బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చిన్నారుల‌తో ఫుట్ బాల్ ఆడిన స‌చిన్! వీడియో వైరల్‌ | Sachin Tendulkar brings in birthday week by playing game of football with girls | Sakshi
Sakshi News home page

#Sachin Tendulkar: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చిన్నారుల‌తో ఫుట్ బాల్ ఆడిన స‌చిన్! వీడియో వైరల్‌

Published Thu, Apr 25 2024 4:27 PM | Last Updated on Thu, Apr 25 2024 4:27 PM

Sachin Tendulkar brings in birthday week by playing game of football with girls

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం (ఏప్రిల్ 24) తన 51వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు, యువరాజ్‌ సింగ్‌, గౌతం గంభీర్‌, సురేష్‌ రైనా, ఓజా వంటి మాజీ క్రికెటర్లు సచిన్‌కు సోషల్‌ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఐసీసీ, బీసీసీఐ కూడా సచిన్‌కు ఎక్స్ వేదిగా స్పెషల్ విషెస్ తెలియజేసింది. కాగా సచిన్ త‌న బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌ను సతీమణి అంజలితో కలిసి ‘సచిన్ టెండ్కూల్కర్‌ ఫౌండేషన్‌’లో జ‌ర‌పున‌కున్నాడు. చాలా సమయం పాటు అక్కడ ఉన్న చిన్నారులతో సచిన్‌ ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన విషయాలను సచిన్‌ అభిమానులతో పంచుకున్నాడు.

"ఈసారి నా బర్త్‌డే సెలబ్రేషన్స్‌ భిన్నంగా చేసుకోవడం చాల సంతోషంగా ఉంది. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ సాయంతో ఎదుగుతున్న చిన్నారుల మధ్య కేక్‌ కట్‌ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. వారితో  ఫుట్‌బాల్ ఆడటం, నా స్టోరీలను పంచుకోవడం ఎంతో అనుభూతిని ఇచ్చింది. నాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వీరే ఫస్ట్‌ అనుకుంటాను. ఈ మూమెంట్‌ నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని" తన బర్త్‌డే వేడుకల సంబంధించిన వీడియో క్లిప్‌ను సచిన్‌ ఎక్స్‌లో షేర్‌ చేశాడు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement