కేప్‌టౌన్: తమతో జరిగిన తొలి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లిపై పక్కా వ్యూహం రచించిన తరువాతే బరిలోకి దిగామని దక్షిణాఫ్రికా బౌలర్ ఫిలిండర్ స్పష్టం చేశాడు. కోహ్లి క్రీజ్‌లో ఉన్నసమయంలో సరైన ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలనుకున‍్న విషయాన్ని ముందుగానే సిద్ధం చేసుకున్నామని పేర్కొన్నాడు. అది కోహ్లిని ఏ మాత్రం రెచ‍్చగొట్టకుండా వైవిధ్యమైన బంతులతో అతన్ని పెవిలియన్‌కు పంపాలనుకోవడం తమ వ్యూహంలో భాగమన్నాడు.
'విరాట్ కోహ్లి చాలా దూకుడుగా బ్యాటింగ్ చేస్తుంటాడు. లక్ష్యం తక్కువగా ఉండటంతో మా జట్టులో ఒకింత కంగారు మొదలైంది. కోహ్లి క్రీజులో ఉంటే. ఏమి చేయాలన్నది ముందే నిర్ణయించుకున్నాం. అతడ్ని రెచ్చగొట్టడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదనుకున్నాం. అలా కోహ్లి సహనంతో ఆడుతున్న సమయంలోనే అవుట్ చేయాలనేది మా ప్లాన్. అలా కోహ్లిని రెండు ఇన‍్నింగ్స్‌ల్లోనూ తొందరగా పెవిలియన్‌కు పంపి సక్సెస్ అయ్యాం. దాంతో మా విజయం కూడా సునాయాసమైంది' అని ఫిలిండర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment