జోహెనెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను ఇప్పటికే కోల్పోయిన టీమిండియా.. చివరిదైన మూడో టెస్టుకు సిద్దమవుతోంది. బుధవారం జోహెనెస్‌బర్గ్‌లో ఆరంభమయ్యే మూడో టెస్టులో కనీసం గెలిచి పరువు నిలుపుకోవాలని భారత జట్టు భావిస్తోంది. కాగా, భారత్ జట్టును వైట్‌వాష్ చేస్తామని దక్షిణాఫ్రికా పేసర్ ఫిలాండర్ వార్నింగ్ ఇచ్చాడు.
'మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో దక్కించుకున్నాం. చివరి టెస్టు మ్యాచ్‌ను కూడా సీరియస్‌గా తీసుకుంటున్నాం. ఇది మాకు నామమాత్రపు మ్యాచ్ ఎంతమాత్రం కాదు. సిరీస్‌లో మరొక మ్యాచ్‌గా భావించే మాత్రమే పోరుకు సిద్దమవుతాం. ఇందులో కూడా విజయం కోసం పోరాడుతాం. టీమిండియాను వైట్‌వాష్ చేస్తాం. టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరాలన్నదే మా లక్ష్యం. ఆ క్రమంలో మాకు ప్రతీ మ్యాచ్‌లో గెలుపు ముఖ్యం' అని ఫిలాండర్ పేర్కొన్నాడు. ఆఖరి టెస్టు మ్యాచ్ జరిగే వాండరర్స్ మైదానం సెంచూరియన్ పిచ్‌కు పూర్తిగా విభిన‍్నమైనదని తెలిపిన ఫిలాండర్.. ఈ పిచ్ బౌన్స్, పేస్‌కు అనుకూలిస్తుందన్నాడు. దాంతో స్సిన్నర్‌తో బరిలోకి దిగాలా..వద్దా అనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నాడు. తమ పేస్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో భారత్‌కు మరోసారి కష్టాలు తప్పవని జోస్యం చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment