నిప్పులు చెరిగిన ఫిలాండర్
85 పరుగులకే ఆసీస్ ఆలౌట్ దక్షిణాఫ్రికా 171/5
హోబర్ట్: దక్షిణాఫ్రికా పేసర్ ఫిలాండర్ (5/21) నిప్పులు చెరిగాడు. విరామమివ్వకుండా ఆస్ట్రేలియా ఇన్నింగ్‌సను చావుదెబ్బ తీశాడు. దీంతో రెండో టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ తొలి ఇన్నింగ్‌సలో అనూహ్యంగా 32.5 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ స్మిత్ (80 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు), జో మెన్నీ (10)... వీళ్లిద్దరివే రెండంకెల స్కోర్లు కాగా... మిగతా బ్యాట్స్‌మెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫిలాండర్‌తో పాటు కైల్ అబాట్ (3/41)కూడా కంగారూ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. దీంతో జట్టు స్కోరు రెండో పరుగు వద్దే ఆస్ట్రేలియా పతనం ఆరంభమైంది. రెండుకే 2 వికెట్లు, ఎనిమిదికి 4 వికెట్లు, 31కే ఆరు వికెట్లు... ఇలా ఆసీస్ ఇన్నింగ్‌స 85 పరుగులకే పేక మేడలా కూలింది.
ఆదుకునేందుకు కెప్టెన్ క్రీజులో ఉన్నా... అవతలివైపు మరొక బ్యాట్స్‌మన్‌ను నిలవనీయకుండా ఫిలాండర్, అబాట్ దెబ్బ మీద దెబ్బ తీశారు. రబడాకు ఒక వికెట్ దక్కింది. అనంతరం తొలి ఇన్నింగ్‌స మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 55 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆమ్లా (67 బంతుల్లో 47; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడగా, బవుమా (38 బ్యాటింగ్), డికాక్ (28 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆరంభంలో స్టార్క్ (3/49) ధాటికి సఫారీ జట్టు 46 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోరుుంది. హజెల్‌వుడ్‌కు 2 వికెట్లు దక్కారుు. హోబర్ట్ వేదికపై ఆసీస్‌కిది రెండో అత్యల్ప స్కోరు. 1984లో వెస్టిండీస్‌తో 76 పరుగులకే ఆలౌటైంది.