బెంగళూరు: పదునైన పేస్‌తో బెంబేలెత్తించిన హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా ‘ఎ’తో ఆదివారం ప్రారంభమైన నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ తరఫున బరిలో దిగిన సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని గడగడలాడించాడు. ఎనిమిది వికెట్లు సాధించి తన ఫస్ట్ క్లస్ కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.
సిరాజ్ ధాటికి టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 75.3 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా (127; 20 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకోగా... అతనికి లబ్‌షేన్ (60; 11 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. ఈ జోడీ ఐదో వికెట్‌కు 114 పరుగులు జతచేయడంతో ఆసీస్ కోలుకుంది. వీరిద్దరితో పాటు కుర్టీస్ పీటర్సన్ (31), హెడ్ (4), హ్యాండ్స్‌కోంబ్ (0), కెప్టెన్ మిచెల్ మార్‡్ష (0), నాసెర్ (0), ట్రైమెన్ (0)లను సిరాజ్ పెవిలియన్ బాట పట్టించాడు. కుల్దీప్ యాదవ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment