బంగ్లా అంపైర్లపై ధోని బృందం ఫిర్యాదు! | Bangladesh, Dhoni group of umpires to complain about! | Sakshi
Sakshi News home page

బంగ్లా అంపైర్లపై ధోని బృందం ఫిర్యాదు!

Published Sun, Jun 28 2015 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

Bangladesh, Dhoni group of umpires to complain about!

న్యూఢిల్లీ : ఇటీవల వన్డే సిరీస్‌లో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న బంగ్లాదేశ్ అంపైర్లపై భారత్ అధికారికంగా బీసీసీఐకి ఫిర్యాదు చేయనుంది. ఈ మేరకు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి, కెప్టెన్ ధోనిల సంతకాలతో ఓ ఫిర్యాదును బోర్డుకు అందజేయాలని జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఫిర్యాదును పరి శీలించిన తర్వాత ఈ అంశాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాలని బీసీసీఐ భావిస్తోంది. ఓవరాల్‌గా బంగ్లాతో సిరీస్‌లో మూడు పెద్ద సంఘటనలు భారత్ జట్టును ఆగ్రహానికి గురి చేశాయి.

తొలి వన్డేలో ముస్తాఫిజుర్‌ను ఢీకొట్టిన సంఘటనలో కేవలం ధోని పేరును మాత్రమే నివేదికలో  ఉద్దేశపూర్వకంగా రాశారు. అలాగే తమీమ్ ఇక్బాల్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి బాగానే పట్టినా అవుట్ ఇవ్వలేదు. మూడో వన్డేలో రాయుడు అవుట్ కాకపోయినా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement