all out Australia
-
లంచ్ విరామం.. స్మిత్ సెంచరీ, ఆస్ట్రేలియా 416 ఆలౌట్
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌట్ అయింది. స్టీవ్ స్మిత్ 110 పరుగులతో సెంచరీ చేయగా.. ట్రెవిస్ హెడ్ 77, డేవిడ్ వార్నర్ 66 పరుగులు చేశారు. 339/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ తొలి సెషన్లోనే తమ పోరాటాన్ని ముగించింది. రెండోరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే అలెక్స్ కేరీ వెనుదిరిగాడు. ఆ తర్వాత స్టార్క్ కూడా 6 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ దశలో కమిన్స్ స్మిత్‌కు జత కలిశాడు. ఇద్దరు కలిసి 8వ వికెట్‌కు 35 పరుగులు జోడించి జట్టు స్కోరును 400 దాటించారు. ఈ దశలో స్మిత్ టెస్టుల్లో 32వ సెంచరీ మార్క్‌ను సాధించాడు. అయితే కాసేపటికే స్మిత్ ఔట్ కావడం.. తర్వాత ఇంగ్లండ్ బౌలర్లు టెయిలెండర్ల పని కానిచ్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, ఓలీ రాబిన్సన్లు చెరో మూడు వికెట్లు తీయగా.. జో రూట్ 2, అండర్సన్, బ్రాడ్లు ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ లంచ్ విరామ సమయానికి వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. జాక్ క్రాలీ 6, బెన్ డకెట్ ఏడు పరుగులతో ఆడుతున్నారు. చదవండి: టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్ దిగ్గజం సరసన -
ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే.. 141 పరుగులకే కంగారులు ఆలౌట్!
టౌన్స్‌విల్లీ వేదికగా మూడో వన్డేలో ఆస్ట్రేలియాకు జింబాబ్వే భారీ షాక్ ఇచ్చింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 141 పరుగులకే జింబాబ్వే కుప్పకూల్చింది. జింబాబ్వే బౌలర్లలో స్పిన్నర్ ర్యాన్ బర్ల్ 5 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు. అతడితోపాటు ఎవాన్స్ రెండు, విలియమ్స్, న్యాచీ, నగర్వా తలా వికెట్ సాధించారు. ఇక ఆసీస్ సాధించిన 141 పరుగులలో డేవిడ్ వార్నర్ ఒక్కడే 94 పరుగులు చేయగా.. మిగితా బ్యాటర్లు మొత్తం కలిసి కేవలం 47 పరుగులు మాత్రమే చేశారు. ఇక ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది. కాగా 18 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఆడుతోన్న జింబాబ్వే కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలని భావిస్తోంది. 141 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 13 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. చదవండి: Asia Cup 2022: ఇదేం బౌలింగ్ రా బాబు.. అప్పుడు సూర్య! ఇప్పుడు కుష్దిల్.. -
నిప్పులు చెరిగిన ఫిలాండర్
85 పరుగులకే ఆసీస్ ఆలౌట్ దక్షిణాఫ్రికా 171/5 హోబర్ట్: దక్షిణాఫ్రికా పేసర్ ఫిలాండర్ (5/21) నిప్పులు చెరిగాడు. విరామమివ్వకుండా ఆస్ట్రేలియా ఇన్నింగ్‌సను చావుదెబ్బ తీశాడు. దీంతో రెండో టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ తొలి ఇన్నింగ్సలో అనూహ్యంగా 32.5 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ స్మిత్ (80 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు), జో మెన్నీ (10)... వీళ్లిద్దరివే రెండంకెల స్కోర్లు కాగా... మిగతా బ్యాట్స్‌మెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫిలాండర్‌తో పాటు కైల్ అబాట్ (3/41)కూడా కంగారూ బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. దీంతో జట్టు స్కోరు రెండో పరుగు వద్దే ఆస్ట్రేలియా పతనం ఆరంభమైంది. రెండుకే 2 వికెట్లు, ఎనిమిదికి 4 వికెట్లు, 31కే ఆరు వికెట్లు... ఇలా ఆసీస్ ఇన్నింగ్స 85 పరుగులకే పేక మేడలా కూలింది. ఆదుకునేందుకు కెప్టెన్ క్రీజులో ఉన్నా... అవతలివైపు మరొక బ్యాట్స్‌మన్‌ను నిలవనీయకుండా ఫిలాండర్, అబాట్ దెబ్బ మీద దెబ్బ తీశారు. రబడాకు ఒక వికెట్ దక్కింది. అనంతరం తొలి ఇన్నింగ్స మొదలుపెట్టిన దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 55 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఆమ్లా (67 బంతుల్లో 47; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడగా, బవుమా (38 బ్యాటింగ్), డికాక్ (28 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆరంభంలో స్టార్క్ (3/49) ధాటికి సఫారీ జట్టు 46 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోరుుంది. హజెల్‌వుడ్‌కు 2 వికెట్లు దక్కారుు. హోబర్ట్ వేదికపై ఆసీస్‌కిది రెండో అత్యల్ప స్కోరు. 1984లో వెస్టిండీస్‌తో 76 పరుగులకే ఆలౌటైంది.