Photo: RCB Twitter
ఐపీఎల్‌లో మోస్ట్ అన్‌లక్కీ జట్టు ఏదైనా ఉందంటే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టే. ప్రతీ సీజన్‌లో పేపర్‌పై బలంగా కనిపించే ఆర్‌సీబీ అసలు ఆటలో మాత్రం తేలిపోతుంది. ఒత్తిడిలో ఆడదన్న పేరును మూటగట్టుకున్న ఆర్‌సీబీ మరో సౌతాఫ్రికా జట్టులా తయారైంది. ఈ సాలా కప్ నమ్ దే(ఈసారి కప్ మనదే) అంటూ ప్రతీసారి ఊదరగొట్టే ఆర్‌సీబీ ఆ కలను మాత్రం నెరవేర్చుకోలేకపోతుంది.
తాజాగా ప్రారంభమైన ఐపీఎల్ 16వ సీజన్‌కు ఆర్‌సీబీ నూతనోత్సాహంతో సిద్ధమైంది. ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్ పాఫ్ డుప్లెసిస్ జట్టు కూర్పు గురించి.. ఈ సీజన్‌లో తాము ఆడబోయే గేమ్ స్ట్రాటజీ గురించి ప్రమోషన్ ఈవెంట్‌లో మాట్లాడాడు. ఈ మీటింగ్‌కు కోహ్లి కూడా హాజరయ్యాడు.
అయితే కెప్టెన్ డుప్లెసిస్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్‌సీబీ స్లోగన్ ఈ సాలా కప్ నమ్‌దేను డుప్లెసిస్ తప్పుగా చెప్పాడు. కోహ్లి అతని చెవిలో ఈ సాలా కప్ నమ్‌దే అని చెప్పాడు. కానీ డుప్లెసిస్‌కు ఈ సాలా కప్ వరకు అర్థమైంది కానీ చివరి పదం అర్థం కాలేదు. దీంతో ఈ సాలా కప్ నహీ(ఈసారి కప్పు రాదు) అని తప్పుగా చెప్పేశాడు. దీంతో షాక్ తిన్న కోహ్లి డుప్లెసిస్ మాటలకు పగలబడి నవ్వుకున్నాడు. ఆ తర్వాత కోహ్లి మరోసారి చెప్పడంతో డుప్లెసిస్ ఈసారి మాత్రం ఈ సాలా కప్ నమ్‌దే అంటూ కరెక్ట్‌గా చెప్పాడు.
ఈ చర్య ఆర్‌సీబీ అభిమానులను కాస్త భయానికి గురి చేసింది. కానీ ఐపీఎల్‌లో ఉన్న మిగిలిన జట్ల అభిమానులు మాత్రం #Ee Sala Cup Nahi.. హ‍్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేసి డుప్లెసిస్‌ను ట్రోల్ చేశారు. ''కెప్టెన్ అయ్యుండి అంత మాట అంటావా''..'' నిజమేలే.. ఈసారి కూడా మీకు కప్పు ఎలాగో రాదు.. అందుకే నీ నోటి నుంచి ఆ మాట వచ్చింది''..'' ముందే ఫిక్స్ అయినట్టున్నారు కప్ రాదని'' అంటూ కామెంట్ చేశారు.
ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఇప్పటి వరకు మూడుసార్లు రన్నరప్‌గా నిలిచింది. అయితే 2016 తర్వాత ఆర్‌సీబీ మూడేళ్ల పాటు ఆఖరి స్థానాల్లో నిలుస్తూ వచ్చింది. అయితే 2020 నుంచి మాత్రం ఆర్‌సీబీ ఆటలో దూకుడు పెరిగింది. గతేడాది ఐపీఎల్‌లో ఎలిమినేటర్‌లో లక్నోను ఇంటికి పంపించి రెండో క్వాలిఫయర్ ఆడిన ఆర్‌సీబీ రాజస్తాన్ చేతిలో ఖంగుతిని ఇంటిబాట పట్టింది.
Faf Du Plessis mistakenly says "Ee Sala Cup Nahi". instead of "ee sala cup namde"
— CRICKETNMORE (@cricketnmore) April 1, 2023
Virat Kohli Could Not Stop Laughing 😂#IPL2023 #RCB #RCBvMI #FafDuPlessis #ViratKohlipic.twitter.com/ym3hhdV40e
Comments
Please login to add a commentAdd a comment