కేప్‌టౌన్ టెస్టులో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని అవుట్ చేసిన క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ ఫిలాండర్ తెలిపాడు. ‘కోహ్లి దూకుడైన ఆటగాడు. ముందుగా అతడి ఆట కట్టించాలనుకున్నాం. ఆ అవకాశం నాకే దక్కింది. దీనిని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటా’ అని ఫిలాండర్ అన్నాడు.
రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి క్రీజ్‌లో ఉన్నపుడు టీమిండియా స్కోరు 71/3... విజయానికి చేయాల్సింది ఇంకా 137 పరుగులే. అప్పటివరకు రెండు స్పెల్స్‌లో విరాట్‌కు ఆఫ్ స్టంప్‌పై 13 బంతులు విసిరిన ఫిలాండర్... ఒక బంతిని మాత్రం లోపలకు సంధించాడు. దానిని ఫ్లిక్ చేయబోయిన కోహ్లి వికెట్ల ముందు దొరికిపోయాడు.
కోహ్లి వికెట్‌ను గుర్తుంచుకుంటా: ఫిలాండర్
Published Wed, Jan 10 2018 1:19 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment