Mohmmad Siraj
-
బ్యాటర్ టూ బౌలర్.. తండ్రి మరణాన్ని సైతం తట్టుకుని! ఎంతో మందికి
మహ్మద్ సిరాజ్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అతడిని అభిమానులు ముద్దుగా సిరాజ్ 'మియా' అని పిలుచుకుంటారు. సాధారణ ఆటో డ్రైవర్ కొడుకు స్ధాయి నుంచి వరల్డ్‌క్లాస్ క్రికెటర్‌గా ఎదిగిన సిరాజ్ ప్రయాణం ఎంతో మంది యువ క్రికెటర్లకు స్పూర్తిదాయకం. గల్లీ క్రికెటర్ నుంచి టీమిండియా ముఖచిత్రంగా మారిన సిరాజ్ పుట్టిన రోజు నేడు. మార్చి 13న సిరాజ్ మియా తన 30వ పుట్టి నరోజును జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మన హైదరాబాదీ కోసం గురించి మీకు తెలియని కొన్ని విషయాలు.. హైదరాబాద్‌లోని పాత బస్తీలో ఓ ఆటో డ్రైవర్ తన కుటుంబంతో కలిసి జీవించే వాడు. అతడికి ఇద్దరు కొడుకులు. అందులో చిన్నవాడు మహ్మద్ సిరాజ్. సిరాజ్‌కు చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. కానీ అతడి కుటంబ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రమే. ఏదైమైనప్పటకి తను క్రికెటర్ కావాలని మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఆ చిన్నోడ. ఈ క్రమంలో సిరాజ్ చదువుపై దృష్టి పెట్టుకుండా క్లాస్‌లు డుమ్మా కొట్టి క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్‌కు వెళ్లిపోయేవాడు. అతడి సొదురుడు మంచిగా చదుకుని ఉన్నత స్దాయికి చేరుకునే ప్రయత్నంలో వుంటే.. సిరాజ్ మాత్రం క్రికెట్ అంటూ గ్రౌండ్లు వెంట తిరిగేవాడు. ఈ క్రమంలో సిరాజ్ భవిష్యత్తుపై అతడి తల్లిదండ్రులకు బెంగ నెలకొంది. అన్నయ్య ఇంజినీరింగ్ చదువుతుంటే నువ్వు ఆటలతో కాలక్షేపం చేస్తున్నావు అంటూ అతడి తల్లి సిరాజ్‌పై కోపమయ్యేది. ఈ విషయాన్ని సిరాజ్ చాలా సందర్బాల్లో తెలిపాడు. కానీ సిరాజ్ మాత్రం తన ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన తన గమ్యానికి చేరుకోవడంలో వెనుక అడుగువేయలేదు. రంజీల్లో అదరగొట్టి.. సిరాజ్తన ఆరంభంలో టెన్నిస్‌బాల్ క్రికెట్ ఆడేవాడు. అతడికి కోచ్ కూడా లేడు. తనకు తానే ఆటలో మెళకువలు నేర్చుకున్నాడు. టెన్నిస్ బాల్తోనే తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు. పూర్తిస్థాయిలో మెళకువలు నేర్వకముందే గంటకు 140 కిలోమీటర్ల వేగంతో సిరాజ్ బౌలింగ్ చేసేవాడు. లీగ్ స్థాయి క్రికెట్లో సత్తా చాటిన సిరాజ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఈ క్రమంలో అతడిని అండర్-23 జట్టుకు ఎంపిక చేశారు. అక్కడ కూడా సత్తాచాటడంతో దేశీవాళీ క్రికెట్లో సిరాజ్ అరంగేట్రం చేశాడు. 2015-16 సీజన్లో రంజీల్లో సిరాజ్ డెబ్యూ చేశాడు. తన అరంగేట్ర సీజన్లోనే హైదరాబాద్ జట్టు తరఫున 41 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టడంతో సిరాజ్‌కు ఐపీఎల్ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. 2017 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ 2.6 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సిరాజ్ మారాడు. అనంతరం 2017లో న్యూజిలాండ్‌తో టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అతడిది కీలక పాత్ర.. టీమిండియాకు సిరాజ్ ఎంపిక కావడంలో భారత మాజీ బౌలింగ్ కోచ్ అరుణ్ భరత్‌ది కీలక పాత్ర. 2016లో హైదరాబాద్ రంజీ జట్టుకు అరుణ్ భరత్ కోచ్‌గా వ్యవహరించాడు. అప్పడే.. సిరాజ్ కోచ్ భరత్ అరుణ్ దృష్టిలో పడ్డాడు. కివీస్‌తో తొలి టీ20 తర్వాత ఆశిష్ నెహ్రా రిటైరవనున్న నేపథ్యంలో చివరి 2 మ్యాచ్‌లకు జయదేవ్ ఉనద్కత్ లేదా బాసిల్ థంపిలలో ఒకరికి అవకాశం లభిస్తుందని అంతా భావించారు. కానీ అనుహ్యంగా సిరాజ్‌కు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. అయితే ఎవరూ ఊహించని విధంగా సిరాజ్‌కు జట్టులో చోటు దక్కడం వెనుక భరత్ పాత్ర ఉంది. బ్యాటర్ టూ బౌలర్ కాగా సిరాజ్ తొలుత బ్యాటర్ కావాలనకున్నాడు. చార్మినార్ క్రికెట్ తరపున బ్యాటర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఏడో తరగతి నుంచి పదో క్లాస్‌కు వరకు బ్యాటర్‌గానే తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అయితే ఆ తర్వాత బౌలింగ్ పై శ్రద్ధ పెట్టి టాప్ క్లాస్ బౌలర్ గా ఎదిగాడు. తండ్రి మరణాన్ని తట్టుకుని.. కాగా 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ సిరీస్‌తో సిరాజ్ భారత తరపున టెస్టుల్లో అడుగుపెట్టాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసిన కొన్ని రోజులకే అతడి జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఊపిరితిత్తల వ్యాధితో బాధపడుతున్న సిరాజ్ తండ్రి మహమ్మద్ గౌస్ కన్నముశారు. ఆ సమయంలో సిరాజ్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈ క్షణంలో మరో ఆటగాడైతే జట్టును వీడి తండ్రిని కడసారి చూసేందుకు వచ్చేవాడు. కానీ సిరాజ్ మాత్రం తన తండ్రి మాటలను తలుచుకుని జాతీయ విధే ముఖ్యమని అక్కడే ఉండిపోయాడు. తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బీసీసీఐ అవకాశం కల్పించినప్పటికీ.. జట్టుతోనే ఉండాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఆ సిరీస్‌లో ఫైనల్ టెస్టులో ఐదు వికెట్లతో సిరాజ్ చెలరేగాడు. ఇప్పటివరకు భారత్ తరఫున 27 టెస్టులు, 41 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 👉: మహమ్మద్ సిరాజ్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు) -
మహ్మద్ సిరాజ్ తీవ్ర భావోద్వేగం.. ‘మిస్ యు పప్పా’ అంటూ!
దుబాయ్: ఆసియా కప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన భారత పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 694 పాయింట్లతో నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు 9వ స్థానంలో ఉన్న ఈ హైదరాబాదీ ఏకంగా ఎనిమిది స్థానాలు మెరుగుపర్చుకొని అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. వన్డే ర్యాంకింగ్స్‌లో సిరాజ్ టాప్‌గా నిలవడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో నంబర్‌వన్‌గా నిలిచిన అతను రెండు నెలల తర్వాత ఆసీస్ పేసర్ జోష్ హాజల్‌వుడ్‌కు ఆ స్థానాన్ని కోల్పోయాడు. ఆసియా కప్ ఫైనల్లో 21 పరుగులకే 6 వికెట్లు తీసిన ప్రదర్శనతో ఇప్పుడు మళ్లీ శిఖరానికి చేరాడు. సిరాజ్ తీవ్ర భావోద్వేగం కెరీర్లో అత్యుత్తమ దశను చూస్తున్న సిరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేశాడు. కొంత కాలం క్రితం చనిపోయిన తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ‘మిస్ యు పాపా’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. తనను తల్లిదండ్రులు ఆశీర్వదిస్తున్న ఫోటోను వారిద్దరు చూస్తున్న చిత్రానికి తాను గ్రౌండ్లో ఆడుతున్న ఫోటోను అతను జత చేశాడు. చదవండి: ‘నా అకౌంట్లో 80 వేలే ఉన్నాయి’.. భారత టెన్నిస్ స్టార్ ఆవేదన -
ప్లే ఆఫ్స్ నుంచి ఔట్.. కన్నీరు పెట్టుకున్న సిరాజ్! నేల మీద పడుకుని..
#Mohammed Siraj: ఐపీఎల్-2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. తద్వారా ప్లే ఆఫ్స్ రేసు నుంచి బెంగళూరు నిష్క్రమించి టోర్నీ నుంచి వైదొలిగింది. ఆర్సీబీ ఓటమి పాలైన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. కాగా టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టడంతో ఆర్సీబీ ఆటగాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్ మైదానంలోనే కన్నీటి పర్యంతమయ్యారు. గిల్ సిక్స్ కొట్టి గుజరాత్‌ను గెలిపించగానే.. మహ్మద్ సిరాజ్ ఒక్క సారిగా మైదానంలో నేలపై పడి కన్నీరు పెట్టుకున్నాడు. అదే విధంగా కోహ్లి కూడా డగౌట్లో కూర్చోని కంటతడి పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. అదే విధంగా సిరాజ్ కూడా ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు సాధించాడు. వీరు రాణించినప్పటికీ ఆర్సీబీని గెలిపించలేకపోయారు. చదవండి: #Virat Kohli: కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఓడినా పర్వాలేదు! ఎప్పటికీ నీవు మా కింగ్‌వే! Shubman Gill seals off the chase with a MAXIMUM 👏🏻👏🏻@gujarat_titans finish the league stage on a high 😎#TATAIPL | #RCBvGT pic.twitter.com/bZQJ0GmZC6 — IndianPremierLeague (@IPL) May 21, 2023 -
హర్షల్ పటేల్ పై నెటిజన్ ల తిట్ల వర్షం
-
మూడో వన్డేలో శ్రీలంక చిత్తు.. 317 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయం
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. కాగా ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలోనే పరుగుల తేడాతో ఇదే భారీ విజయం కావడం విశేషం. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. 391 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 22 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 73 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక బ్యాటర్ ఆషాన్ బండారకు గాయం కావడంతో బ్యాటింగ్‌కు రాలేదు. దీంతో 73 పరుగులకే లంక ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు సాధించారు. లంకబ్యాటర్లలో నువానీడు ఫెర్నాండో 19 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి మరోసారి అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ కూడా సెంచరీతో మెరిశాడు. 97 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 116 పరుగులు చేశాడు.అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ(42), శ్రేయస్ అయ్యర్(33) పరుగులతో రాణించారు. ఇక లంక బౌలర్లలో కుమార, రజితా తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కరుణరత్నే ఒక్క వికెట్ సాధించాడు. చదవండి: IND vs SL: తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు! -
సిరాజ్ సూపర్ డెలివరీ.. దెబ్బకు ఎగిరిపోయిన మిడిల్ స్టంప్! వీడియో వైరల్
శ్రీలంకతో తొలి వన్డేలో అదరగొట్టిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. కోల్‌కతా వేదికగా రెండో వన్డేలో కూడా సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో 5.4 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో లంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండోను సిరాజ్‌ను ఓ సంచలన బంతితో పెవిలియన్‌కు పంపాడు. ఫెర్నాండోను సిరాజ్ అద్బుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. శ్రీలంక ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో సిరాజ్ వేసిన ఆఖరి బంతిని ఫెర్నాండో కవర్ డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి స్వింగ్ అయ్యి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో అవిష్క ఫెర్నాండో ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారత బౌలర్లు చెలరేగడంతో 215 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో మూడు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ ఒక్క వికెట్ సాధించారు. చదవండి: IND vs SL: సహాచర ఆటగాడిపై అసభ్య పదజాలం వాడిన హార్దిక్! ఇదేమి బుద్దిరా బాబు.. Timber Strike, the @mdsirajofficial way 👌👌 Relive how he dismissed Avishka Fernando 🔽 Follow the match 👉 https://t.co/MY3Wc5253b#TeamIndia | #INDvSL pic.twitter.com/ZmujAITsco — BCCI (@BCCI) January 12, 2023 -
టీమిండియాకు భారీ షాక్.. మూడో టెస్ట్‌కు స్టార్ బౌలర్ దూరం!
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ ఓటమి నుంచి కోలుకునే లోపే భారత్‌కు మరో భారీ షాక్. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయం కారణంగా మూడో టెస్ట్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో గాయపడిన సిరాజ్ ఇంకా కోలుకోనట్లు సమాచారం. ఈ క్రమంలో రెండో టెస్ట్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన భారత కోచ్ రాహుల్ ద్రవిడ్.. సిరాజ్ గాయంపై అప్డేట్ అందించాడు. "సిరాజ్ నెట్స్‌లో కష్టపడాలి. హామ్ స్ట్రింగ్ గాయం నుంచి వెంటనే కోలుకోవడం చాలా కష్టం. మొదటి ఇన్నింగ్స్‌లో గాయంతో సిరాజ్ దూరం కావడం మాకు ఒక పెద్ద ఎదురుదెబ్బ. అతడు గాయపడినప్పటికీ మూడో రోజు బౌలింగ్‌కు వచ్చాడు. ఒక వేళ కెప్టౌన్ టెస్ట్‌కు సిరాజ్ దూరమైతే, ఉమేష్, ఇషాంత్ రూపంలో మాకు మంచి బెంచ్ బలం ఉంది అని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఇక జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియాపై దక్షిణాఫ్రికా 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్1-1తో సమమైంది. ఇక కేప్ టౌన్ వేదికగా జనవరి 11న ప్రారంభం కానున్న అఖరి టెస్ట్‌లో ఇరు జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. చదవండి: SA vs IND: కోహ్లి గాయంపై కీలక ప్రకటన చేసిన ద్రవిడ్.. -
భారత బౌలర్‌పై సచిన్ ప్రశంసల జల్లు..
ముంబై: టెస్టు క్రికెట్లోకి ప్రవేశించిన నాటినుంచి అద్భుత ప్రదర్శనతో భారత జట్టులో కీలక సభ్యుడిగా మారిన హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. ‘సిరాజ్ కాళ్లల్లో స్ప్రింగ్‌లు ఉన్నట్లుగా చురుగ్గా ఉంటాడు. అది నాకెంతో నచ్చుతుంది. అతని రనప్ కూడా బాగుంటుంది. మైదానంలో ఎల్లప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తాడు. ఆటలో ఆ రోజు తొలి ఓవర్ వేస్తున్నాడా, చివరిది వేస్తున్నాడా అనిపించే అరుదైన బౌలర్లలో సిరాజ్ ఒకడు. ఏ సమయంలోనైనా దూసుకొచ్చేందుకు అతను సిద్ధంగా ఉంటాడు’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. మాస్టర్ ప్రశంసలపై సిరాజ్ కృతజ్ఞతలు తెలిపాడు. సచిన్ స్థాయి వ్యక్తి తనను మెచ్చుకోవడం తనకు మరింత ప్రేరణ అందిస్తుందని, దేశం కోసం అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తానని అతను అన్నాడు. చదవండి: న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్‌పై వేటు.. -
ఆసీస్ టూర్: సిరాజ్ నుంచి సుందర్ దాకా
అద్భుతం జరిగేటపుడు ఎవరూ గుర్తించరు.. అదే అద్భుతం జరిగిన తర్వాత దానిని ఎవరూ ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదు అంటారు. నిజమే ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సాధించిన చారిత్రక విజయంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన భారత ఆటగాళ్లు ఈ గెలుపులో కీలక పాత్ర పోషించారు. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే, బీసీసీఐ నమ్మకాన్ని నిలబెడుతూ సత్తా చాటారు. ఎన్నో అవాంతరాలు దాటి సంప్రదాయ క్రికెట్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న ఆ ఆటగాళ్ల నేపథ్యం, ఈ సిరీస్‌లో నమోదు చేసిన గణాంకాలు పరిశీలిద్దాం. శభాష్ సిరాజ్.. హైదరాబాదీ బౌలర్. అతిసాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. అతడి తండ్రి ఆటోడ్రైవర్. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. దేశీవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ మెరుగ్గా రాణించిన సిరాజ్.. ఆసీస్ సిరీస్‌తో జరిగే సుదీర్ఘ సిరీస్‌కు ఎంపికయ్యాడు. టూర్లో ఉండగానే అతడి తండ్రి మరణించినా.. ఆయన కలను నెరవేర్చాలనే ఆశయంతో జట్టుతోనే ఉండిపోయాడు. రెండో టెస్టు ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ హైదరాబాదీ.. సీనియర్ల గైర్హాజరీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుతంగా రాణించాడు. 13 వికెట్లు తీసి సత్తా చాటాడు. బాక్సింగ్ డే టెస్టుతో పాటు గబ్బాలో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో మొత్తంగా 73 పరుగులు ఇచ్చిన హైదరాబాదీ, ఓపెనర్ డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్, స్టీవ్‌స్మిత్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. వీరితో పాటు హాజల్‌వుడ్, స్టార్క్‌ను అవుట్ చేసి మొత్తంగా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. (చదవండి: 36 పరుగులకు ఆలౌట్.. కానీ ఇప్పుడు ) రూ. 300 కోసం మ్యాచ్‌లు ఆడి.. హర్యానాలోని కర్నాల్‌లో జన్మించాడు. రైట్ ఆర్మ్ మీడియం బౌలర్. అతడి తండ్రి డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన సైనీ.. క్రికెట్లో శిక్షణ తీసుకునేందుకు సరిపడా డబ్బు లేక ఇబ్బందులు పడ్డాడు. ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడుతూ వాటి ద్వారా వచ్చే 300 రూపాయలతో అవసరాలు తీర్చుకునేవాడు. 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సైనీ వన్డేల్లో రంగప్రవేశం చేశాడు. ఇక సీనియర్ పేసర్ ఉమేశ్ గాయపడటంతో సిడ్నీ టెస్టుతో సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతడు.. ఈ టెస్టు సిరీస్‌లో మొత్తంగా 4 వికెట్లు పడగొట్టాడు. నటరాజన్‌కు కలిసొచ్చిన టూర్ తమిళనాడులోని చిన్నపంపట్టి గ్రామానికి చెందిన నటరాజన్ 1991లో జన్మించాడు. నిరుపేద కుటుంబం అతడిది. నటరాజన్ అతడి తండ్రి చీరల తయారీ కర్మాగారంలో రోజూవారీ కూలీ. తల్లి రోడ్డుపక్కన చిరుతిళ్లు అమ్ముతూ కుటుంబ పోషణలో తన వంతు సాయం అందించేవారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. ఐదుగురు సంతానంలో పెద్దవాడైన నటరాజన్ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటూనే క్రికెటర్ కావాలని చిన్ననాటి నుంచి కలలు కనేవాడు. పేదరికం వెక్కిరిస్తున్నా క్రికెట్ మీద ఉన్న ప్రేమను చంపుకోలేక, 20 ఏళ్లు వచ్చేదాకా టెన్నిస్ బాల్తోనే ప్రాక్టీసు చేశాడు. ఈ క్రమంలో 2015లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే అతడి బౌలింగ్ యాక్షన్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఆ సమయంలో సీనియర్ ఆటగాళ్ల సలహాలు నటరాజన్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారి సూచనలతో బౌలింగ్ యాక్షన్‌లో మార్పులు చేసుకుని సత్తా చాటాడు. 2016 తమిళనాడు ప్రీమియర్ లీగ్ ద్వారా తొలిసారి వెలుగులోకి వచ్చిన నటరాజన్ యార్కర్లు సంధించే విధానంతో ఐపీఎల్ ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఆసీస్ టూర్‌కు నెట్‌బౌలర్‌గా ఎంపికైన నటరాజన్ మనుకా ఓవల్ మైదానంలో ఆతిథ్య జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా జాతీయ జట్టులో చోటుదక్కించుకున్నాడు. ఆ తర్వాత టీ20, గబ్బా మ్యాచ్ ద్వారా టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు. మొత్తంగా11(వన్డేలు-2, టీ20-6, టెస్టు-3) వికెట్లు తీశాడు. సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్, గిల్ తండ్రి సుందర్‌కు క్రికెట్ అంటే మక్కువ. ప్రతిభ ఉన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాస్త వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ వాషింగ్టన్ అనే వ్యక్తి ఆయనకు అండగా నిలబడ్డాడు. ప్రోత్సాహం అందించాడు. ఈ క్రమంలో స్థానికంగా సుందర్ మంచి పేరు సంపాదించారు. అయితే తన రెండో కొడుకు జన్మించే కొన్నిరోజుల ముందు వాషింగ్టన్ మరణించడంతో ఆయన జ్ఞాపకార్థం, వాషింగ్టన్ సుందర్‌గా తనకు నామకరణం చేశారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో ప్రవేశించాడు. గబ్బా టెస్టుతో సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సుందర్.. 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక వన్డేల్లో ఒకటి, టీ20ల్లో 21 వికెట్లు అతడి ఖాతాలో ఉన్నాయి. ఇక సిరాజ్, సైనీ, నటరాజన్, సుందర్‌తో పాటు శుభ్‌మన్ గిల్ కూడా ఈ సిరీస్ ద్వారానే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మొత్తంగా 259 పరుగులతో జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. -
తప్పు నాదే.. క్షమించండి : గిల్‌క్రిస్ట్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అడమ్ గిల్‌క్రిస్ట్ పెద్ద పొరపాటు చేశాడు. ఇటీవలే టీమిండియా ఆటగాడు మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిరాజ్ తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సిరాజ్‌కు భారత జట్టు ఆటగాళ్లతో పాటు ఆసీస్ క్రికెటర్లు కూడా సానుభూతి ప్రకటించారు. (చదవండి : రాహుల్‌కు క్షమాపణ చెప్పా: మ్యాక్స్‌వెల్) శుక్రవారం ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో గిల్‌క్రిస్ట్ కామెంటేటర్‌గా వ్యవహరించాడు. కామెంటరీ సమయంలో సిరాజ్ తండ్రి చనిపోయిన విషయం గురించి మాట్లాడిన గిల్‌క్రిస్ట్ పొరపాటున సిరాజ్ బదులు నవదీప్ సైనీ పేరును ప్రస్తావించాడు. 'తండ్రి చనిపోయిన వెంటనే బీసీసీఐ సైనీకి ఇంటికి వెళ్లేందుకు అవకాశమిచ్చింది. కానీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అతను వెళ్లలేదు' అని పేర్కొన్నాడు. అయితే గిల్‌క్రిస్ట్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి : హార్దిక్ బౌలింగ్ ఇప్పట్లో లేనట్లేనా?) గిల్లీ వ్యాఖ్యలను గుర్తించిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మెక్లీన్‌గన్‌తో పాటు కొంతమంది అభిమానులు ట్విటర్ ద్వారా అతని పొరపాటును ట్యాగ్ చేశారు. చనిపోయింది సిరాజ్ తండ్రి.. నవదీప్ సైనీ తండ్రి కాదంటూ తెలిపారు. విషయం గ్రహించిన గిల్లీ వెంటనే ట్విటర్లో స్పందించాడు.' నా పొరపాటును గ్రహించాను. సిరాజ్‌కు బదులు పొరపాటుగా సైనీ పేరు వాడాను. ఈ సందర్భంగా సిరాజ్, సైనీలకు ఇవే నా క్షమాపణలు. నేను పొరపాటుగా చేసిన వ్యాఖ్యలను గుర్తించిన మెక్లీన్‌గన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నా.. మరొకసారి మీ అందరిని క్షమాపణ కోరుతున్నా' అంటూ గిల్లీ ట్వీట్ చేశాడు. Yes, thanks @anshu2912 I realize I was mistaken in my mention. Huge apologies for my error, to both @navdeepsaini96 and Mohammed Siraj. 🙏😌 https://t.co/618EUIEyNU — Adam Gilchrist (@gilly381) November 27, 2020 Yep, thanks @Mitch_Savage My huge apologies again to all. https://t.co/F8rYsD6fxm — Adam Gilchrist (@gilly381) November 27, 2020 -
టెస్టు జట్టులో సిరాజ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్య పరిస్థితుల్లో... ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జంబో బృందాన్ని ఎంపిక చేసింది. నవంబర్ 27న టి20 సిరీస్‌తో మొదలయ్యే ఈ పర్యటనలో భారత్ మూడు టి20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీతో ఈ పర్యటన ముగియనుంది. చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి నేతృత్వంలోని భారత సెలక్టర్ల బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై మొత్తం 32 మందిని ఈ పర్యటన కోసం ఎంపిక చేసింది మూడు ఫార్మాట్ (టి20, వన్డే, టెస్టు)లలో కలిపి అధికారికంగా 28 మందిని ఎంపిక చేశారు. అయితే నెట్ ప్రాక్టీస్ సెషన్స్ కోసం మరో నలుగురు పేసర్లు కమలేశ్ నాగర్కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పోరెల్, నటరాజన్ కూడా ఈ 28 మందితో కలిసి ఆస్ట్రేలియాకు వెళతారు. బయో బబుల్ వాతావరణంలో జరిగే ఈ సిరీస్ కోసం మూడు జట్లు ఒకేసారి ఆస్ట్రేలియాకు వెళతాయి. గాయాలతో బాధపడుతున్న స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, బౌలర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్‌లను ఈ పర్యటనకు ఎంపిక చేయలేదు. తొడ కండరాలతో బాధపడుతున్న రోహిత్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సిరాజ్ శ్రమకు ఫలితం... ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో భారత టి20, వన్డే జట్లకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలిసారి టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. 26 ఏళ్ల సిరాజ్ కొన్నాళ్లుగా భారత ‘ఎ’ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 36 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ మొత్తం 147 వికెట్లు పడగొట్టాడు. అతను ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు 13 సార్లు, ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు నాలుగుసార్లు తీశాడు. వన్డే, టి20 జట్ల నుంచి పంత్ అవుట్... ఏడాది తర్వాత కేఎల్ రాహుల్ టెస్టు జట్టులో పునరాగమనం చేయగా... నిలకడగా ఆడలేకపోతున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను వన్డే, టి20 జట్ల నుంచి తప్పించి కేవలం టెస్టు జట్టుకే పరిమితం చేశారు. తమిళనాడు ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి తొలిసారి టి20 జట్టులో స్థానం పొందాడు. ప్రస్తుత ఐపీఎల్లో 11 మ్యాచ్‌లు ఆడిన 29 ఏళ్ల వరుణ్ 13 వికెట్లు తీశాడు. ఏడు రకాల బంతులను వేయగల వైవిధ్యం వరుణ్ సొంతం. ఈ ఐపీఎల్లో వరుణ్ స్పిన్‌కు వార్నర్, ధోని, పంత్, శ్రేయస్ అయ్యర్ తదితర అంతర్జాతీయ క్రికెటర్లు బోల్తా పడ్డారు. భారత జట్ల వివరాలు టెస్టు జట్టు: కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), మయాంక్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, పుజారా, విహారి, శుబ్‌మన్ గిల్, సాహా (వికెట్ కీపర్), పంత్ (వికెట్ కీపర్), బుమ్రా, షమీ, ఉమేశ్, సెనీ, కుల్దీప్, జడేజా, అశ్విన్, సిరాజ్. వన్డే జట్టు: కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), ధావన్, శుబ్‌మన్ గిల్, అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్, జడేజా, చహల్, కుల్దీప్, బుమ్రా, షమీ, సైనీ, శార్దుల్ ఠాకూర్. టి20 జట్టు: కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), ధావన్, మయాంక్, అయ్యర్, పాండే, హార్దిక్ పాండ్యా, సామ్సన్ (వికెట్ కీపర్), జడేజా, వాషింగ్టన్ సుందర్, చహల్, బుమ్రా, షమీ, సైనీ, దీపక్ చహర్, వరుణ్ చక్రవర్తి. అదనపు పేస్ బౌలర్లు: కమలేశ్ నాగర్కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పోరెల్, నటరాజన్. -
హైదరాబాద్‌కు తొలి విజయం
సాక్షి, హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్లో ఎట్టకేలకు హైదరాబాద్ విజయాన్ని నమోదు చేసింది. న్యూఢిల్లీలోని పాలం ఎయిర్‌ఫోర్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో త్రిపురపై 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ గెలుపొందింది. ఇప్పటివరకు టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన త్రిపురను హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. సీవీ మిలింద్ (3/11), మెహదీహసన్ (2/11), టి.రవితేజ (2/11), సిరాజ్ (2/20)ల ధాటికి త్రిపుర 17 ఓవర్లలో 9 వికెట్లకు 79 పరుగులు చేసింది. నిరుపమ్‌సేన్ చౌధరి (16) టాప్‌స్కోరర్. హైదరాబాద్ బౌలర్లు సమష్టిగా రాణించడంతో త్రిపుర బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలవలేకపోయారు. రెండో వికెట్‌కు ఉదియన్ బోస్ (8), నిరుపమ్ నెలకొల్పిన 14 పరుగులే ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. టోర్నీలో తొలి విజయం కోసం తపిస్తోన్న హైదరాబాద్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. 80 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 13.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (41 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), సుమంత్ కొల్లా (20; 2 ఫోర్లు) రాణించారు. కెప్టెన్ అక్షత్ రెడ్డి (7) జట్టు స్కోరు 20 పరుగుల వద్ద తొలి వికెట్‌గా వెనుదిరగగా, 56 పరుగుల వద్ద సుమంత్ వికెట్‌ను హైదరాబాద్ కోల్పోయింది. అయితే బి. సందీప్ (12 నాటౌట్) సహాయంతో తన్మయ్ మిగతా పనిని పూర్తిచేశాడు. ప్రత్యర్థి బౌలర్లలో మణిశంకర్ మురా సింగ్, సంజయ్ మజుందార్ చెరో వికెట్ దక్కించుకున్నారు. నేడు జరిగే మ్యాచ్‌లో సర్వీసెస్‌తో హైదరాబాద్ ఆడుతుంది. -
మహ్మద్ సిరాజ్‌కు మళ్లీ నిరాశే
సాక్షి, హైదరాబాద్ : వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపికైన హైదరాబాదీ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేయాలనుకున్న ఈ హైదరాబాద్ బౌలర్‌కు మరోసారి జట్టు మేనేజ్మెంట్ మొండి చెయ్యి చూపించింది. సిరాజ్‌తో పాటు మరో తెలుగు క్రికెటర్ హనుమ విహారికి సైతం రెండో టెస్ట్ తుది జట్టులో చోటు దక్కలేదు. మ్యాచ్‌కు ముందు ఒకరోజే 12 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటిస్తూ బీసీసీఐ ఓ కొత్త సంప్రదాయానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభమయ్యే రెండో టెస్టుకు బీసీసీఐ ప్రకటించిన 12 మంది ఆటగాళ్ల జాబితాలో తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు సిరాజ్, విహారిల పేర్లు లేవు. ఇక ఈ ఇద్దరు ఆటగాళ్లు తొలి టెస్ట్‌కు సైతం బెంచ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ వేదికగా జరిగే రెండో టెస్టులో ఈ తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లకు అవకాశం లభిస్తోందని అందరూ భావించారు. కానీ బీసీసీఐ అందరి అంచనాలను పటాపంచల్ చేస్తూ వీరికి అవకాశం కల్పించకుండా జట్టును ప్రకటించింది. ఇక మయాంక్ అగర్వాల్‌కు కూడా నిరాశే ఎదురైంది. తొలి టెస్ట్‌లో కేఎల్ రాహుల్ విఫలమైనా జట్టు మేనేజ్మెంట్ అతనికి మరోసారి అవకాశం ఇచ్చింది. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలోనే రాహుల్‌కు మరో అవకాశం ఇచ్చి ఉంటారని క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక దేశవాళీ, భారత్-ఏ తరపున అద్భుత ప్రదర్శన కనబర్చిన సిరాజ్‌కు అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడటానికి మరికొంత కాలం వేచి ఉండక తప్పేలా లేదు. ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్ ద్వారా అంతర్జాతీయ టెస్ట్‌లోకి అరంగేట్రం చేసిన విహారికి విండీస్‌తో జరిగే మ్యాచ్‌ల్లో అవకాశం దక్కకపోవడం గమనార్హం. ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో ప్రకటించిన జట్టులో ముగ్గుర్లు స్పిన్నర్లు అవసరమైతే.. శార్థుల్ ఠాకుర్ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. ఒకవేళ ఇద్దరి స్పిన్నర్లతో బరిలో దిగితే మాత్రం కుల్దీప్పై వేటు పడే అవకాశం ఉంది. బీసీసీఐ ప్రకటించిన తుది జట్టు విరాట్ కోహ్లి (కెప్టెన్), పృథ్వీషా, కేఎల్ రాహుల్, పుజారా, అజింక్యా రహానే, రిషబ్ పంత్, జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, శార్దుల్ ఠాకుర్. Team India for the 2nd Test against Windies at Hyderabad 🇮🇳 #INDvWI pic.twitter.com/QMgNm6jf4Q — BCCI (@BCCI) October 11, 2018 -
సిరాజ్ సంచలనం
బెంగళూరు: పదునైన పేస్‌తో బెంబేలెత్తించిన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా ‘ఎ’తో ఆదివారం ప్రారంభమైన నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ తరఫున బరిలో దిగిన సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని గడగడలాడించాడు. ఎనిమిది వికెట్లు సాధించి తన ఫస్ట్ క్లస్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. సిరాజ్ ధాటికి టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 75.3 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా (127; 20 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకోగా... అతనికి లబ్‌షేన్ (60; 11 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 114 పరుగులు జతచేయడంతో ఆసీస్ కోలుకుంది. వీరిద్దరితో పాటు కుర్టీస్ పీటర్సన్ (31), హెడ్ (4), హ్యాండ్స్కోంబ్ (0), కెప్టెన్ మిచెల్ మార్‡్ష (0), నాసెర్ (0), ట్రైమెన్ (0)లను సిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. కుల్దీప్ యాదవ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. -
టైటిల్ రేసులో మనోళ్లు..
-
టైటిల్ రేసులో మనోళ్లు..
► ప్లే ఆఫ్ లోకి హైదరాబాద్ ► వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్, రాణించిన విజయ్ శంకర్ కాన్పుర్: గుజరాత్ లయన్స్ పై 8 వికెట్లతో విజయం సాధించిన సన్ రైజర్స్ సగర్వంగా ప్లే ఆఫ్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. మ్యాచ్ కు ముందు గెలిస్తే ప్లే ఆఫ్ కు లేకపోతే పంజాబ్ మ్యాచ్ ఫలితం పై ఆధారపడే సందిగ్థత నేలకొనగా ఎట్టకేలకు గుజరాత్ పై గెలిచి సత్తా చాటింది. ఈ విజయంతో ఢిఫెండింగ్ ఛాంపియన్ లుగా టైటిల్ రేసులో ఉన్నామని ప్రత్యర్ధులకు హెచ్చరిక జారీ చేసింది. 155 పరుగుల లక్ష్యచేదనకు బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. ఓపెనర్ ధావన్(18) నిరాశ పర్చగా హెన్రీక్స్ (4) కూడా వెంటనే అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విజయ్ శంకర్ తో కెప్టెన్ వార్నర్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నంలో నెమ్మదిగా ఆడడంతో సన్ రైజర్స్ పవర్ ప్లే ముగిసే సరికి 2 వికెట్లుకోల్పోయి 47 పరుగులే చేసింది. అంకిత్ సోని వేసిన పదో ఓవర్ మూడో బంతి వార్నర్ బ్యాట్ కు ఎడ్జ్ అయి కీపర్ దినేశ్ కార్తీక్ చేతిలో పడింది. వేంటనే కార్తీక్ పెద్దగా అప్పీల్ చేసినా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. కానీ అది రిప్లే లో బ్యాట్ కు ఎడ్జ్ అయినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ లైఫ్ అనంతరం వార్నర్ రెచ్చిపోయి ఆడాడు. 41 బంతుల్లో వార్నర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, కొద్ది సేపటికి యవబ్యాట్స్ మన్ విజయ్ శంకర్ 35 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఇది విజయ్ శంకర్ కు ఐపీఎల్ కెరీర్ లో తొలి అర్ధ సెంచరీ, ఇక 9 ఫోర్ల తో వార్నర్ 69, 9 ఫోర్లతో విజయ్ శంకర్ 63 లతో 133 పరుగుల భాగస్వామ్యం అందించడంతో 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకోగలిగింది. చివరి బంతిని వార్నర్ ఫోర్ కొట్టి సన్ రైజర్స్ ను గెలిపించాడు. అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ లయన్స్ యువ బౌలర్ సిరాజ్ 4 వికెట్లు తీయడంతో 154 పరుగులకే కుప్పకూలింది. గుజరాత్ బ్యాట్స్ మెన్ లో ఇషాన్ కిషాన్(61), డ్వాన్ స్మిత్(54), రవీంద్ర జడేజా (20 నాటౌట్)లు మినహా మిగతా బ్యాట్స్ మెన్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. 4 వికెట్ల తో గుజరాత్ పతనాన్ని శాసించిన యువబౌలర్ మహ్మద్ సిరాజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. -
మన హైదరాబాదీ కుమ్మేశాడు..
► రాణించిన రషీద్ ఖాన్ ► 154 పరుగులకే కుప్ప కూలిన గుజరాత్ కాన్పుర్: సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ మధ్య జరుగుతున్న ఆసక్తికర మ్యాచ్ లో మన హైదరాబాద్ యువ బౌలర్ మహ్మద్ సిరాజ్ దాటికి లయన్స్ తోక ముడిచింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, స్మిత్, రవీంద్ర జడేజా మినహా మిగతా బ్యాట్స్ మెన్ సింగిల్ డిజిట్ కు పరిమితం అవ్వడంతో లయన్స్ 154 పరుగులకే కుప్పకూలింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు.యువ బ్యాట్స్ మన్ ఇషాన్ కిషన్ 27 బంతుల్లో ఐపీఎల్ కేరిర్ లోనే తొలి అర్ధసెంచరీ నమోదు చేయగా మరో ఓపెనర్ డ్వాన్ స్మిత్ కూడా 33 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. వీరి బ్యాటింగ్ దాటికి గుజరాత్ పది ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 105 పరుగు చేసింది. 7 ఫోర్లు 4 సిక్స్ లతో 54 పరుగులు చేసిన స్మిత్ ను రషీద్ ఖాన్ వికెట్లు ముందు బోల్త కొట్టించడంతో గుజరాత్ వికెట్ల పతనం మొదలైంది. వీరిద్దరు తొలి వికెట్ కు 111 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 5 ఫోర్లు, 4 సిక్సర్ లతో 61 పరుగులు చేసిన ఇషాన్ ను, సురేశ్ రైనా (2) లను యువ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో పెవిలియన్ కు పంపాడు. అనంతరం క్రీజులో కి వచ్చిన దినేశ్ కార్తిక్(0), ఆరోన్ ఫించ్(2) లను స్పిన్నర్ రషీద్ ఖాన్ అవుట్ చేయడంతో గుజరాత్123 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. గుజరాత్ లయన్స్ 12 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం. తర్వాత బ్యాటింగ్ కు దిగిన జడేజా, ఫాల్కనర్ లు ఆచితూచి ఆడే ప్రయత్నం చేసిన సిరాజ్ మరో సారి దెబ్బ కొట్టాడు. సిరాజ్ వేసిన 16 ఓవర్లో ఫాల్కనర్(8), ప్రదీప్ సంగ్వాన్(0) లను వరుస బంతుల్లో క్లీన్ బౌల్డ్ చేసి గుజరాత్ పతనాన్ని శాసించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఏ ఓక్క బ్యాట్స్ మన్ కుదురుకోలేదు. పోటాపోటిగా సన్ రైజర్స్ బౌలర్లకు వికెట్లు సమర్పించుకున్నారు. ఒక వైపు రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేసినా మిగతా బ్యాట్స్ మెన్ నుంచి సహాకారం అందకపోవడంతో గుజారాత్ 4 బంతుల్లో మిగిలి ఉండాగానే కుప్పకూలింది. ఇక సన్ రైజర్స్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు, రషీద్ ఖాన్ 3, భువనేశ్వర్ 2 ,వికెట్లు పడగొట్టగా సిద్దార్థ్ కౌల్ కు ఒక వికెట్ దక్కింది.