IPL 2023 KKR VS RCB: ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్ 7) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మిస్టరీ స్పిన్నర్లు సునీల్ నరైన్ (4-0-16-2), వరుణ్ చక్రవర్తి (3.4-0-15-4), సుయాశ్ శర్మ (4-0-30-3) ఆర్సీబీని కకావికలం చేశారు. వీరి ధాటికి ఆర్సీబీ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.
ICYMI - TWO outstanding deliveries. Two massive wickets.
— IndianPremierLeague (@IPL) April 6, 2023
Sunil Narine & Varun Chakaravarthy get the #RCB openers early on.
Follow the match - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/GvL1U1GRWW
ముఖ్యంగా సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి.. విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, హర్షల్ పటేల్‌లను క్లీన్ బౌల్డ్ చేసిన తీరు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. నరైన్ బౌలింగ్‌లో కోహ్లి, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డుప్లెసిస్ ఒకే రీతిలో క్లీన్ బౌల్డ్ కాగా.. చక్రవర్తి బౌలింగ్‌లో మ్యాక్సీ, హర్షల్ పటేల్ కూడా ఇంచుమించు అలాగే బౌల్డ్ అయ్యారు. కేకేఆర్ స్పిన్నర్ల మాయాజాలానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు ఆహా.. ఏమా మాయాజాలం అని కామెంట్లు పెడుతున్నారు.
Varun Chakravarthy was absolutely unplayable in that spell!
— Prasenjit Dey (@CricPrasen) April 6, 2023
3.4-0-15-4 🔥🔥pic.twitter.com/jvhyU8fOdS
ఇదిలా ఉంటే, చారిత్రక ఈడెన్ గార్డెన్స్‌లో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్‌రైడర్స్ 81 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
కేకేఆర్ ఇన్నింగ్స్‌లో శార్దుల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) శివాలెత్తగా.. గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అదరగొట్టారు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీని.. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), ఇంపాక్ట్ ప్లేయర్ సుయశ్ శర్మ (3/30) దారుణంగా దెబ్బకొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో డెప్లెసిస్ (23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment