'మాకు కొత్త కల్లిస్ దొరికాడు' | Du Plessis hails 'new Kallis' Philander | Sakshi
Sakshi News home page

'మాకు కొత్త కల్లిస్ దొరికాడు'

Published Tue, Jul 18 2017 3:50 PM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM

'మాకు కొత్త కల్లిస్ దొరికాడు'

'మాకు కొత్త కల్లిస్ దొరికాడు'

నాటింగ్హమ్:ఇంగ్లండ్ తో  జరిగిన రెండో టెస్టులో ఆల్ రౌండర్ పాత్ర పోషించి దక్షిణాఫ్రికా భారీ విజయంలో పాలుపంచుకున్న ఫిలాండర్ పై కెప్టెన్ డు ప్లెసిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. తమ జట్టుకు కొత్త కల్లిస్ దొరికాడంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఫిలాండర్ కచ్చితంగా తమ 'కొత్త కల్లిస్' అని కొనియాడాడు.

ఇంగ్లండ్ తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 340 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఫిలాండర్ 54 పరుగులు నమోదు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేశాడు.  ఇక బౌలింగ్ లో తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు సాధించాడు. ప్రత్యేకంగా ఫిలాండర్ ప్రదర్శనపై డు ప్లెసిస్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. 'అతనొక అసాధారణమైన క్రికెటర్. ఎప్పుడు పిచ్ లో కి అడుగుపెట్టిన తనదైన ముద్రవేయడానికి ఫిలాండర్ వందశాతం యత్నిస్తాడు. బహుశా అదే అతన్ని బెస్ట్ గా నిలబెడుతూ ఉండొచ్చు. ప్రధానంగా ఫిలాండర్ టెక్నిక్ చాలా బాగుంటుంది. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి కొన్ని విలువైన పరుగుల్ని సాధించి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు'అని డు ప్లెసిస్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement