యువరాజ్‌సింగ్ పేరు చెబితే వెంటనే గుర్తుకొచ్చేది ఆరు సిక్స్‌లు.. ఇప్పుడా సీన్‌ను వెండితెరపై మళ్లీ చూసే అవకాశం రానుంది. మొట్టమొదటి టీ20 ప్రపంచకప్ సందర్భంగా 2007 సెప్టెంబర్ 19న ఇంగ్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో యవరాజ్‌సింగ్ వీర బాదుడుకి ఇంగ్లాడ్ చేతులెత్తేసింది. స్టువర్ట్ బ్రాడ్ వేసిన 19వ ఓవర్‌లో మన యూవీ 6 సిక్సర్లు బాదేసి రికార్డ్ క్రియేట్ చేశాడు. 2011 వరల్డ్ కప్ విజయంలో యూవీ పాత్ర చాలా ఎక్కువగానే ఉంది. గ్రౌండ్‌లో వీరోచితంగా పోరాడే ఈ వీరుడి బయోగ్రఫీ వెండితెరపైకి రానుంది.
ఇప్పటికే సచిన్, ధోనీ వంటి క్రికెటర్ల బయోపిక్‌లు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. తాజాగా యువరాజ్ సింగ్ బయోపిక్‌ను నిర్మిస్తున్నట్లు నిర్మాతలు భూషణ్ కుమార్, రవిభాగ్ చందక్ ప్రకటించారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణసంస్థ టీ సిరీస్ భాగస్వామ్యంతో ఈ చిత్రం రానుంది. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తామని వారు చెప్పారు. అయితే, ఇందులో యువరాజ్‌సింగ్ పాత్రలో ఎవరు కనిపిస్తారా..? అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నిజం చెప్పాలంటే యువరాజ్‌సింగ్ జీవితంలో చాలా వీరోచిత పోరాటాలు ఉన్నాయి. ఫిట్‌నెస్ కోల్పోయినప్పుడు ఇక యూవీ గుడ్‌బై చెబుతాడని అందరూ భావించన సమయంలో తను సత్తా చాటి మళ్లీ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. క్యాన్సర్‌ను జయించి చాలామందిలో ధైర్యాన్ని నింపాడు. అలా ప్రతీది యూవీ జీవితం ఒక ప్రత్యేకం అని చెప్పవచ్చు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment