మహ్మద్ సిరాజ్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అతడిని అభిమానులు ముద్దుగా సిరాజ్ 'మియా' అని పిలుచుకుంటారు. సాధారణ ఆటో డ్రైవర్ కొడుకు స్ధాయి నుంచి వరల్డ్‌క్లాస్ క్రికెటర్‌గా ఎదిగిన సిరాజ్ ప్రయాణం ఎంతో మంది యువ క్రికెటర్లకు స్పూర్తిదాయకం.
గల్లీ క్రికెటర్ నుంచి టీమిండియా ముఖచిత్రంగా మారిన సిరాజ్ పుట్టిన రోజు నేడు. మార్చి 13న సిరాజ్ మియా తన 30వ పుట్టి నరోజును జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మన హైదరాబాదీ కోసం గురించి మీకు తెలియని కొన్ని విషయాలు..
హైదరాబాద్‌లోని పాత బస్తీలో ఓ ఆటో డ్రైవర్ తన కుటుంబంతో కలిసి జీవించే వాడు. అతడికి ఇద్దరు కొడుకులు. అందులో చిన్నవాడు మహ్మద్ సిరాజ్. సిరాజ్‌కు చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. కానీ అతడి కుటంబ ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రమే.
ఏదైమైనప్పటకి తను క్రికెటర్ కావాలని మాత్రం గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఆ చిన్నోడ. ఈ క్రమంలో సిరాజ్ చదువుపై దృష్టి పెట్టుకుండా క్లాస్‌లు డుమ్మా కొట్టి క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్‌కు వెళ్లిపోయేవాడు. అతడి సొదురుడు మంచిగా చదుకుని ఉన్నత స్దాయికి చేరుకునే ప్రయత్నంలో వుంటే.. సిరాజ్ మాత్రం క్రికెట్ అంటూ గ్రౌండ్‌లు వెంట తిరిగేవాడు.
ఈ క్రమంలో సిరాజ్ భవిష్యత్తుపై అతడి తల్లిదండ్రులకు బెంగ నెలకొంది. అన్నయ్య ఇంజినీరింగ్ చదువుతుంటే నువ్వు ఆటలతో కాలక్షేపం చేస్తున్నావు అంటూ అతడి తల్లి సిరాజ్‌పై కోపమయ్యేది. ఈ విషయాన్ని సిరాజ్ చాలా సందర్బాల్లో తెలిపాడు. కానీ సిరాజ్ మాత్రం తన ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన తన గమ్యానికి చేరుకోవడంలో వెనుక అడుగువేయలేదు.
రంజీల్లో అదరగొట్టి..
సిరాజ్‌తన ఆరంభంలో టెన్నిస్‌బాల్ క్రికెట్ ఆడేవాడు. అతడికి కోచ్ కూడా లేడు. తనకు తానే ఆటలో మెళకువలు నేర్చుకున్నాడు. టెన్నిస్ బాల్‌తోనే తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకున్నాడు. పూర్తిస్థాయిలో మెళకువలు నేర్వకముందే గంటకు 140 కిలోమీటర్ల వేగంతో సిరాజ్ బౌలింగ్ చేసేవాడు. లీగ్ స్థాయి క్రికెట్‌లో సత్తా చాటిన సిరాజ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.
ఈ క్రమంలో అతడిని అండర్-23 జట్టుకు ఎంపిక చేశారు. అక్కడ కూడా సత్తాచాటడంతో దేశీవాళీ క్రికెట్‌లో సిరాజ్ అరంగేట్రం చేశాడు. 2015-16 సీజన్‌లో రంజీల్లో సిరాజ్ డెబ్యూ చేశాడు. తన అరంగేట్ర సీజన్‌లోనే హైదరాబాద్ జట్టు తరఫున 41 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు.
దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టడంతో సిరాజ్‌కు ఐపీఎల్ రూపంలో అదృష్టం తలుపు తట్టింది. 2017 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ 2.6 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సిరాజ్ మారాడు. అనంతరం 2017లో న్యూజిలాండ్‌తో టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
అతడిది కీలక పాత్ర..
టీమిండియాకు సిరాజ్ ఎంపిక కావడంలో భారత మాజీ బౌలింగ్ కోచ్ అరుణ్ భరత్‌ది కీలక పాత్ర. 2016లో హైదరాబాద్ రంజీ జట్టుకు అరుణ్ భరత్ కోచ్‌గా వ్యవహరించాడు. అప్పడే.. సిరాజ్ కోచ్ భరత్ అరుణ్ దృష్టిలో పడ్డాడు. కివీస్‌తో తొలి టీ20 తర్వాత ఆశిష్ నెహ్రా రిటైరవనున్న నేపథ్యంలో చివరి 2 మ్యాచ్‌లకు జయదేవ్ ఉనద్కత్ లేదా బాసిల్ థంపిలలో ఒకరికి అవకాశం లభిస్తుందని అంతా భావించారు. కానీ అనుహ్యంగా సిరాజ్‌కు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. అయితే ఎవరూ ఊహించని విధంగా సిరాజ్‌కు జట్టులో చోటు దక్కడం వెనుక భరత్ పాత్ర ఉంది.
బ్యాటర్ టూ బౌలర్
కాగా సిరాజ్ తొలుత బ్యాటర్ కావాలనకున్నాడు. చార్మినార్ క్రికెట్ తరపున బ్యాటర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఏడో తరగతి నుంచి పదో క్లాస్‌కు వరకు బ్యాటర్‌గానే తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అయితే ఆ తర్వాత బౌలింగ్ పై శ్రద్ధ పెట్టి టాప్ క్లాస్ బౌలర్ గా ఎదిగాడు.
తండ్రి మరణాన్ని తట్టుకుని..
కాగా 2020లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గావస్కర్ సిరీస్‌తో సిరాజ్ భారత తరపున టెస్టుల్లో అడుగుపెట్టాడు. టెస్టుల్లో అరంగేట్రం చేసిన కొన్ని రోజులకే అతడి జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఊపిరితిత్తల వ్యాధితో బాధపడుతున్న సిరాజ్ తండ్రి మహమ్మద్ గౌస్ కన్నముశారు. ఆ సమయంలో సిరాజ్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఈ క్షణంలో మరో ఆటగాడైతే జట్టును వీడి తండ్రిని కడసారి చూసేందుకు వచ్చేవాడు.
కానీ సిరాజ్ మాత్రం తన తండ్రి మాటలను తలుచుకుని జాతీయ విధే ముఖ్యమని అక్కడే ఉండిపోయాడు. తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బీసీసీఐ అవకాశం కల్పించినప్పటికీ.. జట్టుతోనే ఉండాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఆ సిరీస్‌లో ఫైనల్ టెస్టులో ఐదు వికెట్లతో సిరాజ్ చెలరేగాడు. ఇప్పటివరకు భారత్ తరఫున 27 టెస్టులు, 41 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment