
Adam Gillchrist Picks One Indian In World T20I Top 5 List: ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌కు మరో రెండు వారాల్లో తెరలేవనుంది. ఈ ఐసీసీ మెగా ఈవెంట్ కోసం అన్ని జట్లు సిద్దమవుతున్నాయి. ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా అన్ని ప్రాధాన జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లలో బీజీబీజీగా గడుపుతున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ప్రపంచంలోనే టాప్ 5 టీ20 ఆటగాళ్లను ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఎంపిక చేశాడు.
ఈ జాబితాలో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు గిల్‌క్రిస్ట్ చోటిచ్చాడు. గిల్‌క్రిస్ట్ ఎంపిక చేసిన ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు ఆగ్ర స్థానంలో చోటు దక్కింది.
అదే విధంగా రెండో స్థానంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం.. వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో హార్దిక్ పాండ్యా, ఆఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను గిల్‌క్రిస్ట్ ఎంపిక చేశాడు. ఇక అఖరిగా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ను ఈ మాజీ ఆసీస్ ఓపెనర్ అవకాశమిచ్చాడు.
చదవండి: IND vs SA: టీమిండియాలో చోటు.. ఎవరీ ముఖేష్ కుమార్?
Comments
Please login to add a commentAdd a comment