ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే ఆలౌటైన భారత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 208/2గా ఉంది. సాయి సుదర్శన్ (96), దేవ్‌దత్ పడిక్కల్ (80) క్రీజ్‌లో ఉన్నారు. అభిమన్యు ఈశ్వరన్ (12), రుతురాజ్ గైక్వాడ్ (5) ఔటయ్యారు. రుతురాజ్ వికెట్ ఫెర్గస్ ఓ నీల్‌కు దక్కగా.. అభిమన్యు ఈశ్వరన్ రనౌటయ్యాడు. ప్రస్తుతం భారత్ 120 ఆధిక్యంలో కొనసాగుతుంది.
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్ కుమార్ ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు, నితీశ్ కుమార్ రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మెక్‌స్వీని (39) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కూపర్ కన్నోలీ 37, వెబ్‌స్టర్ 33, టాడ్ మర్ఫీ 33, మార్కస్ హ్యారిస్ 17, ఫెర్గస్ ఓనీల్ 13, సామ్ కోన్‌స్టాస్ 0, బాన్‌క్రాఫ్ట్ 0, ఫిలిప్ 4, బ్రెండన్ డాగ్గెట్ 8 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 107 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ డాగ్గెట్ ఆరు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. జోర్డాన్ బకింగ్హమ్ రెండు, ఫెర్గస్ ఓనీల్, టాడ్ మర్ఫీ తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో దేవ్‌దత్ పడిక్కల్ (36), నవ్‌దీప్ సైనీ (23), సాయి సుదర్శన్ (21) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అభిమన్యు ఈశ్వరన్ 7, రుతురాజ్ గైక్వాడ్ 0, బాబా ఇంద్రజిత్ 9, ఇషాన్ కిషన్ 4, నితీశ్ రెడ్డి 0, మానవ్ సుతార్ 1, ప్రసిద్ద్ కృష్ణ 0 పరుగులకు ఔటయ్యారు. కాగా, రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం భారత-ఏ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment