
దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ ఓటమి నుంచి కోలుకునే లోపే భారత్‌కు మరో భారీ షాక్. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయం కారణంగా మూడో టెస్ట్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో గాయపడిన సిరాజ్ ఇంకా కోలుకోనట్లు సమాచారం. ఈ క్రమంలో రెండో టెస్ట్ అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన భారత కోచ్ రాహుల్ ద్రవిడ్.. సిరాజ్ గాయంపై అప్‌డేట్ అందించాడు.
"సిరాజ్ నెట్స్‌లో కష్టపడాలి. హామ్ స్ట్రింగ్ గాయం నుంచి వెంటనే కోలుకోవడం చాలా కష్టం. మొదటి ఇన్నింగ్స్‌లో గాయంతో సిరాజ్ దూరం కావడం మాకు ఒక పెద్ద ఎదురుదెబ్బ. అతడు గాయపడినప్పటికీ మూడో రోజు బౌలింగ్‌కు వచ్చాడు. ఒక వేళ కెప్‌టౌన్ టెస్ట్‌కు సిరాజ్ దూరమైతే, ఉమేష్, ఇషాంత్ రూపంలో మాకు మంచి బెంచ్ బలం ఉంది అని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఇక జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియాపై దక్షిణాఫ్రికా 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్1-1తో సమమైంది. ఇక కేప్ టౌన్ వేదికగా జనవరి 11న ప్రారంభం కానున్న అఖరి టెస్ట్‌లో ఇరు జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి.
చదవండి: SA vs IND: కోహ్లి గాయంపై కీలక ప్రకటన చేసిన ద్రవిడ్..
Comments
Please login to add a commentAdd a comment