ముంబై: టెస్టు క్రికెట్‌లోకి ప్రవేశించిన నాటినుంచి అద్భుత ప్రదర్శనతో భారత జట్టులో కీలక సభ్యుడిగా మారిన హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. ‘సిరాజ్ కాళ్లల్లో స్ప్రింగ్‌లు ఉన్నట్లుగా చురుగ్గా ఉంటాడు. అది నాకెంతో నచ్చుతుంది. అతని రనప్ కూడా బాగుంటుంది. మైదానంలో ఎల్లప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తాడు.
ఆటలో ఆ రోజు తొలి ఓవర్ వేస్తున్నాడా, చివరిది వేస్తున్నాడా అనిపించే అరుదైన బౌలర్లలో సిరాజ్ ఒకడు. ఏ సమయంలోనైనా దూసుకొచ్చేందుకు అతను సిద్ధంగా ఉంటాడు’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. మాస్టర్ ప్రశంసలపై సిరాజ్ కృతజ్ఞతలు తెలిపాడు. సచిన్ స్థాయి వ్యక్తి తనను మెచ్చుకోవడం తనకు మరింత ప్రేరణ అందిస్తుందని, దేశం కోసం అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తానని అతను అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment