Philander
-
పాకిస్తాన్ క్రికెట్లో కీలక పరిణామం.. బ్యాటింగ్ కోచ్‌గా విధ్వంసకర ఓపెనర్
ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్‌నకు ముందు పాకిస్తాన్ క్రికెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక కోచ్‌లుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇద్దరు విదేశీయులకు అవకాశం కల్పించింది. ఆసీస్ మాజీ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హెడెన్‌ను బ్యాటింగ్ కోచ్‌గా, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ వర్నన్ ఫిలందర్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో విధ్వంసకర ఓపెనర్లలో ఒకడిగా పెరుపొందిన హెడెన్ 103 టెస్టులు, 161 వన్డేలు , 9 T20I లలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న రమీజ్ రాజా... తన మొదటి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక టీ20 జట్టు ప్రకటించిన నాటి నుంచి పాక్ క్రికెట్లో ముసలం రేగిన సంగతి తెలిసిందే. తమ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదనే కారణంగా పాకిస్తాన్ హెడ్‌కోచ్ మిస్బా వుల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న ఇండియా, పాకిస్థాన్ మధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్ టీ20 జట్టు: బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్. చదవండి: Gambhir: మనం ఇంకా రాహుల్ అసలైన బ్యాటింగ్ చూడలేదు.. -
తండ్రి రాక్షసత్వం, భార్యపై కోపంతో ఇద్దరు పిల్లలను..
పట్నా: బీహార్‌లోని పట్నాలో దారుణం చోటు చేసుకుంది. తనపై భార్య కేసు పెట్టిందన్న కోపంతో కన్న పిల్లలను దారుణంగా చంపాడు ఓ కసాయి తండ్రి. పట్నా రూరల్ జిల్లా కన్హాయ్‌పూర్ గ్రామానికి చెందిన కమల్‌దేవ్, వీణా దేవి అనే మహిళకు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వారికి అంకిత్ కుమార్ (6), అలీషా (3) అనే ఇద్దరు సంతానం ఉన్నారు. కాగా,వీణా దేవి పలువురితో అక్రమసంబంధం కలిగి ఉందని, ఆమెతో కమల్‌దేవ్ తరచూ గొడవపెట్టుకునేవాడు. వారిద్దరి మధ్య తరచూ గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమెపై భౌతికంగా దాడి చేశాడు. ఎలాగోలా తప్పించుకున్న ఆమె పిల్లలను ఇంట్లో వదిలేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులతో కలిసి తన భర్తపై గృహహింస, అదనపు కట్నం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భార్యపై కోపంతో శుక్రవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న చిన్నారుల తలపై బలంగా కొట్టి చంపేశాడు. అనంతరం ఉదయం 5 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అనంతరం పోలీసులు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి చూడగా అంకిత్, అలీషా మృతదేహాలు వారు నిద్రిస్తున్న మంచం మీద రక్తపు మడుగులో పక్కపక్కనే పడి ఉన్నాయి.తన భార్య పలువురితో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆ పిల్లలు తన వల్ల కలిగిన సంతానం కాదని చెబుతూ మానసికంగా వేదించేదని ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. (చదవండి: కరోనాతో భర్త మృతి చెందాడని.. గర్భిణి ఆత్మహత్య) -
మాజీ క్రికెటర్ సోదరుడు కాల్చివేత
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ వెర్నోన్ ఫిలాండర్ సోదరుడు టైరోన్ ఫిలాండర్ కాల్చివేతకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం టైరోన్ స్వస్థలమైన రావెన్స్‌మీడ్‌లో చోటు చేసుకుంది. తన సోదరుడ్ని కొందరు దుండగులు కాల్చివేసిన విషయాన్ని వెర్నోన్ ఫిలాండర్ ట్వీటర్ ద్వారా వెల్లడించాడు. ‘ నా సోదరుడు టైరోన్ దారుణ హత్యకు గురయ్యాడు. మా హోమ్ టౌన్లోనే ఇది జరిగింది. ఈ కష్టసమయంలో మా కుటుంబానికి ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నారు.(చదవండి: శాంసన్ రాత మారేనా? మళ్లీ అదే డ్రామానా?) ఇది పోలీసుల దర్యాప్తులో ఉంది. ఈ విషయంలో పోలీసులకు మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించనందున ఎటువంటి తప్పుడు వార్తలు రాయొద్దు. ఊహాగానాలతో దర్యాప్తు కష్టంగా మారిపోతుంది. టైరోన్ ఎప్పుడూ మా మనసుల్లో ఉంటాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. టైరోన్ కాల్చబడ్డ సమయంలో పక్కంటి వారికి వాటర్ డెలివరీ చేయడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది. -
ఫిలాండర్ కూడా...
జొహన్నెస్‌బర్గ్: సీనియర్లు దూరమై ఇప్పటికే దిక్కు తోచని స్థితిలో కనిపిస్తున్న దక్షిణాఫ్రికా క్రికెట్‌కు మరో దెబ్బ తగిలింది. స్టెయిన్, మోర్నీ మోర్కెల్ దూరమయ్యాక పేస్ బౌలింగ్ భారాన్ని మోస్తున్న సీనియర్ వెర్నాన్ ఫిలాండర్ కూడా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ తర్వాత అతను రిటైర్ కానున్నాడు. తొలి టి20 ప్రపంచకప్‌తో పాటు 30 వన్డేలు కూడా ఆడినా... టెస్టు స్పెషలిస్ట్‌గానే ఫిలాండర్‌కు ఎక్కువ గుర్తింపు దక్కింది. 12 ఏళ్ల కెరీర్లో ఫిలాండర్ 60 టెస్టుల్లో 22.16 సగటుతో 216 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 13 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం. సఫారీ జట్టు చిరస్మరణీయ టెస్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ స్వింగ్ బౌలర్, ఆ దేశం తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. ఇటీవల తరచూ గాయాలబారిన పడుతుండటంతో 34 ఏళ్ల ఫిలాండర్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత 18 నెలల్లో ఫిలాండర్ 6 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. కొన్నాళ్ల క్రితమే అతని ఫిట్నెస్ను మాజీ కెప్టెన్, ప్రస్తుతం దక్షిణాఫ్రికా బోర్డు డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ ప్రశ్నించడంతో ఫిలాండర్ కెరీర్‌పై చర్చ మొదలైంది. -
పుణే టెస్టులో భారత్‌కు 326 పరుగుల ఆధిక్యం
ఇక ఈ టెస్టే కాదు... సిరీసే మన చేతిలోకి వచ్చేసినంత సంబరం. మూడు టెస్టుల సిరీస్ విజేత రెండో టెస్టు మూడో రోజే దాదాపు ఖరారైంది. ఇప్పటికైతే భారత్‌కు భారీ ఆధిక్యం లభించింది. ఇక మిగిలింది భారీ విజయమే! ఈ రెండు రోజుల్లో ఎంత తేడాతో విరాట్ సేన గర్జిస్తుందో చూడాలంటే పుణే మ్యాచ్‌పై ఓ కన్నేయాలి. మూడో రోజు సఫారీ పతనం పేస్‌తో మొదలైంది. స్పిన్‌తో పరిపూర్ణమైంది. పేస్ ద్వయం ఉమేశ్, షమీల బౌలింగ్‌ను టాపార్డర్, మిడిలార్డర్ ఎదుర్కోలేకపోయింది. మిగతా బ్యాటింగ్ అశ్విన్ స్పిన్‌లో చిక్కుకుంది. కానీ... కేశవ్ మహరాజ్, ఫిలాండర్ పోరాటమే భారత శిబిరాన్ని కాస్త ఇబ్బంది పెట్టింది. ఆలౌట్‌ను కాస్త ఆలస్యం చేసింది. పుణే: భారత్ ఆటను రెండో రోజు నాయకుడు నడిపిస్తే... ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను మూడో రోజు బౌలర్లు పడేశారు. టీమిండియాకు భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టారు. రెండో టెస్టులో భారత్‌కు 326 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కేశవ్ మహరాజ్ మొండిగా పోరాడకుంటే ఆతిథ్య జట్టుకు 400 పైచిలుకు పరుగుల ఆధిక్యం దక్కేది. శనివారం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 105.4 ఓవర్లలో 275 పరుగుల వద్ద ఆలౌటైంది. లంచ్ వరకే మరో మూడు వికెట్లను, రెండో సెషన్లో ఇంకో రెండు వికెట్లను కోల్పోయిన సఫారీ జట్టు... ఆఖరి సెషన్లో చివరి రెండు వికెట్లతోనే 78 పరుగులు జతచేయడంతో సఫారీ రోజంతా ఆడగలిగింది. పదో వరుస బ్యాట్స్‌మన్ కేశవ్ మహరాజ్ (132 బంతుల్లో 72; 12 ఫోర్లు) ఒక్కడే జట్టు పరువు నిలిపే బాధ్యత మోశాడు. ఫిలాండర్ (192 బంతుల్లో 44 నాటౌట్; 6 ఫోర్లు) అండతో పోరాడాడు. డు ప్లెసిస్ (117 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... టీమిండియా బౌలర్లలో అశి్వన్ 4, ఉమేశ్ 3, షమీ 2 వికెట్లు తీశారు. వికెట్ల వేటతోనే ఆట షురూ... ఆటతో పాటు వికెట్ల వేట కూడా మొదలైంది. మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 36/3తో శనివారం ఆట కొనసాగించిన సఫారీ జట్టు మరో 5 పరుగులు మాత్రమే జతచేసి నోర్జే (3) వికెట్‌ను కోల్పోయింది. షమీ బౌలింగ్‌లో కోహ్లి క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. కాసేపటికే జట్టు స్కోరు 50 పరుగులు దాటాయో లేదో మరో వికెట్ కూలింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ డి బ్రుయిన్ (58 బంతుల్లో 30; 6 ఫోర్లు) ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా ని్రష్కమించాడు. దీంతో 53 పరుగులకే దక్షిణాఫ్రికా సగం వికెట్లను కోల్పోయింది. ఈ దశలో కెపె్టన్ డు ప్లెసిస్‌కు వికెట్ కీపర్ డికాక్ జతయ్యాడు. రాణించిన డు ప్లెసిస్... అనుభవజు్ఞలైన డు ప్లెసిస్, క్వింటన్ డికాక్ ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు వీరిద్దరూ జాగ్రత్తగా ఆడారు. జట్టు స్కోరు కనాకష్టంగా 100 పరుగులు దాటింది. అదుపుతప్పిన బంతిని బౌండరీకి తరలిస్తూ డు ప్లెసిస్ వేగంగా అర్ధసెంచరీకి చేరువయ్యాడు. 64 బంతుల్లోనే 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అతను ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. వీళ్లిద్దరు ఆరో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. కానీ ఈ భాగస్వామ్యం మరింత బలపడకముందే లంచ్ విరామం లోపే అశి్వన్... డికాక్ (48 బంతుల్లో 31; 7 ఫోర్లు)ను బౌల్డ్ చేశాడు. కేశవ్ పోరాటం... రెండో సెషన్ ఆరంభమైన కాసేపటికే ముత్తుసామి (7)ని జడేజా ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. కాసేపయ్యాక డు ప్లెసిస్ కూడా స్పిన్ ఉచ్చులోనే పడ్డాడు. అశ్విన్ బౌలింగ్‌లో రహానే క్యాచ్‌తో అతను పెవిలియన్ చేరాడు. 162 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన సఫారీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక 200 పరుగుల్లోపే దక్షిణాఫ్రికా ఖేల్‌ఖతం అనుకున్నారంత. అయితే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడిన పిచ్‌పై ఫిలాండర్, కేశవ్ అసాధారణ పోరాటపటిమ కనబరిచారు. ఈ ఇద్దరు 43.1 ఓవర్ల పాటు భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. ఆఖరి సెషన్‌ను అవలీలగా ఆడారు. ఈ క్రమంలో కేశవ్ 96 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. తొమ్మిదో వికెట్‌కు 109 పరుగులు జోడించాక కేశవ్‌ను, రబడ (2)ను అశి్వన్ ఔట్ చేయడంతో సఫారీ ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లి ఎత్తుగడ ఏంటో... తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 326 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలున్న ఈ టెస్టులో ఆతిథ్య బౌలర్ల సమష్టి జోరు చూస్తే ఇన్నింగ్స్ విజయానికి ఇది సరిపోతుంది. కానీ కెప్టెన్ కోహ్లి ఎత్తుగడ ఎలా ఉండబోతుందో ఆసక్తికరంగా మారింది. అతను తన బౌలింగ్ దళానికి కాస్త విశ్రాంతి ఇవ్వాలనుకుంటే మాత్రం కచి్చతంగా రెండో ఇన్నింగ్స్ ఆడేందుకు ఓపెనర్లను బరిలోకి దింపే అవకాశముంది. తొలి సెషన్ అంతా ఆడటం... లంచ్ తర్వాత పిచ్ పరిస్థితుల్ని బట్టి డిక్లేర్ చేసి ప్రత్యర్థి వికెట్లను తీయడం జరగొచ్చు. లేదంటే టీమ్‌తో సమాలోచన లు జరిపి ఫాలోఆన్ ఆడించినా ఆశ్చర్యం లేదు. ఆట ముగిశాక మీడియా సమావేశానికి వచి్చన స్పిన్నర్ అశి్వన్ కూడా ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. ‘ఫాలోఆన్’ లేదంటే రెండో ఇన్నింగ్స్ ఆడటమా అనేది కోహ్లినే నిర్ణయిస్తాడని చెప్పాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 601/5 డిక్లేర్డ్; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (బి) ఉమేశ్ 6; మార్క్రమ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఉమేశ్ 0; డి బ్రుయిన్ (సి) సాహా (బి) ఉమేశ్ 30; బవుమా (సి) సాహా (బి) షమీ 8; నోర్జే (సి) కోహ్లి (బి) షమీ 3; డు ప్లెసిస్ (సి) రహానే (బి) అశ్విన్ 64; డికాక్ (బి) అశి్వన్ 31; ముత్తుసామి (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 7; ఫిలాండర్ (నాటౌట్) 44; కేశవ్ (సి) రోహిత్ (బి) అశి్వన్ 72; రబడ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (105.4 ఓవర్లలో ఆలౌట్) 275. వికెట్ల పతనం: 1–2, 2–13, 3–33, 4–41, 5–53, 6–128, 7–139, 8–162, 9–271, 10–275. బౌలింగ్: ఇషాంత్ శర్మ 10–1–36–0, ఉమేశ్ 13–2–37–3, జడేజా 36–15–81–1, షమీ 17–3–44–2, అశ్విన్ 28.4–9–69–4, రోహిత్ శర్మ 1–1–0–0. -
అది అంగీకార సంబంధం కాదు
వాషింగ్టన్: విదేశాంగ శాఖ మాజీ సహాయమంత్రి, సీనియర్ జర్నలిస్ట్ ఎంజే అక్బర్(67) అధికార దుర్వినియోగం, బలప్రయోగంతో తనపై అత్యాచారం చేశారని నేషనల్ పబ్లిక్ రేడియో చీఫ్ బిజినెస్ ఎడిటర్ పల్లవి గొగోయ్ స్పష్టం చేశారు. పరస్పర అంగీకారంతోనే తామిద్దరి మధ్య 1994లో కొన్ని నెలల పాటు వివాహేతర సంబంధం కొనసాగిందన్న అక్బర్ వాదనను ఆమె ఖండించారు. అక్బర్ చేతిలో తనకు ఎదురైన భయానక అనుభవాలపై పల్లవి వాషింగ్టన్ పోస్ట్‌కు ఓ కథానాన్ని రాశారు. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ.. అక్బర్ లైంగిక వేధింపుల పర్వంపై వాషింగ్టన్ పోస్ట్ పత్రికకు శుక్రవారం రాసిన వ్యాసంలోని ప్రతి అక్షరానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. అక్బర్ చేతిలో లైంగికదాడులకు గురైన మహిళలు ముందుకొచ్చి నిజాలను బయటపెట్టాలన్న ఉద్దేశంతోనే తాను మాట్లాతున్నట్లు వెల్లడించారు. తమను అక్బర్ లైంగికంగా వేధించాడని 16 మందికి పైగా మహిళలు ముందుకురావడంతో ఆయన్ను కేంద్రం మంత్రి బాధ్యతల నుంచి ఇటీవల తప్పించిన సంగతి తెలిసిందే. -
సెక్షన్ 497 నిరంకుశం..!
న్యూఢిల్లీ: వివాహేతర సంబంధాలపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 497 సమానత్వపు హక్కునకు భంగం కలిగించేలా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది నిరంకుశత్వంగా ఉందని గురువారం స్పష్టం చేసింది. వివాహితుడైన పురుషుడు, మరో వివాహితురాలిని వేర్వేరుగా పరిగణిస్తోందని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. సెక్షన్ 497 ‘నిరంకుశం’ అని స్పష్టం చేసింది. భర్త అనుమతితో వివాహిత మహిళ – వివాహితుడైన మరో పురుషుడితో సంబంధం పెట్టుకున్న సందర్భాల్లో.. మహిళను ఓ గృహోపకరణంగా చూస్తున్నారని మండిపడింది. ఓ వివాహితురాలు మరో వివాహితుడితో.. తన భర్త అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకుంటే తప్పు కాదని సెక్షన్ 497 చెబుతోంది. ‘భార్యాభర్తలు కాని ఓ పురుషుడు, మరో మహిళ.. లైంగిక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారం చేసినట్లు కాదు. కేవలం వివాహేతర సంబంధమే’ అని ఈ సెక్షన్ పేర్కొంది. అయితే ఈ సెక్షన్ సరికాదని ధర్మాసనం తెలిపింది. వివాహ బంధం పవిత్రమైంది ‘ఇక్కడ వివాహ బంధం పవిత్రతను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ చట్టంలోని నిబంధనలు ఆర్టికల్ 14 (అందరికీ సమానత్వం) అనే రాజ్యాంగం కల్పించిన హక్కును హరించివేస్తోంది’ అని కోర్టు చెప్పింది. సమానత్వపు హక్కును ఈ సెక్షన్ కల్పిస్తుందా లేదా? అనేది విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ‘భర్త అనుమతి ఉంటే.. ఆ వివాహేతర సంబంధంలో తప్పులేదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మహిళను ఓ ఆటవస్తువుగా పరిగణించినట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఓ వివాహితుడు, మరో వివాహితురాలితో (భర్త అనుమతితో) లైంగిక సంబంధం పెట్టుకుంటే అది తప్పుకాదు. మరోవైపు, ఓ వివాహితుడైన వ్యక్తి వివాహం కాని మహిళతో కలవడం తప్పుకాదు. ఇక్కడ వివాహేతర సంబంధం వర్తించదు. ఇలాంటి కేసులో భార్య ఆ వ్యక్తిపై కేసు పెట్టలేదు. ఇదెంత నిరంకుశం’ అని ధర్మాసనం పేర్కొంది. సెక్షన్ 497లో లింగ సమానత్వం లోపించిందని కోర్టు తెలిపింది. 1954లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జీల ధర్మాసనం కూడా సెక్షన్ 497 సమానత్వపు హక్కుకు భంగం వాటిల్లదని, ఈ సెక్షన్‌కు రాజ్యాంగ బద్ధత ఉందంటూ తీర్పునిచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. ఇలాంటి కేసులపై గతంలో ఇచ్చిన తీర్పులను పరిశీలించాల్సిన అవసరముందని ధర్మాసనం పేర్కొంది. భార్యాభర్తలు విడాకులు కోరేందుకు వివాహేతర సంబంధాన్ని ఓ కారణంగా పరిగణించబోమని కూడా కోర్టు వెల్లడించింది. ఎవరి వాదన వారిదే! సెక్షన్ 497కు ఉన్న రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్ విచారణకు స్వీకరించిన ఈ ధర్మాసనంలో జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్నారు. ఈ కేసులో పిటిషనర్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కాళేశ్వరం రాజ్ తన వాదనలు వినిపిస్తూ.. సెక్షన్ 497లోని నిబంధనలు వివాహేతర సంబంధం పెట్టుకున్న స్త్రీ, పురుషులకు వేర్వేరు శిక్షలు సూచిస్తోందని పేర్కొన్నారు. పురుషుడిని నేరస్తుడిగా గుర్తిస్తూ.. మహిళల విషయంలో మాత్రం సానుకూలంగా ఉందన్నారు. కేసులో ఓ వర్గం తరపున సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా వాదించారు. ‘మహిళలు భర్తల చేతిలో ఇంట్లోని ఓ వస్తువుగా మారిపోయారు. ఇక్కడ భర్తతోపాటు సదరు విటుడిని కూడా తీవ్రంగా శిక్షించాల్సిందే’ అని అన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం కేసును ఆగస్టు 7కు వాయిదా వేసింది. మహిళకు లైంగిక స్వేచ్ఛ వివాహేతర సంబంధానికి నో అని చెప్పేందుకు ఓ మహిళకు ఎంత హక్కుందో.. తన లైంగిక స్వతంత్రతను కాపాడుకునేందుకు కూడా అంతే హక్కుంటుందని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘ఓ వ్యక్తి వివాహేతర సంబంధంలో ఉన్నాడని తెలిస్తే.. అతని భార్య ఈ సంబంధం తెంచుకునేందుకు ఇదో కారణం అవుతుంది. ఇలాంటి సంబంధంలో ఉన్న మహిళ తనకు వివాహం అయిందన్న కారణంతో తన లైంగిక స్వతంత్రతను కోల్పోకూడదు’ అని ఆయన పేర్కొన్నారు. ఇంతలో సీజేఐ జోక్యం చేసుకుని.. మానసికంగా మహిళకు వేధింపులుంటేనే విడాకులకు వెళ్లొచ్చని లేనిపక్షంలో వివాహేతర సంబంధాన్ని కారణంగా చూపి విడాకులు కోరలేరని పేర్కొన్నారు. -
సంచలనాల సిరీస్.. రికార్డులు
జొహన్నెస్‌బర్గ్ : ఎన్నో వివాదాలు.. మరెన్నో రికార్డులతో ప్రపంచ క్రికెట్ అభిమానులు దృష్టి సారించిన సిరీస్ దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్. ఈ సిరీస్‌ను 3-1తో ప్రొటీస్ జట్టు కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. సిరీస్ ప్రారంభం ముందు నుంచే మాటల యుద్దం నడిచిన ఈ సిరీస్‌లో ఎన్నో కొత్త రికార్డులు, మరెన్నో చెత్త రికార్డులు నమోదయ్యాయి. చివరి టెస్టులో 492 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సఫారీ జట్టు.. 1970లో అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసిన తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం సాధించడం ఇదే తొలిసారి. ఇక పరుగుల పరంగా 1934 తరువాత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఇదే అతిపెద్ద విజయం. మొత్తంగా చూస్తే పరుగుల పరంగా నాలుగో అతి పెద్ద విజయం. 1928లో ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాపై 675 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇప్పటివరకు ఇదే అతి పెద్ద విజయం. కాగా 1934లో ఆస్ట్రేలియా 562 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. 1911లో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాపై 530 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ మధ్య కాలంలో 2004లో ఆసీస్ 491 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై సాధించిన విజయం టెస్ట్ చరిత్రలో పరుగుల పరంగా ఐదో అతిపెద్ద విజయం. వ్యక్తిగత ప్రదర్శనలోనూ ఆటగాళ్లు కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు. ప్రొటీస్ బౌలర్ ఫిలాండర్ ఆస్ట్రేలియాపై ఒక ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులిచ్చి ఆరుకు పైగా వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ (15/8) ఇప్పటివరకు అత్యుత్తమం. ఈ సిరీస్‌లో మిచెల్ మార్ష్ వికెట్ తీయడంతో ఫిలాండర్ రెండు వందల వికెట్ల క్లబ్లో చేరాడు. ఈ ఘనత సాధించిన ఏడో దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. పాస్టెస్ట్గా రెండొందల వికెట్లు సాధించిన దక్షిణాఫ్రికా నాలుగో బౌలర్‌గానూ నిలిచాడు. ప్రొటీస్ జట్టు ఓపెనర్ మర్క్రామ్ పది టెస్టుల్లోనే వెయ్యి పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ప్రొటీస్ జట్టు మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 12 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. ఇక ఆసీస్ అత్యంత చెత్త ప్రదర్శన చేసిన సిరీస్‌గా ఇది నిలిచిపోతుంది. ఆతిథ్య ఆటగాళ్లు అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రదర్శన చేయగా ఆసీస్ మాత్రం చతికిలపడింది. ఈ సిరీస్‌లో ప్రొటీస్ జట్టు ఆటగాళ్లు ఐదు సెంచరీలు సాధించగా, ఆసీస్ తరుపున ఒక్క ఆటగాడు కూడా సెంచరీ చేయకపోవడం గమనార్హం. -
టీమిండియాకు ఫిలాండర్ వార్నింగ్
జోహెనెస్బర్గ్: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన టీమిండియా.. చివరిదైన మూడో టెస్టుకు సిద్దమవుతోంది. బుధవారం జోహెనెస్‌బర్గ్‌లో ఆరంభమయ్యే మూడో టెస్టులో కనీసం గెలిచి పరువు నిలుపుకోవాలని భారత జట్టు భావిస్తోంది. కాగా, భారత్ జట్టును వైట్‌వాష్ చేస్తామని దక్షిణాఫ్రికా పేసర్ ఫిలాండర్ వార్నింగ్ ఇచ్చాడు. 'మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో దక్కించుకున్నాం. చివరి టెస్టు మ్యాచ్‌ను కూడా సీరియస్‌గా తీసుకుంటున్నాం. ఇది మాకు నామమాత్రపు మ్యాచ్ ఎంతమాత్రం కాదు. సిరీస్‌లో మరొక మ్యాచ్‌గా భావించే మాత్రమే పోరుకు సిద్దమవుతాం. ఇందులో కూడా విజయం కోసం పోరాడుతాం. టీమిండియాను వైట్‌వాష్ చేస్తాం. టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరాలన్నదే మా లక్ష్యం. ఆ క్రమంలో మాకు ప్రతీ మ్యాచ్‌లో గెలుపు ముఖ్యం' అని ఫిలాండర్ పేర్కొన్నాడు. ఆఖరి టెస్టు మ్యాచ్ జరిగే వాండరర్స్ మైదానం సెంచూరియన్ పిచ్‌కు పూర్తిగా విభిన్నమైనదని తెలిపిన ఫిలాండర్.. ఈ పిచ్ బౌన్స్, పేస్‌కు అనుకూలిస్తుందన్నాడు. దాంతో స్సిన్నర్‌తో బరిలోకి దిగాలా..వద్దా అనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నాడు. తమ పేస్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత్‌కు మరోసారి కష్టాలు తప్పవని జోస్యం చెప్పాడు. -
ఫిలాండర్‌ను ఇలా దెబ్బకొట్టండి.. లేదంటే మళ్లీ నష్టం!
కేప్‌టౌన్: ఇటీవల కేప్‌టౌన్‌లో జరిగిన తొలిటెస్టులో భారత క్రికెట్ జట్టు పతనాన్ని శాసించాడు దక్షిణాఫ్రికా పేసర్ వెర్నాన్ ఫిలాండర్. ముఖ్యంగా కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో 6/42తో కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడంతో పాటు జట్టుకు విజయాన్ని అందించాడు ఫిలాండర్. స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ గాయం కారణంగా టెస్టు మధ్యలోనే వైదొలిగినా.. ఫిలాండర్ చెలరేగడంతో సఫారీలకు ఆ లోటు తెలియలేదు. అయితే రెండో టెస్టులో విజయం సాధించి కేప్‌టౌన్ టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోన్న విరాట్ కోహ్లీ సేనకు దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ కొన్ని విలువైన చిట్కాలు చెప్పాడు. వైవిధ్యమైన బంతులతో తొలిటెస్టులో ఇబ్బంది పెట్టిన పేసర్ ఫిలాండర్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక తలలుపట్టుకుంటున్న భారత బ్యాట్స్మెన్లకు క్లూసెనర్ సూచనలు ఫలితాన్ని ఇవ్వనున్నాయి. అత్యంత వేగంగా బంతులు సంధించే బౌలర్లను ఎదుర్కోవాలంటే ప్రత్యర్థి ఆటగాళ్లు క్రీజు నుంచి బయటకు వచ్చి ఆడటం ఉత్తమమని చెబుతున్నాడు. ఇంకా చెప్పాలంటే మీటరు దూరం వరకు క్రీజునుంచి ముందుకొచ్చి ఫిలాండర్ బంతులను ఎదుర్కొంటే ఔటయ్యే సమస్యకు దూరంగా ఉంటూ పరుగులు సాధించవచ్చునని సూచించాడు. కనీసం అరమీటరు ముందుకొచ్చి స్టాన్స్ తీసుకుని పేసర్ల బంతులు ఆడితే బౌలర్ల లయ దెబ్బతిని షార్ట్ లెంగ్త్‌తో బంతులు వేస్తారు. మిగతా రెండు టెస్టులు ఆడే బౌన్సీ పిచ్‌లపై తన చిట్కాలు ఆచరించినా దక్షిణాఫ్రికా పేసర్లను ఎదుర్కొని విజయం సాధిస్తారన్న నమ్మకం లేదన్నాడు. మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ అతికష్టమ్మీద 1-0తో ఔటమితో గానీ లేక 1-1తో సిరీస్ సమం చేయొచ్చునని క్లూసెనర్ అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై క్లూసెనర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆధునిక క్రికెట్లో హార్దిక్ తనదైన మార్కును చూపిస్తూ భారత జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడంటూ కొనియాడాడు. భారత క్రికెట్ జట్టకు దొరికిన ఒక వరంగా హార్దిక్‌ను అభివర్ణించాడు. పేస్ బౌలింగ్‌లో ఇంకా వైవిధ్యాన్ని కనబరిస్తే ప్రపంచ అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా ఎదుగుతాడని క్లూసెనర్ పేర్కొన్నాడు. -
కోహ్లి వికెట్‌ను గుర్తుంచుకుంటా: ఫిలాండర్
కేప్‌టౌన్ టెస్టులో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని అవుట్ చేసిన క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ ఫిలాండర్ తెలిపాడు. ‘కోహ్లి దూకుడైన ఆటగాడు. ముందుగా అతడి ఆట కట్టించాలనుకున్నాం. ఆ అవకాశం నాకే దక్కింది. దీనిని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటా’ అని ఫిలాండర్ అన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి క్రీజ్‌లో ఉన్నపుడు టీమిండియా స్కోరు 71/3... విజయానికి చేయాల్సింది ఇంకా 137 పరుగులే. అప్పటివరకు రెండు స్పెల్స్‌లో విరాట్‌కు ఆఫ్ స్టంప్‌పై 13 బంతులు విసిరిన ఫిలాండర్... ఒక బంతిని మాత్రం లోపలకు సంధించాడు. దానిని ఫ్లిక్ చేయబోయిన కోహ్లి వికెట్ల ముందు దొరికిపోయాడు. -
'కోహ్లిపై మా వ్యూహం అదే'
కేప్‌టౌన్: తమతో జరిగిన తొలి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై పక్కా వ్యూహం రచించిన తరువాతే బరిలోకి దిగామని దక్షిణాఫ్రికా బౌలర్ ఫిలిండర్ స్పష్టం చేశాడు. కోహ్లి క్రీజ్‌లో ఉన్నసమయంలో సరైన ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలనుకున్న విషయాన్ని ముందుగానే సిద్ధం చేసుకున్నామని పేర్కొన్నాడు. అది కోహ్లిని ఏ మాత్రం రెచ్చగొట్టకుండా వైవిధ్యమైన బంతులతో అతన్ని పెవిలియన్‌కు పంపాలనుకోవడం తమ వ్యూహంలో భాగమన్నాడు. 'విరాట్ కోహ్లి చాలా దూకుడుగా బ్యాటింగ్ చేస్తుంటాడు. లక్ష్యం తక్కువగా ఉండటంతో మా జట్టులో ఒకింత కంగారు మొదలైంది. కోహ్లి క్రీజులో ఉంటే. ఏమి చేయాలన్నది ముందే నిర్ణయించుకున్నాం. అతడ్ని రెచ్చగొట్టడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదనుకున్నాం. అలా కోహ్లి సహనంతో ఆడుతున్న సమయంలోనే అవుట్ చేయాలనేది మా ప్లాన్. అలా కోహ్లిని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తొందరగా పెవిలియన్‌కు పంపి సక్సెస్ అయ్యాం. దాంతో మా విజయం కూడా సునాయాసమైంది' అని ఫిలిండర్ పేర్కొన్నాడు. -
'మాకు కొత్త కల్లిస్ దొరికాడు'
నాటింగ్హమ్:ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో ఆల్ రౌండర్ పాత్ర పోషించి దక్షిణాఫ్రికా భారీ విజయంలో పాలుపంచుకున్న ఫిలాండర్ పై కెప్టెన్ డు ప్లెసిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. తమ జట్టుకు కొత్త కల్లిస్ దొరికాడంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఫిలాండర్ కచ్చితంగా తమ 'కొత్త కల్లిస్' అని కొనియాడాడు. ఇంగ్లండ్ తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 340 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఫిలాండర్ 54 పరుగులు నమోదు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్ లో తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు సాధించాడు. ప్రత్యేకంగా ఫిలాండర్ ప్రదర్శనపై డు ప్లెసిస్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. 'అతనొక అసాధారణమైన క్రికెటర్. ఎప్పుడు పిచ్ లో కి అడుగుపెట్టిన తనదైన ముద్రవేయడానికి ఫిలాండర్ వందశాతం యత్నిస్తాడు. బహుశా అదే అతన్ని బెస్ట్ గా నిలబెడుతూ ఉండొచ్చు. ప్రధానంగా ఫిలాండర్ టెక్నిక్ చాలా బాగుంటుంది. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి కొన్ని విలువైన పరుగుల్ని సాధించి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు'అని డు ప్లెసిస్ తెలిపాడు. -
110 పరుగులకే కుప్పకూలిన లంక
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా బౌలర్లు ఫిలాండర్ (4/27), రబడ (4/37) చెలరేగడంతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే ఆలౌటైంది. తరంగ (26)దే అత్యధిక స్కోరు. ఫలితంగా దక్షిణాఫ్రికాకు మొదటి ఇన్నింగ్స్‌లో 282 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే లంకకు ఫాలోఆన్ ఇవ్వని సఫారీలు రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసి తమ ఓవరాల్ ఆధిక్యాన్ని 317 పరుగులకు పెంచుకున్నారు. అంతకుముందు 297/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 392 పరుగులకు ఆలౌటైంది. డి కాక్ (124 బంతుల్లో 101; 11 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకోగా, లహిరు కుమారకు 6 వికెట్లు దక్కాయి. ఈ ఇన్నింగ్స్‌లో కైల్ అబాట్ వికెట్‌తో శ్రీలంక స్పిన్నర్ రంగన హెరాత్, చమిందా వాస్ (355)ను అధిగమించి ఆ దేశం తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మురళీధరన్ (795) తర్వాత రెండో స్థానానికి (356) చేరుకున్నాడు. -
నిప్పులు చెరిగిన ఫిలాండర్
85 పరుగులకే ఆసీస్ ఆలౌట్ దక్షిణాఫ్రికా 171/5 హోబర్ట్: దక్షిణాఫ్రికా పేసర్ ఫిలాండర్ (5/21) నిప్పులు చెరిగాడు. విరామమివ్వకుండా ఆస్ట్రేలియా ఇన్నింగ్‌సను చావుదెబ్బ తీశాడు. దీంతో రెండో టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ తొలి ఇన్నింగ్సలో అనూహ్యంగా 32.5 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ స్మిత్ (80 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు), జో మెన్నీ (10)... వీళ్లిద్దరివే రెండంకెల స్కోర్లు కాగా... మిగతా బ్యాట్స్‌మెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫిలాండర్‌తో పాటు కైల్ అబాట్ (3/41)కూడా కంగారూ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. దీంతో జట్టు స్కోరు రెండో పరుగు వద్దే ఆస్ట్రేలియా పతనం ఆరంభమైంది. రెండుకే 2 వికెట్లు, ఎనిమిదికి 4 వికెట్లు, 31కే ఆరు వికెట్లు... ఇలా ఆసీస్ ఇన్నింగ్స 85 పరుగులకే పేక మేడలా కూలింది. ఆదుకునేందుకు కెప్టెన్ క్రీజులో ఉన్నా... అవతలివైపు మరొక బ్యాట్స్‌మన్‌ను నిలవనీయకుండా ఫిలాండర్, అబాట్ దెబ్బ మీద దెబ్బ తీశారు. రబడాకు ఒక వికెట్ దక్కింది. అనంతరం తొలి ఇన్నింగ్స మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 55 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆమ్లా (67 బంతుల్లో 47; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడగా, బవుమా (38 బ్యాటింగ్), డికాక్ (28 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆరంభంలో స్టార్క్ (3/49) ధాటికి సఫారీ జట్టు 46 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోరుుంది. హజెల్‌వుడ్‌కు 2 వికెట్లు దక్కారుు. హోబర్ట్ వేదికపై ఆసీస్‌కిది రెండో అత్యల్ప స్కోరు. 1984లో వెస్టిండీస్‌తో 76 పరుగులకే ఆలౌటైంది. -
ఆ మహిళకు పెళ్లైంది, కానీ..
నాగోలు: ఆ మహిళకు పెళ్లైంది, కానీ మళ్లీ వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధమే ఆ మహిళ మరణానికి కారణమైంది. అసలు విషయానికొస్తే.. వివాహేతర సంబంధం కలిగి ఉన్న మహిళ వద్ద బంగారాన్ని కాజేయడమేగాక ఆమెను దారుణంగా హత్య చేసిన సంఘటనలో ఇద్దరు నిందితులను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.1.30 లక్షలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం సైబరాబాద్ ఈస్ట్ కమిషనర్ మహేష్ భగవత్ కేసు వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్టకు చెందిన అర్చన(24), రామస్వామి ప్రేమవివాహం చేసుకుని ద్వారకామయినగర్లో నివాసం ఉంటున్నారు. తమిళనాడు మధురై జిల్లాకు చెందిన స్వామినాయుడు రాజ్‌కుమార్ (30) నగరానికి వలస వచ్చి బండ్లగూడ పటేల్‌నగర్‌లో నివాసముంటూ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తుండగా, అదే ప్రాంతానికి చెందిన ముత్తు రాము చాంద్రాయణగుట్టలో నివాసముంటూ పాపడాల వ్యాపారం చేసే వాడు. అర్చనతో స్వామినాయుడికి వివాహేతర సంబంధం ఉండటమేగాక ఆర్థిక లావాదేవీలు నడుస్తుండేవి. ఈ నేపథ్యంలో ఆమె వద్ద ఉన్న డబ్బు, బంగారాన్ని కాజేయాలనుకున్న స్వామినాయుడు ముత్తురాముతో కలిసి ఆమెను హతమార్చాలని పథకం పన్నాడు. గత నెల 28న అర్చన ఇంటికి వెళ్లి ఆమెతో కలిసి మద్యం సేవించారు. మత్తులో ఉన్న అర్చన గొంతు నులిమి హత్య చేసి బంగారు గొలుసు, చెవి కమ్మలు, నగదు, ఇతర వస్తువులను తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా నమ్మించేందుకు మృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడదీసి బయటి నుంచి గడియపెట్టి పారిపోయారు. ఇదిలా ఉండగా అర్చన దత్తతకు తీసుకున్న చిన్నారి ఏడుపువిని వచ్చిన స్థానికులు వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడ లభించిన మద్యం బాటిళ్లు, సిగరెట్లు, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ.1.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్, వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్, సీఐ మురళీకృష్ణ, ఎస్ఐలు మహేష్, నాగరాజు, విజయ్ పాల్గొన్నారు. -
అనుమానమే పెనుభూతమై..
ప్రియురాలిని హతమార్చి తానూ ఆత్మహత్య శ్రీకాళహస్తిః ప్రియుురాలిని హతమార్చి తర్వాత తాను రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడో వివాహితుడు. సోవువారం రాత్రి ఈ దుర్ఘటన శ్రీకాళహస్తిలో జరిగింది. శ్రీకాళహస్తి వన్‌టౌన్ సీఐ చిన్నగోవిందు కథనం మేరకు వివరాలిలా .. కేవీబీ పురం వుండలం కళత్తూరుకు చెందిన గుణశేఖర్(38)కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల కిందట అదే వుండలం రారుుపేడుకు చెందిన అరుణ(33)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అరుణ వివాహిత అరుునప్పటికీ భర్తతో విభేదా లతో ఒంటరిగా ఉంటోంది. అరుుతే ఇటీవల అరుణ వురో వ్యక్తితో స్నేహంగా ఉన్నట్లు గుణశేఖర్ అనుమానిం చాడు. దీంతో ఆమెను అంతమొందించాలని పథకం రచించాడు. అందులో భాగంగా శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేటు లాడ్జికి ఆమెను ఆదివారం రాత్రి తీసుకువచ్చాడు. సోవువారం ఆమెను గదిలో ఓ రోప్ సాయుంతో గొంతు బిగించి హతవూర్చాడు. వుృతి చెందిందని నిర్దారించుకున్న గుణశేఖర్ గదికి తాళం వేసుకుని శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడ సోవువారం రాత్రి రైలుకింద పడి వుృతి చెందాడు. గదినుంచి దుర్వాసన రావడంతో లాడ్జీ సిబ్బంది గుర్తించి పోలీసులకు సవూచారం అందించారు. వుంగళవారం పోలీసులు తాళాలు పగలగొట్టి గదిలోకి వెళ్లడంతో అరుణ వుృతదేహం రోప్‌కు వేలాడుతూ కనిపించింది. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పట్టాలపై రైల్వే పోలీసులు ఓ వ్యక్తి వుృతదేహాన్ని గుర్తిం చిన విషయూన్ని తెలుసుకున్న శ్రీకాళహస్తి పట్టణ పోలీసు సిబ్బంది అక్కడికు వెళ్లి పరిశీలించారు. వుృతుని జేబులో లాడ్జికి చెందిన తాళంచెవి ఉండడాన్ని గుర్తించి కేవీబీపురంలో విచారణ చేపట్టారు. దీంతో హత్యోదంతానికి సం బంధించిన వాస్తవాలు వెలుగుచూశారుు. -
వీడిన చిక్కుముడి
హతుడు జనార్దన్‌రెడ్డికాలనీ వాసి మేమే హత్య చేశామని నిందితుల లొంగుబాటు? నెల్లూరు (క్రైమ్): బుజబుజనెల్లూరు లింగాల చెరువుకట్టపై గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితి మృతి కేసు చిక్కుముడి వీడింది. మృతుడు వెంకటేశ్వరపురం జనార్దన్‌రెడ్డికాలనీకి చెందిన వాడని, హత్యకు గురైనట్లు తేలింది. వివరాల్లోకి వెళ్లితే.. వెంకటేశ్వపురం జనార్దన్‌రెడ్డికాలనీకి చెందిన పి.శ్రీనివాసులు (35),ఉషారాణి దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాసు లు పప్పులవీధిలో చెక్కరిక్షాల రిపేరు, టైర్ల అంగడి నిర్వహిస్తున్నాడు. అయి తే భార్య ప్రవర్తనపై ఆది నుంచి అతనికి అనుమానం ఉండేది. ఈ క్రమంలో దంపతుల నడుమ విభేదాలు పొడ చూపాయి. అయితే ఉషారాణి ఇంటి వద్దనే చిల్లర దుకాణం నిర్వహిస్తోంది. వీరి ఇంటి వద్దనే సలీమ్ అనే ఆటోడ్రైవర్ అద్దెకు ఉంటున్నాడు. సలీమ్ స్నేహితుడు అన్వర్‌తో పరిచయం ఏర్పడి ఆమె అతనితో సన్నిహితంగా ఉండేది. ఈ నెల రెండో వారంలో వారం రోజుల పాటు ఆమె పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయింది. ఇంటికి తిరిగి రాగా ఎక్కడికి వెళ్లావని భర్త నిలదీయడంతో మరోమారు వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 18న సలీమ్, అన్వర్ నీతో మాట్లాడాలంటూ శ్రీనివాసులను పెన్నా వారధిలోకి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగే క్రమంలో వారి మధ్య మాటామాటా పెరగడంతో వారు శ్రీనివాసులను కొట్టా రు. అతను అక్కడికక్కడే మృతి చెందాడని సమాచారం. దీంతో సలీమ్, అన్వ ర్ అతన్ని బైక్‌పై కూర్చొబెట్టుకుని బుజబుజనెల్లూరు లింగాల చెరువుకట్ట వద్ద పడేసి వెళ్లినట్లు తెలిసింది. గుర్తుతెలియని మృతదేహం చెరువుకట్ట ఉందని ఈ నెల 20వ తేదీన స్థానికులు ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ జగత్సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిందితులు తామే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. సలీమ్‌తో మృతుడి భార్యకు వివాహేతర సంబంధం ఉందని, ఈ నేపథ్యంలోనే హత్య జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటన ఆవేశంలో జరిగిందా.. పథకం ప్రకారం హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉసురు తీసిన వివాహేతర సంబంధం
నూజివీడులో వ్యక్తి దారుణహత్య నూజివీడు : నూజివీడు పట్టణం ఎన్టీఆర్ కాలనీ లో శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మోతే నాగరాజు (35) దారుణహత్యకు గురయ్యాడు. పాతకక్షలు పురస్కరించుకుని అతని వ్యతిరేక వర్గీయులు కాపుకాసి ఇనుపరాడ్డులతో దాడిచేసి తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతనికి సంబంధించిన పలువురిపై దాడిచేసి కొట్టడంతో ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం ఎన్టీఆర్ కాలనీకి చెందిన మోతే నాగరాజు కిరాణా, ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇరువురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అదే కాలనీకి చెందిన మోతే వినోద్‌కు, నాగరాజుకు మధ్య మూడేళ్లుగా పాతకక్షలున్నాయి. వినోద్ భార్య అయిన లిడియాకు, నాగరాజు బావమరిది కుమారుడు అయిన కల్యాణి బాబూరావుకు మధ్య వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడడానికి నాగరాజే కారణమని వినోద్ భావించి అతనిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం గొడవలు జరుగగా అప్పట్లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అనంతరం గొడవలు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల క్రితం కల్యాణి సాయిబాబు అల్లుడైన కనకారావుపై వినోద్ వర్గం దాడికి యత్నించగా అతను పారిపోయాడు. దీనిపై కనకారావు ఈనెల 26న పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనికి కౌంటర్‌గా మోతే వినోద్ సైతం ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మోతే నాగరాజును ఎలాగైనా మట్టుబెట్టాలనే పథకం రచించారు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో పాల ప్యాకెట్లు తెస్తున్న మోతే నాగరాజును కాలనీలోనే వినోద్, దయాకర్, ప్రేమ్‌కుమార్, కార్తీక్ తదితరులు ఆపి ఒక్కసారిగా ఇనుపరాడ్డులతో దాడిచేసి తలపై విచక్షణా రహితంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని కుటుంబ సభ్యులపైనా దాడి అనంతరం అతనికి సంబంధించిన వారి ఇళ్లపై దాడిచేసి అతని భార్య మోతే మల్లేశ్వరి (33), కుమార్తె రూతు (16), తల్లి కోటమ్మ (55), బావమరిది కల్యాణి సాయిబాబు (55), సాయిబాబు కుమార్తెలైన రంగమ్మ (33), గీత (25)లపై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను 108 వాహనంలో పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. నాగరాజును పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లుగా నిర్ధారించారు. మృతుడి భార్య మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు మోతే వినోద్, మోతే దయాకర్, మోతే ప్రేమ్‌కుమార్, మోతే లిడియా, పస్తం దుర్గారావు, పస్తం కార్తీక్, పస్తం నాగరాజు, పస్తం కేశవులు, పస్తం అయ్యప్పలపై పోలీసులుకేసులు నమోదు చేశారు. ఆసుపత్రిని సందర్శించిన డీఎస్పీ సమాచారం అందుకున్న నూజివీడు డీఎస్పీ వల్లూరు శ్రీనివాసరావు ఏరియా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. దాడికి సంబంధించిన కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. నిత్యం గొడవలకు కారణమైన వినోద్‌ను కాలనీలో లేకుండా చేయాలని బాధితులతో పాటు కాలనీవాసులు డీఎస్పీని కోరారు. ఇన్చార్జి సీఐ జయకుమార్ ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. పట్టణ ఎస్ఐలు బోనం ఆదిప్రసాద్, షేక్ జాబీర్, రూరల్ ఎస్ఐ చిన్న నాగప్రసాద్ క్షతగాత్రుల నుంచి వివరాలు సేకరించారు. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు దాడికి పాల్పడిన నిందితులు మోతే వినోద్, మోతే ప్రేమ్‌కుమార్, పస్తం కార్తీక్, పస్తం దుర్గారావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని వేరే స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. వీరు ప్రత్యర్థులపై దాడిచేసిన అనంతరం తమకు కూడా గాయాలయ్యాయంటూ ఏరియా ఆసుపత్రికి రాగా అక్కడ వారికి వైద్యం చేయించిన తరువాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ప్రేయసి ఇంటి ముందు యువకుడి మృతదేహం
► ప్రేయసి ఇంటి ముందు పునాదిలో యువకుడి మృతదేహం ► కుక్కలు తవ్వడంతో ఆలస్యంగా వెలుగులోకి.. ► పది రోజుల కిందట హతమార్చి పాతి పెట్టి ఉంటారన్న అనుమానాలు ► మృతుడు అనంతపురం మరవకొట్టాలకు చెందిన తిరుపాల్‌గా గుర్తింపు పెళ్లైన పదేళ్లకు పరస్త్రీ వ్యామోహంలో పడి న అతను భార్యను నిర్లక్ష్యం చేశాడు. అంతటితో ఆగక తనతో వివాహేతర సంబంధం కలిగిన మహిళతోనే ఏకంగా వేరుగా ఇల్లు తీసుకుని సహజీవనం సాగించాడు. పదిహేను రోజులుగా భర్త ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ భార్య విషయాన్ని తన అత్తమామలకు తెలిపింది. వారు ఎలాగోలా తమ కుమారుడి జాడ కనుగొని బుద్ధి చెప్పారు. అంతే.. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో పది రోజులు తరువాత ప్రియురాలి నివాసం ముందు నిర్మించిన ఇంటి పునాదిలో అతని మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. - రాప్తాడు రాప్తాడు మండలం చిన్మయానగర్ సమీపంలోని కళాకారుల కాలనీలో కలకలం రేగింది. అనంతపురంలోని మరవకొట్టాలకు చెందిన లక్ష్మిదేవి, కొండయ్య దంపతుల కుమారుడు సాకే తిరుపాల్(30) మృతదేహం లభ్యం కావడం అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ప్రియురాలి ఇంటి ముందే ఈ ఘటన వెలుగు చూడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ధర్మవరం గీతానగర్‌కు చెందిన లక్ష్మీదేవి కుమార్తె దుర్గతో పదేళ్ల కిందట తిరుపాల్ వివాహమైంది. సజావుగా సాగిపోతున్న వారి కాపురంలోకి మరో మహిళ ప్రవేశంతో కలతలు మొదలయ్యాయి. అప్పటి నుంచి అతను చిన్మయానగర్‌లోని కళాకారుల కాలనీలో వేరు కాపురం పెట్టి ఏకంగా సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. పది హేను రోజులుగా ఇంటికి వెళ్లకపోవడంతో అనుమానం వచ్చిన భార్య విషయాన్ని అత్తమామల దృష్టికి తీసుకెళ్లింది. వారు ఎలాగోలా తమ కుమారుడు వేరు కాపురం పెట్టిన ప్రదేశాన్ని కనుగొని ఇద్దరినీ మందలించారు. ఈ సంఘటన జరిగి పది రోజులు కావస్తోంది. వెలుగులోకి వచ్చింది ఇలా... తిరుపాల్ సహజీవనం చేసిన మహిళ ఉండే ఇంటి ముందే పునాది నుంచి గురువారం దుర్వాసన వచ్చింది. అంతలోనే కుక్కలన్నీ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశాయి. దీంతో ఆ వాసనను అక్కడి పరిసర ప్రాంతాల జనం భరించలేకపోయారు. ఇరుగుపొరుగు వారు పునాది వద్దకు వెళ్లి చూడగా ఎముకలు, పుర్రె కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి పోలీసులు సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తమ సిబ్బందితో కలసి హుటాహుటిన నేర స్థలికి చేరుకున్నారు. ఎముకలు, పుర్రె ఇతర భాగాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిలో పడి ఉన్న దుస్తులు, చెప్పులు చూసి.. అనంతపురం మరవ కొట్టాలకు చెందిన తిరుపాల్‌గా గుర్తించారు. మృతుడి భార్య, తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. ప్రియురాలిపైనే అనుమానాలు తనతో సహజీవనం చేస్తున్న విషయాన్ని తెలుసుకుని తిరుపాల్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని ఇద్దరినీ మందలించడాన్ని జీర్ణించుకోలేని ప్రియురాలే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు. పది రోజుల నుంచి ఆమె స్థానికంగా లేకపోవడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కుమారుడి కళ్లెదుటే తల్లిపై సామూహిక అత్యాచారం
బెంగళూరులో కీచక పర్వం బెంగళూరు: బెంగళూరులో పద్నాలుగేళ్ల కుమారుడి ఎదురుగానే అతడి తల్లి(35)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ తతంగాన్ని నిందితులు సెల్ఫోన్లో చిత్రీకరించారు. ప్రధాన నిందితుడికి సదరు మహిళతో విభేదాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యాచార ఘటన చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. కుటుంబ కలహాల వల్ల భర్తకు దూరమైన మహిళ తన కుమారుడితో కలసి హెచ్ఎస్ఆర్ లేఔట్ పరిధిలోని నాయకనహళ్లిలో ఉంటోంది. ఈ నెల 6న అర్ధరాత్రి స్థానిక జిల్లా పంచాయతీ సభ్యుడైన సంతోష్‌రెడ్డి, అతడి అనుచరులు బాధితురాలి ఇంటికి వెళ్లి అత్యాచారం చేశారు. ఆమె కుమారుడిని బంధించి అతడి కళ్లెదుటే రాక్షసంగా వ్యవహరించారు. దారుణాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే సెల్‌ఫోన్‌లోని వీడియోను అందరికీ చూపిస్తామని బెదిరించారు. మొదట్లో భయపడిన బాధితురాలు ఎవరికీ చెప్పలేదు. చివరకు స్నేహితులు అండగా నిలవడంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు సంతోష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇదిలా ఉండగా సంతోష్‌రెడ్డి వాదన మరోలా ఉంది. సదరు మహిళ తమ బంధువుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని, దీనివల్ల వారి కుటుంబంలో కలతలు చెలరేగాయని చెప్పాడు. ఈ విషయమై ప్రశ్నించడానికి మాత్రమే ఆమె ఇంటికి వెళ్లామని తెలిపాడు. -
ఫాలో ఆన్‌లో విండీస్
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు సెంచూరియన్: దక్షిణాఫ్రికా పేసర్లు ఫిలాండర్ (4/29), మోర్నీ మోర్కెల్ (3/55) బౌలింగ్ ధాటికి వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. సూపర్‌స్పోర్ట్స్ పార్క్‌లో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు శుక్రవారం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 201 పరుగులకే కుప్పకూలింది. డెవాన్ స్మిత్ (74 బంతుల్లో 35; 6 ఫోర్లు), బ్రాత్‌వైట్ (61 బంతుల్లో 34; 5 ఫోర్లు), మార్లన్ శామ్యూల్స్ (66 బంతుల్లో 33; 5 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. తొలి వికెట్‌కు 72 పరుగులు జత చేరినా ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలింది. దీంతో సఫారీ జట్టుకు 351 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అనంతరం ఫాలోఆన్ ఆడేందుకు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. క్రీజులో లియోన్ జాన్సన్ (73 బంతుల్లో 33 బ్యాటింగ్; 6 ఫోర్లు), శామ్యూల్స్ (26 బంతుల్లో 13 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నారు. విండీస్ ఇంకా 275 పరుగులు వెనుకబడి ఉంది. -
టాంపరింగ్ కు పాల్పడ్డ క్రికెటర్ కు జరిమానా
దుబాయ్: శ్రీలంకతో జరుగుతున్నతొలి టెస్టు మ్యాచ్ లో బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డ దక్షిణాఫ్రికా బౌలర్ వెర్నాన్ ఫిలిందర్ కు మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత పడింది. తొలి టెస్టు మ్యాచ్ లో భాగంగా మూడో రోజు ఆటలో ఫిలిందర్ బాల్ టాంపరింగ్ కు పాల్పడినట్లు రుజువు కావడంతో అతనికి జరిమానా విధించారు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం టెస్ట్ మ్యాచ్ ల్లో టాంపరింగ్ కు పాల్పడితే 42.3 సెక్షన్ ను వర్తింపచేస్తారు. సాధారణంగా టాంపరింగ్ పాల్పడిన క్రికెటర్లకు పాయింట్ల ఆధారంగా మ్యాచ్ ఫీజులో 50 నుంచి 100 శాతం వరకూ కోత విధించడంతో పాటు ఒక టెస్టు మ్యాచ్, రెండు వన్డే మ్యాచ్ లు నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంది. శుక్రవారం జరిగిన మూడో రోజు ఆటలో బంతిని ఫిలిందర్ చేతి వేళ్లతో గోకుతూ నిబంధనలు ఉల్లంఘించాడు. దీనిని ఫీల్డ్ అంపైర్లు బిల్లీ బౌడన్, రిచర్డ్ కెట్లిబారగ్ తో సహా మూడో, నాల్గో అంపైర్లు టీవీ పుటేజీలో పరీక్షించారు. కాకపోతే ఎటువంటి విచారణ లేకుండానే ఫిలిందర్ టాంపరింగ్ కు పాల్పడినట్లు అంగీకరించాడు.