కొన్ని అశ్యర్యకరమైన అంశాలను శనివారం మీడియాతో ప్రస్తావించాడు. పాపను చూడటానికి ఈ మధ్యకాలంలో భారత్‌కు వెళ్లాలనుకుంటున్నారా.. అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ధోనీ స్పందిస్తూ 'నాకు కూతురు పుట్టింది. సాక్షి, పాప ఇద్దరు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. నేను ప్రస్తుతం జాతీయ జట్టుకు ఆడుతున్నాను. వరల్డ్‌కప్ అనేది భారత్‌కు అత్యుత్తమమైనది. నా మొదిటి ప్రాధాన్యం క్రికెట్, ప్రపంచ కప్ ముగిసిన తర్వాత పాపను చూడటానికి భారత్ వెళ్తాను' అని చెప్పడంతో ఆశ్యర్యపోవడం విలేకరి వంతయింది. అనంతరం ధోని క్రికెట్ గురించి మాట్లాడుతూ 'వరల్డ్ కప్‌లో భారత్ మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 15న దాయాది పాకిస్తాన్‌తో తలపడుతుంది. అందరు అనుకున్నట్లుగా పెద్దగా ఏం ఆలోచించడం లేదు. ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇతర టెస్ట్ దేశాలతో ఎలా ఆడతామో పాక్‌తో మ్యాచ్ కూడా నాకు అలాగే అనిపిస్తుంది' అని తెలిపాడు. ఆస్ట్రేలియాలో భారత జట్టు వైఫల్యం గురించి ధోని ప్రస్తావిస్తూ... ఏ ఆటగాడికైనా విశ్రాంతి అనేది అవసరం. నాలుగు టెస్టులు, వాటి తర్వాత ముక్కోణపు సీరిస్ ఆడటం అనేది చాలా కష్టమని, అందుకే వైఫల్యాలు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నాడు. ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడిలో ఉండటం కూడా ఓటములకు కారణమన్నాడు. వరల్డ్‌కప్ కోసం సన్నద్ధమయ్యేందుకు తమకు కొంత విరామం దొరకడంతో అందరూ నూతనోత్సాహంతో ఉన్నారని చెప్పాడు. సమయం దొరకడంతో ఆటగాళ్లు కప్ కోసం సిద్ధమైనట్టు ధోని తెలిపాడు. -
ఇక పేస్ పరీక్ష
సాధారణంగా ఆస్ట్రేలియా జట్టు ఎవరు తమ దేశానికి వచ్చినా తొలి టెస్టును బ్రిస్బేన్‌లోనే ఏర్పాటు చేస్తుంది. కారణం... సంప్రదాయబద్ధంగా గాబా పిచ్ మీద విపరీతమైన వేగం ఉంటుంది. బౌన్సర్లతో సీమర్లు చుక్కలు చూపిస్తుంటారు. దీనిని తట్టుకోలేక ప్రత్యర్థులు మ్యాచ్‌ను అప్పగిస్తారు. సిరీస్‌ను ఆసీస్ ఘనంగా ప్రారంభిస్తుంది. ఈసారి భారత్‌కు తొలి టెస్టును బ్రిస్బేన్‌లోనే ఏర్పాటు చేశారు. కానీ హ్యూస్ మరణానంతర పరిణామాల నేపథ్యంలో వేదిక అడిలైడ్‌కు మారింది. అక్కడి పిచ్ సంప్రదాయ బద్దంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలం. ఈసారీ అదే జరిగింది. అయితే ఆస్ట్రేలియా ఆఖరి రోజు అనూహ్యంగా గెలిచింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వచ్చింది. ఇక భారత్‌కు అసలైన పరీక్ష రేపటి నుంచి మొదలు కానుంది. రెండో టెస్టు బుధవారం నుంచి గాబా మైదానంలో జరగనుంది. జాన్సన్, హారిస్, సిడిల్‌లు బౌన్సర్ల వర్షం కురిపించడం ఖాయం. మన బ్యాట్స్‌మెన్ ఎలా స్పందిస్తారు? పిచ్‌ను మన పేసర్లు ఎలా వినియోగించుకుంటారు? అనే అంశాలపై భారత భవితవ్యం ఆధారపడి ఉంది. రేపటి నుంచి రెండో టెస్టు * ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్మిత్ * బరిలోకి దిగనున్న ధోని! బ్రిస్బేన్: టెస్టు మ్యాచ్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు భారత్, ఆస్ట్రేలియా జట్లు అడిలైడ్‌లో అద్భుతమైన వినోదాన్ని అందించాయి. ఆ మ్యాచ్ జ్ఞాపకాలను నెమరువేసుకుంటుండగానే మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్ బుధవారం నుంచి గాబా మైదానంలో జరుగుతుంది. ఈ టెస్టుకు ఇద్దరు కెప్టెన్లు మారబోతున్నారు. గాయంతో సిరీస్‌కు దూరమైన క్లార్క్ స్థానంలో స్టీవెన్ స్మిత్ ఆస్ట్రేలియాకు సారథ్యం వహిస్తుంటే... భారత్ తరఫున రెగ్యులర్ కెప్టెన్ ధోని బరిలోకి దిగబోతున్నాడు. క్లార్క్ స్థానంలో హాడిన్ కెప్టెన్ అవుతాడని భావించినా... దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా స్మిత్‌ను సారథిగా ఎంపిక చేశారు. ఇటీవల భిన్నమైన షాట్లతో అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్న స్మిత్... ఈ బాధ్యతను ఎలా నిర్వర్తిస్తాడనేది ఆసక్తికరం. మరోవైపు తొలి టెస్టులో ఆకట్టుకున్న కోహ్లి స్థానంలో... సారథిగా ధోని రాబోతున్నాడు. ఒకవేళ ధోని మరింత విశ్రాంతి అవసరమని భావిస్తే మాత్రం కోహ్లి కొనసాగుతాడు. ఓడితే కోలుకోవడం కష్టం నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టు నెగ్గితే 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళుతుంది. అప్పుడు ఇక సిరీస్‌ను కోల్పోయే ప్రమాదం ఉండదు. కాబట్టి చివరి రెండు టెస్టుల్లో మరింత దూకుడుగా ఆడుతుంది. అలా కాకుండా సిరీస్‌లో ఆసక్తి బాగా ఉండాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలి. కనీసం ‘డ్రా’ చేసుకున్నా సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. మార్పులు ఎన్ని? తొలి టెస్టు ఆడిన భారత జట్టు రెండో మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. ధోని తిరిగి వస్తే సాహా బెంచ్ మీదకు వెళ్లాలి. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా కరణ్ శర్మ స్థానంలో అశ్విన్ రావచ్చు. ఒకవేళ నలుగురు పేసర్లతో ఆడాలనుకుంటే కరణ్ శర్మ స్థానంలో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బ్యాటింగ్ విభాగంలో మార్పులు లేకపోవచ్చు. తొలి టెస్టులో ఆకట్టుకున్న విజయ్‌తో పాటు శిఖర్ ధావన్ కూడా కొత్త బంతిని మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. కోహ్లి సూపర్ ఫామ్ జట్టుకు కలిసొచ్చే అంశం. రహానే, రోహిత్, పుజారా ముగ్గురూ మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రాణించినా... రెండో ఇన్నింగ్స్‌లో విఫలమయ్యారు. ఈ ముగ్గురిలో కనీసం ఒక్కరు నిలబడి ఉంటే ఈ పాటికి భారత్ సిరీస్‌లో ఆధిక్యంలో ఉండేది. గాబా పిచ్ మీద భారత పేస్ త్రయం ఇషాంత్, షమీ, ఆరోన్ రాణించడంపైనే భారత అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కొత్త సారథి నేతృత్వంలో... కెప్టెన్‌గా మైకేల్ క్లార్క్ది ఆస్ట్రేలియా జట్టుపై తిరుగులేని ముద్ర. మ్యాచ్‌లో ప్రత్యర్థులకు సవాళ్లను నిర్దేశించడంలో తను దిట్ట. మరి స్మిత్ ఆ బాధ్యతలో ఏ మేరకు విజయం సాధిస్తాడో చూడాలి. క్లార్క్ స్థానంలో షాన్ మార్ష్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక తమను ఊరిస్తున్న పిచ్‌పై కచ్చితంగా ఆస్ట్రేలియా సీమర్లు జాన్సన్, సిడిల్, హారిస్ చెలరేగుతారు. ముఖ్యంగా జాన్సన్ గత యాషెస్‌లో ఈ పిచ్‌పై ఇంగ్లండ్ బౌలర్లకు తన బౌన్సర్లతో చుక్కలు చూపించాడు. దీనికి భారత బ్యాట్స్‌మెన్ సన్నద్ధం కావాలి. సిడిల్ అనారోగ్యం నుంచి కోలుకోకుంటే అతని స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ మిషెల్ స్టార్క్ వస్తాడు. ఏమైనా పేస్ పరీక్షగా నిలవబోతున్న ఈ టెస్టు ఆసక్తికరంగా సాగడం ఖాయం. రేపు ఉదయం గం. 5.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో