శ్రీలంకతో తొలి వన్డేలో అదరగొట్టిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. కోల్‌కతా వేదికగా రెండో వన్డేలో కూడా సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో 5.4 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో లంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండోను సిరాజ్‌ను ఓ సంచలన బంతితో పెవిలియన్‌కు పంపాడు.
ఫెర్నాండోను సిరాజ్ అద్బుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. శ్రీలంక ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో సిరాజ్ వేసిన ఆఖరి బంతిని ఫెర్నాండో కవర్ డ్రైవ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి స్వింగ్ అయ్యి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది.
దీంతో అవిష్క ఫెర్నాండో ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారత బౌలర్లు చెలరేగడంతో 215 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సిరాజ్ చెరో మూడు వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. ఉమ్రాన్ మాలిక్ రెండు, అక్షర్ ఒక్క వికెట్ సాధించారు.
చదవండి: IND vs SL: సహాచర ఆటగాడిపై అసభ్య పదజాలం వాడిన హార్దిక్! ఇదేమి బుద్దిరా బాబు..
Timber Strike, the @mdsirajofficial way 👌👌
— BCCI (@BCCI) January 12, 2023
Relive how he dismissed Avishka Fernando 🔽
Follow the match 👉 https://t.co/MY3Wc5253b#TeamIndia | #INDvSL pic.twitter.com/ZmujAITsco
Comments
Please login to add a commentAdd a comment