
టౌన్స్‌విల్లీ వేదికగా మూడో వన్డేలో ఆస్ట్రేలియాకు జింబాబ్వే భారీ షాక్ ఇచ్చింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 141 పరుగులకే జింబాబ్వే కుప్పకూల్చింది. జింబాబ్వే బౌలర్లలో స్పిన్నర్ ర్యాన్ బర్ల్ 5 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు.
అతడితోపాటు ఎవాన్స్ రెండు, విలియమ్స్, న్యాచీ, నగర్వా తలా వికెట్ సాధించారు. ఇక ఆసీస్ సాధించిన 141 పరుగులలో డేవిడ్ వార్నర్ ఒక్కడే 94 పరుగులు చేయగా.. మిగితా బ్యాటర్లు మొత్తం కలిసి కేవలం 47 పరుగులు మాత్రమే చేశారు.
ఇక ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది. కాగా 18 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై ఆడుతోన్న జింబాబ్వే కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలని భావిస్తోంది. 141 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 13 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది.
చదవండి: Asia Cup 2022: ఇదేం బౌలింగ్ రా బాబు.. అప్పుడు సూర్య! ఇప్పుడు కుష్‌దిల్..
Comments
Please login to add a commentAdd a comment