IPL 2023 RCB Vs GT: Teary Eye Siraj And Dejected Kohli Capture Pain Of Yet Another RCB Heartbreak - Sakshi
Sakshi News home page

IPL 2023: ప్లే ఆఫ్స్‌ నుంచి ఔట్‌.. కన్నీరు పెట్టుకున్న సిరాజ్‌! నేల మీద పడుకుని..

Published Mon, May 22 2023 11:10 AM | Last Updated on Mon, May 22 2023 12:13 PM

teary eye Siraj, dejected Kohli capture pain of yet another RCB heartbreak  - Sakshi

#Mohammed Siraj: ఐపీఎల్‌-2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. తద్వారా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి బెంగళూరు నిష్క్రమించి టోర్నీ నుంచి వైదొలిగింది. ఆర్సీబీ ఓటమి పాలైన నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.

కాగా టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టడంతో ఆర్సీబీ ఆటగాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, మహ్మద్‌ సిరాజ్‌ మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యారు. గిల్‌ సిక్స్‌ కొట్టి గుజరాత్‌ను గెలిపించగానే.. మహ్మద్‌ సిరాజ్‌ ఒక్క సారిగా మైదానంలో నేలపై పడి కన్నీరు పెట్టుకున్నాడు.

అదే విధంగా కోహ్లి కూడా డగౌట్‌లో కూర్చోని కంటతడి పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అదే విధంగా సిరాజ్‌ కూడా ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు సాధించాడు. వీరు రాణించినప్పటికీ ఆర్సీబీని గెలిపించలేకపోయారు. 
చదవండి: #Virat Kohli: కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఓడినా పర్వాలేదు! ఎప్పటికీ నీవు మా కింగ్‌వే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement