ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అడమ్ గిల్‌క్రిస్ట్ పెద్ద పొరపాటు చేశాడు. ఇటీవలే టీమిండియా ఆటగాడు మహ్మద్ సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిరాజ్ తండ్రి అంత్యక్రియలకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో సిరాజ్‌కు భారత జట్టు ఆటగాళ్లతో పాటు ఆసీస్ క్రికెటర్లు కూడా సానుభూతి ప్రకటించారు. (చదవండి : రాహుల్‌కు క్షమాపణ చెప్పా: మ్యాక్స్‌వెల్)
శుక్రవారం ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో గిల్‌క్రిస్ట్ కామెంటేటర్‌గా వ్యవహరించాడు. కామెంటరీ సమయంలో సిరాజ్ తండ్రి చనిపోయిన విషయం గురించి మాట్లాడిన గిల్‌క్రిస్ట్ పొరపాటున సిరాజ్ బదులు నవదీప్ సైనీ పేరును ప్రస్తావించాడు. 'తండ్రి చనిపోయిన వెంటనే బీసీసీఐ సైనీకి ఇంటికి వెళ్లేందుకు అవకాశమిచ్చింది. కానీ జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అతను వెళ్లలేదు' అని పేర్కొన్నాడు. అయితే గిల్‌క్రిస్ట్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి : హార్దిక్ బౌలింగ్ ఇప్పట్లో లేనట్లేనా?)
గిల్లీ వ్యాఖ్యలను గుర్తించిన న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మెక్లీన్‌గన్‌తో పాటు కొంతమంది అభిమానులు ట్విటర్ ద్వారా అతని పొరపాటును ట్యాగ్ చేశారు. చనిపోయింది సిరాజ్ తండ్రి.. నవదీప్ సైనీ తండ్రి కాదంటూ తెలిపారు. విషయం గ్రహించిన గిల్లీ వెంటనే ట్విటర్‌లో స్పందించాడు.' నా పొరపాటును గ్రహించాను. సిరాజ్‌కు బదులు పొరపాటుగా సైనీ పేరు వాడాను. ఈ సందర్భంగా సిరాజ్, సైనీలకు ఇవే నా క్షమాపణలు. నేను పొరపాటుగా చేసిన వ్యాఖ్యలను గుర్తించిన మెక్లీన్‌గన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నా.. మరొకసారి మీ అందరిని క్షమాపణ కోరుతున్నా' అంటూ గిల్లీ ట్వీట్ చేశాడు.
Yes, thanks @anshu2912 I realize I was mistaken in my mention. Huge apologies for my error, to both @navdeepsaini96 and Mohammed Siraj. 🙏😌 https://t.co/618EUIEyNU
— Adam Gilchrist (@gilly381) November 27, 2020
Yep, thanks @Mitch_Savage My huge apologies again to all. https://t.co/F8rYsD6fxm
— Adam Gilchrist (@gilly381) November 27, 2020
Comments
Please login to add a commentAdd a comment