క్రికెటర్‌ ధోనీ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న ఏకైక సినీ హీరో | Cricketer Mahendra Singh Dhoni Celebrates Birthaday With Bollywood Actor | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌ ధోనీ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్న ఏకైక సినీ హీరో

Published Sun, Jul 7 2024 9:14 AM | Last Updated on Sun, Jul 7 2024 5:26 PM

Cricketer Mahendra Singh Dhoni Celebrates Birthaday With Bollywood Actor

క్రికెట్‌ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు మహేంద్ర సింగ్‌ ధోనీ.. తలైవా, జార్ఖండ్‌ డైనమైట్‌, కెప్టెన్‌ కూల్‌, ద ఫినిషర్‌ ఇలా అభిమానులు ఆయన్ను పిలుచుకుంటారు. ప్రపంచ క్రికెట్‌లో ఆయన ఒక చరిత్రను సృష్టించాడు. 2011 ప్రపంచకప్‌, 2007 T20 ప్రపంచకప్‌ భారత్‌కు అందించి అభిమానుల గుండెల్లో  చెరగని ముద్ర వేశాడు. నేడు (జులై 7) ధోని 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.  అర్ధరాత్రి సమయంలో బర్త్‌డే కేక్‌ని ధోనీ కట్‌ చేశారు.  ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి సాక్షితో పాటు బాలీవుడ్‌ టాప్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన మహీ బర్త్ డే వేడుకల్లో సల్మాన్‌ ఖాన్‌తో పాటు సాక్షి పాల్గొన్నారు. మిస్టర్​ కూల్​ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోను ఆయన భార్య సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. బర్త్ డే వేళ ధోనీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు​ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చెన్నై టీమ్‌ ఒక అద్భుతమైన వీడియోతో మహీకి బర్త్‌డే విషెష్‌ చెప్పింది. క్రికెట్ ప్రపంచంలో ధోనీ క్రియేట్‌ చేసిన రికార్డ్స్‌ను అభిమానులు మరోసారి గుర్తుచేస్తున్నారు. ఇలా నెట్టింట సందడిగా #HBDMSDhoni హ్యాష్‌ ట్యాగ్‌ వైరల్‌ అవుతుంది.

బర్త్‌డేలో సల్మాన్‌ మాత్రమే
ధోనీ ప్రస్తుతం అనంత అంబానీ పెళ్లి వేడుకల్లో భాగంగా ముంబైలో ఉన్నాడు. ఈ క్రమంలోనే మహీ పుట్టినరోజు వేడుకల్లో సల్మాన్‌ ఖాన్‌ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఒక ఫోటోను ఆయన పంచుకున్నారు. సోషల్‌ మీడియా ద్వారా హ్యాపీ బర్త్‌డే కెప్టెన్‌ సాహెబ్‌ అంటూ సల్మాన్‌ తెలిపారు. ప్రస్తుతం నెట్టింట ఈ ఫోటో భారీగా ట్రెండ్‌ అవుతుంది.  ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు లెజెండ్స్ అంటూ నెటిజన్లు తెలుపుతున్నారు. బాలీవుడ్ బాప్, క్రికెట్ బాప్ కలిస్తే రచ్చే అంటూ మరోక నెటిజన్‌ తెలిపాడు. సోషల్‌మీడియాలో వారిద్దరి అభిమానులు  'డ్రీమ్ కమ్ ట్రూ' అంటూ తెగ సంబరపడిపోతున్నారు.

ధోనీ కాళ్లకు నమస్కరించిన సతీమణి
ధోనీ భార్య సాక్షి సింగ్‌ ఒక వీడియో షేర్‌ చేసి తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. కేక్‌ కట్‌ చేసిన ధోని మొదట తన సాక్షికి తినిపించాడు. ఆ తర్వాత సల్మాన్‌ ఖాన్‌కు ధోనీ కేక్‌ తినిపించారు. ఈ క్రమంలో ధోనీ కాళ్లకు సాక్షి సింగ్‌ నమస్కరించింది. చాలా సరదాగా ఉన్న ఆ వీడియోను అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. సల్మాన్, ధోనీ మధ్య ఉన్న బలమైన బంధాన్ని ఇలా మరోసారి అభిమానులకు చూపించారు. ఇటీవల జూలై 6న జరిగిన ఆనంద్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత వేడుకలో వారిద్దరూ కలిసి కనిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement