sachin tendukar
-
లక్షలమందికి స్ఫూర్తినువ్వు, సలాం అమీర్: సచిన్, గౌతం అదానీ ఫిదా
జమ్ము కశ్మీర్ బిజ్బెహరాలోని వాఘమా గ్రామానికి చెందిన 34 ఏళ్ల వికలాంగ క్రికెటర్ అమీర్ హుస్సేన్ లోన్ అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఏ చిన్న కష్టం వచ్చినా ఇన్ని కష్టాలు నాకే అని తెగ ఫీల్ అయిపోతూ, నిరాశలో మునిగిపోయేవాళ్లకి నిజంగా అమీర్ ఇన్సిపిరేషన్. చేతులు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో తన కిష్టమైన క్రీడలో రాణిస్తున్నాడు. దాన్నే చాలెంజింగఠ్గా తీసుకోని అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. అందుకే క్రికెట్ లెజెండ్ సచిన్ ప్రశంసలు దక్కించుకున్నాడు. ఎనిమిదేళ్ల వయసులో తండ్రి మిల్లులో జరిగిన ప్రమాదంలో అమర్ రెండు చేతులను కోల్పోయాడు. దీంతో క్రికెట్ అంటే ఎంతో ఇష్టమైన అమీర్ మొదట్లో చాలా బాధపడ్డాడు. ఎందుకంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, ఇలా ఏది వేయాలన్నా చేతులు తప్పనిసరి. అయినా ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. ఎంతో కష్టపడి తనకిష్టమైన క్రికెట్‌ను సాధన చేశాడు. మెడ, భుజం సాయంతో బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేయడం అలవర్చుకున్నాడు. క్రమంగా అందులో ఆరితేరాడు. అంతేకాదు కుడి కాలి వేళ్ల మధ్య బంతి పెట్టుకుని, కాలిని తిప్పిఅలవోకగా బౌలింగ్ వేయడం నేర్చుకున్నాడు. తనదైన ప్రతిభతో అందరి దృష్టినీ తన పైపు తిప్పుకున్నాడు. ఈ ప్రతిభకు మెచ్చిన ఒక ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో అమీర్ పారా క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. आमिर की यह भावुक कर देने वाली कहानी अद्भुत है! हम आपकी हिम्मत, खेल के प्रति निष्ठा और विपरीत परिस्थिति में भी कभी ना हार मानने वाले जज्बे को प्रणाम करते हैं।@AdaniFoundation आपसे शीघ्र संपर्क कर इस बेमिसाल सफर में आपका हर संभव सहयोग करेगा। आपका संघर्ष, हम सबके लिए प्रेरणा है। https://t.co/LdOouyimyK — Gautam Adani (@gautam_adani) January 13, 2024 అలా 2013 నుంచి అమీర్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతూ వస్తున్నాడు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ పారా క్రికెట్ జట్టుకు సారధ్యం వహించే స్థాయికి చేరాడు 34 ఏళ్ల అమీర్. 2013, 2018లో జాతీయ టోర్నీలో ఆడాడు. బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ మ్యాచ్‌కి కూడా ప్రాతినిథ్యం వహించాడు. నేపాల్, షార్జా, దుబాయ్‌లోనూ అమీర్ హుస్సేన్ మ్యాచ్‌లాడాడు. క్రికెట్ దేవుళ్లు సచిన్, కోహ్లీలను కలవాలనేదే అమీర్ కల. స్పందించిన సచిన్ క్రీడపై మక్కువ ఉన్న లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చినందుకు చాలా బాగుందంటూ టెండూల్కర్ ఎక్స్‌లో రాశారు. తన పేరుతో ఉన్న జెర్సీ వేసుకుని క్రికెట్ ఆడుతున్న అమీర్‌పై సచిన్ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ పట్ల అతనికి ఉన్న ప్రేమ, అంకితభావం తనను ముగ్దుణ్ని చేసిందని సచిన్ ఫిదా అయిపోఆరు. అలాగే అమీర్‌ను కలిసి అతని పేరుతో ఉన్న జెర్సీని తీసుకుంటానని సచిన్ చెప్పడం విశేషంగా నిలిచింది. And Amir has made the impossible possible. I am so touched watching this! Shows how much love and dedication he has for the game. Hope I get to meet him one day and get a jersey with his name. Well done for inspiring millions who are passionate about playing the sport. https://t.co/s5avOPXwYT — Sachin Tendulkar (@sachin_rt) January 12, 2024 అవసరమైన సాయం చేస్తా: గౌతం అదానీ ప్రతికూల పరిస్థితులలో కూడా తన స్ఫూర్తిని కొనసాగించిన అమీర్ కృషిపై పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కూడా స్పందించారు. అదానీ ఫౌండేషన్ ద్వారా సాధ్యమైన సాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. నాకు మాటలు రావడం లేదు: అమీర్ భార్య అమీర్‌కు మద్దతుగా నిలిచిన సచిన్ , అదానీ కృతజ్ఞతలు చెప్పింది అమీర్ భార్య షోక్టీ. సంతోషాన్ని చెప్పడానికి తన దగ్గర మాటల్లేవంటూ భావోద్వేగానికి లోనైంది. -
ఈ రైల్వే స్టేషన్ పేరు సచిన్!
స్టేడియంల సంగతి ఏమిటోగానీ రైల్వేస్టేషన్లకు క్రికెటర్ల పేర్లు ఊహించలేము. అయితే గుజరాత్‌లోని సూరత్ సమీపంలోని ఒక రైల్వేస్టేషన్ పేరు సచిన్. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ రైల్వేస్టేషన్ ముందు దిగిన ఫోటో వైరల్‌గా మారింది. ‘ఈ రైల్వేస్టేషన్‌కు మన ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకరైన నా ఫేవరెట్ క్రికెటర్, నా అభిమాన వ్యక్తి పేరు పెట్టారు. గత శతాబ్దానికి చెందిన పెద్దల ముందు చూపు అబ్బురపరుస్తుంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు సునీల్ గవాస్కర్. ఇది చూసి ‘సచిన్‌లో సన్నీని చూడడం ఆనందంగా ఉంది’ అంటూ స్పందించాడు సచిన్ తెందూల్కర్. నిజానికి ఈ రైల్వేస్టేషన్‌కి ‘సచిన్’ అనే పేరు సచిన్ తెందూల్కర్ తాతముత్తాల కాలంలోనే ఉంది. సచిన్ తెందూల్కర్ పేరుకు, ఈ రైల్వేస్టేషన్ పేరుకు ఎలాంటి సంబంధం లేకపోయినా సరదా కోసం ‘పూర్వీకుల ముందుచూపు అబ్బురపరిచింది’ అని రాశాడు గవాస్కర్. -
అనుమతి లేకుండా సచిన్ ఫోటో వాడుకుంటున్న డిగ్రీ కంపెనీ
-
నేను మూడేళ్లు ఇక్కడే ఆడాను.. అతడొక అద్భుతం! ఏ బౌలర్ కైనా చుక్కలే: రోహిత్
ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడో విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షో అదరగొట్టిన ముంబై.. 14 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ముంబై ఇండియన్స్ చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. హైదరాబాద్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తిరిగి ఇక్కడ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది అని రోహిత్ తెలిపాడు. కాగా ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్ జట్టుకు మాడేళ్ల పాటు రోహిత్ ప్రాతినిధ్యం వహించాడు. 2009 ఐపీఎల్ సీజన్లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ సారథ్యంలోని దక్కన్ ఛార్జర్స్ చాంపియన్‌గా నిలిచింది. ఆ జట్టులో రోహిత్ శర్మ కూడా భాగంగా ఉన్నాడు. అతడొక అద్భుతం.. నాకు హైదరాబాద్‌లో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నేను మూడేళ్ల పాటు ఇదే స్టేడియంలో ఆడాను. ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన డెక్కన్ చార్జర్స్ జట్టులో కూడా నేను ఉన్నాను. మళ్లీ ఇక్కడ ఆడడం చాలా సంతోషంగా ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో మా యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. మా జట్టులో చాలా మందికి ఇదే తొలి ఐపీఎల్. వారికి మా జట్టు మేనెజ్మెంట్ మద్దతుగా నిలిచింది. కాబట్టి వారు ఇప్పుడు అదరగొడుతున్నారు. అదే విధంగా నా బ్యాటింగ్ పట్ల సంతోషంగా ఉన్నాను. ఓపెనర్‌గా వచ్చి అద్భుతమైన శుభారంభం ఇవ్వడానికే నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను. పవర్ ప్లేలో మా బ్యాటింగ్ పట్ల సంతోషంగా ఉంది. అదే విధంగా మాకు చాలా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. కాబట్టి మా బాయ్స్ వారికి నచ్చిన విధంగా ఆడేందుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ఇక తిలక్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత సీజన్లో ఏమి చేశాడో.. ఇప్పడూ అదే చేస్తున్నాడు. అతడు ఆడే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అతడు ఏ బౌలర్‌కైనా ఆడినా ఒకేలా ఆడుతాడు. అదే అతడి స్పెషాలిటీ. మరోవైపు అర్జున్ కూడా అద్భుతంగా రాణించాడు. అతడు గత మూడేళ్లగా మా జట్టులో ఉన్నాడు. అతడు అన్ని విషయాలు నేర్చుకున్నాడు. అర్జున్ డెత్ ఓవర్లలో అద్భుతంగా యార్కర్లు వేస్తున్నాడు. అదే విధంగా కొత్త బాల్‌తో పవర్‌ప్లేలో బౌలింగ్ చేసే సత్తా కూడా అర్జున్‌కు ఉంది" అని రోహిత్ పోస్ట్‌మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు. చదవండి: IPL 2023 SRH vs MI: అదే మా కొంపముంచింది.. లేదంటేనా! అందుకే అలా చేశా IPL 2023: సచిన్ కొడుకుతో అట్లుటంది మరి.. శబాష్ అర్జున్! వీడియో వైరల్ Three wins in a row for the @mipaltan as they beat #SRH by 14 runs to add two key points to their tally. Scorecard - https://t.co/oWfswiuqls #TATAIPL #SRHvMI #IPL2023 pic.twitter.com/asznvdy1BS — IndianPremierLeague (@IPL) April 18, 2023 -
ఉద్యోగులకు బంపరాఫర్
ముంబై: క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ తెండూల్కర్ పెట్టుబడులున్న సెకండ్‌హ్యాండ్(ప్రీఓన్డ్) కార్ రిటైలింగ్ ప్లాట్‌ఫామ్ స్పిన్నీ.. ఉద్యోగులకు స్టాక్ కేటాయింపు పథకాన్ని(ఇసాప్) ప్రవేశపెట్టింది. ఏడాది కాలాన్ని పూర్తిచేసుకున్న ఉద్యోగులకు తాజాగా షేర్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. గత రౌండ్లో ఇసాప్ పొందిన ఉద్యోగులకు జతగా అర్హత కలిగిన మరో 3,000–3,500 మందికి షేర్లు లభించనున్నట్లు వెల్లడించింది. 2021 డిసెంబర్లో తొలిసారి తొలి ఇసాప్ బైబ్యాక్ సౌకర్యాన్ని కల్పించినట్లు ప్రస్తావించింది. దీంతో పలువురు ఉద్యోగులు భారీగా లబ్ది పొందడంతో సొంత గృహాలను సైతం సమకూర్చుకున్నట్లు వివరించింది. కంపెనీ హైదరాబాద్‌సహా ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, ముంబై, పుణే తదితర 22 పట్టణాలలో 36 కేంద్రాల ద్వారా సేవలందిస్తోంది. -
త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోన్న సచిన్ కూతురు సారా!
Sachin Tendulkar Daughter Sara Bollywood Debut Soon: క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ ముద్దుల తనయ సారా త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సెలబ్రిటీ కిడ్ అయిన సారాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్ట్రాగామ్‌లో ఆమెకు 1.8 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వెండితెర ఎంట్రీకి ముందే ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న సారా ఇప్పటికే పలు బ్రాండ్లను ఎండార్స్ చేస్తూ మరింత పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో త్వరలోనే ఆమె ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త బి-టౌన్లో చర్చనీయాంశంగా మారింది. ఈ తాజా బజ్ ప్రకారం బెసిగ్గా నటనపై ఆసక్తి ఉన్న సారా ఇప్పటికే మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది. చదవండి: పోలీసులు ఘోరంగా అవమానించారు: ‘స్కామ్ 1992’ నటుడు ఆవేదన ఈ క్రమంలో ఆమె బాలీవుడ్ డెబ్యూ మూవీపై కొంతకాలంగా చర్చ నడుస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె త్వరలోనే ఓ మూవీలో బాలీవుడ్ సిల్వర్ స్క్రిన్‌పై సందడి చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇందుకోసం ఆమె పలు బ్రాండ్లకు ఎండార్స్ చేస్తూ నటనలో శిక్షణ కూడా తీసుకుంటుందని బి-టౌన్ మీడియాలు తమ కథనంలో రాసుకొస్తున్నాయి. కాగా లండన్ యూనివర్సిటీ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేసిన సారా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఓ అంతర్జాతీయ క్లాతింగ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తోంది. అంతేకాదు ఇటీవల మోడలింగ్‌లోకి అడుగుపెట్టి..సొంతంగా డిజైన్ చేయించిన అంతర్జాతీయ క్లాతింగ్ను ప్రమోట్ చేసుకుంటోంది. సారా క్లాతింగ్ బ్రాండ్స్ ఈ-కామర్స్ ప్లాట్ ఫాం అజియో లక్స్‌లో(Ajio Luxe) అందుబాటులో ఉన్నాయి. -
ఒకే జట్టులో సచిన్, ధోని,యువరాజ్.. కోహ్లి, రోహిత్‌కు నోఛాన్స్!
పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. తన జట్టులో నలుగురు భారత ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాడు. కాగా తన జట్టులో ఓపెనర్లుగా గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు గోర్డాన్ గ్రీనిడ్జ్‌ని ఎంచుకున్నాడు. పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్, సయీద్ అన్వర్‌కి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో చోటు కల్పించాడు. ఐదో స్ధానంలో భారత మాజీ కెప్టెన్ ధోనికి అవకాశం ఇచ్చాడు. ఆరో స్ధానంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్‌కి చోటు దక్కింది. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో కపిల్‌దేవ్, యువరాజ్ సింగ్‌ను అక్తర్ ఎంపిక చేశాడు. తన జట్టులో ఏకైక స్పిన్నర్‌గా షేన్ వార్న్‌ను ఎంచుకున్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఇక బౌలర్ల కోటాలో వసీం అక్రమ్, వకార్ యూనిస్‌కు చోటు దక్కింది. కాగా అక్తర్ ప్రకటించిన జట్టులో భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి చోటు దక్కలేదు. షోయబ్ అక్తర్ ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: సచిన్ టెండూల్కర్, గోర్డాన్ గ్రీనిడ్జ్, ఇంజమామ్-ఉల్-హక్, సయీద్ అన్వర్, మహేంద్ర సింగ్ ధోనీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, యువరాజ్ సింగ్, షేన్ వార్న్ (కెప్టెన్), వసీం అక్రమ్, కపిల్ దేవ్, వకార్ యూనిస్ చదవండి: IND Vs SA: భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
భారత బౌలర్‌పై సచిన్ ప్రశంసల జల్లు..
ముంబై: టెస్టు క్రికెట్లోకి ప్రవేశించిన నాటినుంచి అద్భుత ప్రదర్శనతో భారత జట్టులో కీలక సభ్యుడిగా మారిన హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. ‘సిరాజ్ కాళ్లల్లో స్ప్రింగ్‌లు ఉన్నట్లుగా చురుగ్గా ఉంటాడు. అది నాకెంతో నచ్చుతుంది. అతని రనప్ కూడా బాగుంటుంది. మైదానంలో ఎల్లప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తాడు. ఆటలో ఆ రోజు తొలి ఓవర్ వేస్తున్నాడా, చివరిది వేస్తున్నాడా అనిపించే అరుదైన బౌలర్లలో సిరాజ్ ఒకడు. ఏ సమయంలోనైనా దూసుకొచ్చేందుకు అతను సిద్ధంగా ఉంటాడు’ అని సచిన్ వ్యాఖ్యానించాడు. మాస్టర్ ప్రశంసలపై సిరాజ్ కృతజ్ఞతలు తెలిపాడు. సచిన్ స్థాయి వ్యక్తి తనను మెచ్చుకోవడం తనకు మరింత ప్రేరణ అందిస్తుందని, దేశం కోసం అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నిస్తానని అతను అన్నాడు. చదవండి: న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్‌పై వేటు.. -
‘పండోరా పేపర్స్’.. వారి గుట్టురట్టు చేయనున్న కేంద్రం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది సంపన్నులు, ప్రముఖులు, రాజకీయ నేతల రహస్య ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలను ‘పండోరా పేపర్స్’ పేరిట ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్(ఐసీఐజే) బహిర్గతం చేసింది. ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద లీక్ అని భావిస్తున్నారు. పండోరా లీక్డ్ డాక్యుమెంట్లలో 300 మందికిపైగా భారతీయుల వివరాలున్నాయి. వీరిలో చాలామంది ఆర్థిక నేరగాళ్లు, మాజీ ఎంపీలే కావడం విశేషం. వీరు ఇప్పటికే దర్యాప్తు సంస్థల నిఘా పరిధిలో ఉన్నారు. చాలా మంది భారతీయులు ఇవి తప్పుడు ఆరోపణలను తిరస్కరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి 18 దేశాల్లో ఆస్తులు ఉన్నట్లు వార్తలొచ్చాయి. వీరిలో మాజీ క్రికెటర్, భారతరత్న సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. అయితే, ఈ నేపథ్యంలో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. "పండోరా పేపర్స్" కేసు దర్యాప్తును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ నేతృత్వంలోని మల్టీ ఏజెన్సీ గ్రూప్ పర్యవేక్షిస్తున్నదని సోమవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని సంబంధిత దర్యాప్తు సంస్థలు ఈ కేసుల దర్యాప్తును చేపడతాయని, చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకొనున్నట్లు సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసుల దర్యాప్తులో ఈడీ, ఆర్బీఐ, ఎఫ్ఐయూ సంస్థల ప్రతినిధులు ఈ బృందంలో కీలక పాత్ర పోషించనున్నారు. (చదవండి: నల్ల ధనవంతుల గుట్టురట్టు!) ఇప్పటివరకు కొంతమంది భారతీయుల పేర్లు(చట్టపరమైన సంస్థలతో పాటు వ్యక్తులు) మాత్రమే మీడియాలో కనిపించాయని తెలిపింది. తాము సేకరించిన 1.2 కోట్ల పత్రాల ఆధారంగా సంపన్నుల ఆర్థిక రహస్యాలను బహిర్గతం చేసినట్లు ఐసీఐజే ట్వీట్ చేసింది. ఐసీఐజే వెబ్సైట్లో కూడా పేర్లను, అన్ని సంస్థల ఇతర వివరాలకు సంబంధించిన సమాచారం విడుదల చేయలేదని పేర్కొంది. ఐసీఐజే వెబ్సైట్లో దశలవారీగా సమాచారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. పండోరా పేపర్స్ దర్యాప్తుకు అనుసంధానించిన నిర్మాణాత్మక డేటా దాని ఆఫ్ షోర్ లీక్స్ డేటాబేస్ లో రాబోయే రోజుల్లో మాత్రమే విడుదల చేయనున్నట్లు సూచించింది. 117 దేశాల్లోని 150కి పైగా వార్తా సంస్థలకు చెందిన 600 మంది విలేకర్లు 1.20 కోట్ల ఆర్థిక లావాదేవీల పత్రాలను పరిశీలించి ఈ గుట్టును రట్టుచేసింది. విశ్లేషించిన మొత్తం సమాచారం పరిమాణం 2.94 టెరాబైట్ల మేర ఉంది.(చదవండి: రహస్య లావాదేవీల కుంభకోణం.. సచిన్‌కు క్లీన్చిట్!) -
ఆక్సిజన్ కొరత: సచిన్ భారీ విరాళం!
ముంబై: కరోనా బాధితులకు సహాయం అందించేందుకు తమ వంతుగా వితరణ ఇచ్చేందుకు ఐపీఎల్ టీమ్‌లు ముందుకు వచ్చాయి. రాజస్తాన్ రాయల్స్ ఇందుకోసం రూ. 7.5 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, టీమ్ యాజమాన్యం అందరి భాగస్వామ్యం ఉన్నట్లు రాయల్స్ ప్రకటించింది. తాము ఇచ్చిన నిధులు ప్రధానంగా రాజస్తాన్ రాష్ట్రంలో ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమన్యం కూడా రూ. 1.5 కోట్లు ప్రకటించింది. టీమ్ సహ యజమానులు తమ జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్, వరలక్ష్మి ఫౌండేషన్ తరఫున ఈ మొత్తాన్ని అందిస్తున్నారు. ఢిల్లీకి చెందిన రెండు ఎన్జీఓలకు ఈ విరాళం ఇస్తున్నామని... సరైన రీతిలో ఈ నిధులు వినియోగం అయ్యేలా ఆ రెండు సంస్థలు బాధ్యత తీసుకుంటాయని ఢిల్లీ క్యాపిటల్స్ స్పష్టం చేసింది. సచిన్ కూడా... మరో వైపు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా తన వంతుగా సహకారం అందించేందుకు ముందుకు వచ్చాడు. కోవిడ్ రోగులు ఆక్సిజన్ కొరత కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత స్థితిలో దానిని నివారించేందుకు అతను సహాయం అందించనున్నాడు. ‘250 మంది సభ్యుల ఒక యువ బృందం మిషన్ ఆక్సిజన్ పేరుతో నిధుల సేకరణ చేస్తోంది. నా వైపునుంచి వారికి విరాళం ఇచ్చాను’ అని ప్రకటించిన సచిన్ ఎంత మొత్తం అనేది అధికారికంగా చెప్పకపోయినా రూ.1 కోటి అని సమాచారం. చదవండి: సన్‌రైజర్స్ క్రికెటర్ ఔదార్యం.. మనసులు గెల్చుకున్నావ్! -
సచిన్ కోవిడ్‌ను కూడా సిక్సర్ కొట్టగలడు: వసీం అక్రం
ఇస్లామాబాద్: ఇటీవల కరోనా బారినపడిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. డాక్టర్ల సూచన మేరకు శుక్రవారం ఆసుపత్రిలో చేరాడు. ఈ వార్త బయటకు రాగానే యావత్ క్రీడా ప్రపంచం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ప్రముఖులందరూ సచిన్ ఆరోగ్యం గురించి వాకబు చేయడం మొదలుపెట్టారు. అయితే తనకెటువంటి ఇబ్బంది లేదని, తాను క్షేమంగా ఉన్నానని, సచిన్ స్వయంగా ట్వీట్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో పాక్ దిగ్గజ బౌలర్ వసీం అక్రం కూడా సచిన్ ఆరోగ్యం గురించి ఆరా తీసి, అతను త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశాడు. Even when you were 16, you battled world’s best bowlers with guts and aplomb... so I am sure you will hit Covid-19 for a SIX! Recover soon master! Would be great if you celebrate India’s World Cup 2011 anniversary with doctors and hospital staff... do send me a pic! https://t.co/ICO3vto9Pb — Wasim Akram (@wasimakramlive) April 2, 2021 "16 ఏళ్ల వయసులోనే ప్రపంచ అత్యుత్తమ బౌలర్లను గడగడలాడించావు, నువ్వు కోవిడ్‌ను కూడా సిక్స్ కొట్టగలవు, త్వరగా కోలుకో మాస్టర్" అంటూ అక్రం ట్వీట్లో పేర్కొన్నాడు. "భారత్ 2011 వన్డే ప్రపంచకప్ గెలిచి నేటికి దశాబ్ద కాలం పూర్తయ్యింది, ఈ ఆనంద క్షణాలను నువ్వు డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బందితో పంచుకుంటావని ఆశిస్తున్నా, సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను నాకు కూడా పంపించు" అని అక్రం ట్వీట్లో ప్రస్థావించాడు. 90వ దశకంలో సచిన్, అక్రంల మధ్య మైదానంలో ఆధిపత్య పోరు నడిచింది. ఇందులో అనేక సందర్భాల్లో సచిన్‌దే పైచేయిగా నిలిచింది. కాగా, ఇటీవల ముగిసిన రోడ్ సేఫ్టీ ప్రపంచ సిరీస్ సందర్భంగా సచిన్‌తో పాటు భారత దిగ్గజ జట్టు సభ్యులు ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, బద్రీనాధ్లు కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. చదవండి: సన్‌రైజర్స్‌కు డబుల్ ధమాకా.. జట్టులో చేరిన స్టార్ ఆటగాళ్లు -
సచిన్, గంగూలీ తర్వాత ఆ రికార్డు వీరిదే..
పుణే: టీమిండియా స్టార్ ఓపెనింగ్ పెయిర్ రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ ఖాతాలో అరుదైన రికార్డు జమ అయ్యింది. వీరి జోడీ వన్డే క్రికెట్లో 5000 పరుగులకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్సి.. ఈ ఘనత సాధించిన ఏడో ఓపెనింగ్ జోడీగా చరిత్ర సృష్టించారు. ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో ఈ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్.. 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. శిఖర్ ధవన్ (56 బంతుల్లో 67; 10 ఫోర్లు) చూడచక్కని బౌండరీలతో అర్ధశతకం సాధించగా, రోహిత్ (37 బంతుల్లో 37; 6 ఫోర్లు) తనదైన శైలీలో అలరించాడు. ఈ మ్యాచ్‌లో వీరి భాగస్వామ్యం 5000 పరుగులను దాటింది. ఇక్కడ చదవండి: టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్: ఆరంభం, ముగింపు ఒకేలా! కాగా, అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ ఉన్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 8227 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి తరువాత స్థానాల్లో శ్రీలంక జోడీలు సంగక్కర-జయవర్దనే (5992 పరుగులు), దిల్షాన్-సంగక్కర (5475), జయసూర్య-ఆటపట్టు (5462), ఆసీస్ జోడీ గిల్‌క్రిస్ట్-హేడెన్ (5409), విండీస్ పెయిర్ గ్రీనిడ్జ్- హేన్స్ (5206) ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో రోహిత్-శిఖర్ జోడీ చేరింది. ఇక్కడ చదవండి: పాపం కోహ్లి.. ఆ విషయంలో దురదృష్టం వెంటాడుతోంది -
అర్జున్ బ్యాటింగ్ మెరుపులు..సిక్సర్ల మోత
ముంబై: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచాడు. బంతితోనూ, బ్యాట్‌తోనూ చెలరేగిపోయి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది తన మార్కు చూపించాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) స్థానికంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్లో అర్జున్ టెండుల్కర్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఎమ్ఐజీ క్రికెట్ క్లబ్- ఇస్లాం జింఖానా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎమ్ఐజీ తరఫున మైదానంలో దిగిన అతడు.. తన అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా తొలుత బ్యాటింగ్ దిగిన ఎమ్ఐజీ క్రికెట్ క్లబ్ జట్టు.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ప్రగ్నేశ్ కందీలెవార్ సెంచరీ చేయగా, మరో ఆటగాడు కెవిన్ 96 పరుగుల వద్ద నిలిచిపోయాడు. ఇక అర్జున్ టెండుల్కర్ 31 బంతుల్లోనే 77 పరుగులు చేసి వహ్వా అనిపించాడు. 5 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగి ఆడుతూ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్ హషీర్ దఫేదార్ వేసిన ఓవర్లోనే ఐదు సిక్స్‌లు బాదాడు. ఈ ముగ్గురి భారీ ఇన్నింగ్స్‌తో ఎమ్ఐజీ జట్టు 45 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది. (చదవండి: ఇప్పుడేమంటారు: అశ్విన్ భార్య) ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన జింఖానా జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. ఆ జట్టు 191 పరుగులకే ఆలౌట్ అయి 194 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. అర్జున్ టెండుల్కర్, అంకుశ్ జైస్వాల్. శ్రేయస్ గౌరవ్ మూడేసి వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించారు. కాగా క్యాష్ రిచ్‌లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో భాగంగా అర్జున్ ఇటీవల తన పేరును నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కనీస ధరతో రిజిస్టర్ చేసుకున్న అర్జున్, మరో మూడు రోజుల్లో ఆటగాళ్ల వేలం జరుగనున్న వేళ ఈ మేరకు పొట్టి ఫార్మాట్ తరహాలో అద్భుత ఇన్నింగ్స్ ఆడటం విశేషం. -
నాటి రాళ్లు నేటి పూలు.. మన్నించు మారియా!
ఆరేళ్ల క్రితం.. ‘సచిన్ ఎవరో నాకు తెలీదు’ అని టెన్నిస్ తార మారియా షరపోవా అన్నందుకు ఆగ్రహించిన సచిన్ అభిమానులు ఇప్పుడు ఆ షరపోవాకే.. ‘మన్నించు మారియా, నువ్వన్నది కరెక్టే. అతడు నీకు తెలిసి ఉండాల్సినంత మనిషి కాదు’ అని ఆమె ఫేస్బుక్లో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఆమెకు లైకుల మీద లైకులు కొడుతున్నారు. రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన విదేశీ ప్రముఖుల్ని హెచ్చరిస్తూ.. ‘ఇది మా సొంత విషయం’ అని సచిన్ ట్వీట్ చేయడమే ఇందుకు కారణం. ఢిల్లీ సరిహద్దులలో కొన్ని నెలలుగా రైతు ఉద్యమం జరుగుతోంది. ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలు తమ మెడకు ఉరి వంటివి కనుక వాటిని రద్దు చేయాలని రైతుల డిమాండ్. ప్రభుత్వానికి, రైతులకు మధ్య ఎన్ని విడతలుగా చర్చలు జరిగినా ఒక ఫలవంతమైన ముగింపు రావడం లేదు. ఈలోపు వివిధ కారణాల వల్ల కనీసం 170 మంది ఉద్యమ రైతులు మరణించారని వస్తున్న వార్తలతో ప్రపంచం నలుమూలల నుంచి రైతుల డిమాండ్‌కు ట్వీట్ల ద్వారా మద్దతు లభిస్తోంది. స్వీడన్ నుంచి పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, బార్బడోస్ పాప్ గాయని రిహాన్నా వంటివారు రైతులకు తమ సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. విదేశీ సానుభూతి పరులకు వ్యతిరేకం గా పెట్టిన ట్వీట్ ఆయన అభిమానుల ఆగ్రహానికి కారణం అయింది. ‘భారత్ తన సార్వభౌమాధికారం విషయంలో రాజీకి రానవసరం లేదు. బయటి శక్తులు వీక్షకులుగా ఉండొచ్చు కానీ, భాగస్వాములు కాదగరు’ అని థన్‌బర్గ్, రిహాన్నాలను ఉద్దేశించే సచిన్ ఆ ట్వీట్ పెట్టారు. ∙∙ నిప్పు జ్వాల గాలి దిశను బట్టి వ్యాíపిస్తుంది. ఆగ్రహ జ్వాల ఎటువైపు అధాటున మళ్లుతుందో ఎవరూ ఊహించలేరు. సచిన్‌ను ‘క్రికెట్ దేవుడు’ అని ఆరాధించిన ఆయన అభిమానులు.. రైతులకు మద్దతు ఇస్తున్న విదేశీయుల్ని సచిన్ ‘హద్దుల్లో ఉండండి’ అని అర్థం వచ్చేలా హెచ్చరించినందుకు ఆయనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసన నేరుగా లేదు. పరోక్షంగా ఉంది. పరోక్షంగా ఉన్నప్పటికీ శక్తిమంతంగా ఉంది. రష్యన్ టెన్నిస్ దిగ్గజం మారియా షరపోవా ఆరేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా ‘సచిన్ ఎవరో నాకు తెలియదు’ అని అన్నందుకు ఆగ్రహోదగ్రులైన భారతీయులు, ముఖ్యంగా మలయాళీలు షరపోవా ఫేస్బుక్ వాల్‌పై కూర్చొని ఆనాడు ఆమెను అనరాని మాటలు అన్నారు. చాలావరకు అవి భారతీయ భాషల్లో ఉన్నాయి కనుకు షరపోవాకు అర్థమయ్యే అవకాశం లేదు. ఇంగ్లిష్‌లో ఉన్న కామెంట్స్నైనా ఆమె పట్టించుకున్న దాఖలాలు లేవు. కాని ఇప్పుడు అదే సచిన్ అభిమానులు.. అదే షరపోవా ఫేస్ బుక్ వాల్ మీదకు వెళ్లి ఆమెకు సారీ చెబుతున్నారు. ‘మన్నించు మారియా, నువ్వన్నది కరెక్టే. అతడు మీకు తెలిసి ఉండాల్సినంత మనిషి కాదు’ అని పోస్ట్‌ల మీద పోస్ట్‌లు పెడుతున్నారు. ఒకరైతే.. ‘మారియా, ఇండియా రండి. నా రెస్టారెంట్లో మీ కోసం ప్రత్యేకంగా షవర్మా, కుళిమంతీ (బిర్యానీ) చేయించి పెడతాను’ అని ఆమెను ఆహ్వానించారు. నాడు మారియాపై పడిన రాళ్లే, ఇప్పుడు పూలుగా మారుతున్నాయి. ‘డియర్ మారియా, వి ఆర్ సారీ. సచిన్‌కి సపోర్ట్ చేస్తూ ఆనాడు మీపై సైబర్ అటాక్ చేసినందుకు బాధపడుతున్నాం’ అని ఒకరు; ‘మారియా, ఆరోజు నాకు పరిణతి లోపించింది. సచిన్ తెలియదు అన్నందుకు నిన్ను నానా మాటలు అన్నాను. నన్ను క్షమించు’ అని ఇంకొకరు పోస్టు పెట్టారు. ఒక మహిళ అయితే.. ‘సారీ సిస్టర్, యువర్స్ ట్రూలీ’ అంటూ షరపోవాకు లైకుల మీద లైకులు కొట్టారు. ఈ ప్రేమ జ్వాల అంతకంతకూ పెరిగిపోయి, సచిన్ ఉండే ముంబై మీదుగా రైతులు పోరాడుతున్న ఢిల్లీ వరకు వ్యాపించేలా మారియాపై పూల వర్షం కురుస్తోంది. ఆ పూల వానను రైతుల పోరాటానికి ఆశీస్సులనే అనుకోవాలి. రిహాన్నా, గ్రెటా థన్‌బర్గ్ -
రాంగ్ ఆన్సర్స్ మాత్రమే చెప్పండి: సచిన్
లాక్డౌన్ మొదలైన నాటి నుంచి సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన అప్డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా ప్రతిరోజూ ఏదో ఒక కొత్త పోస్టుతో ఫ్యాన్స్‌కు చేరువగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఓ విభిన్నమైన ఫొటోను షేర్ చేశాడు. ఇందులో.. గాల్లో ఓ కారు తేలుతూ ఉండగా.. కింద ఉన్న మరో కారు వద్ద జనాలు గుమిగూడి ఉన్నారు. దీనికి.. ‘‘ఈ పిక్చర్లో ఏం జరుగుతుందో చెప్పగలరా? అనిల్ కుంబ్లే మీరేమనుకుంటున్నారు’’ అంటూ పజిల్ విసిరాడు. అంతేగాక తప్పు సమాధానాలు మాత్రమే స్వీకరిస్తానంటూ షరతు పెట్టాడు.(ప్రేయసి పోస్టుపై కేఎల్ రాహుల్ కామెంట్..) ఈ సరదా పోస్టుకు అంతే సరదాగా స్పందించిన అనిల్ కుంబ్లే.. ‘‘నాకు సరైన సమాధానం తెలుసు. కానీ నేను దీనిని ప్రయత్నించను. ఎందుకంటే వాళ్లు తప్పు సమాధానాలే కోరుకుంటున్నారు’’ అని బదులిచ్చాడు. దీంతో ఈ ఫొటోలాగే నీ గూగ్లీలు కూడా ఆన్సర్ చేయడం కష్టమంటూ సచిన్ చమత్కరించాడు. కాగా లెగ్‌స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే. అతడి ఇన్స్టాగ్రాం నిండా వైల్డ్‌లైఫ్ ఫొటోలు దర్శనమిస్తాయి. ఇక ‘వైడ్ యాంగిల్’ పేరిట రాసిన పుస్తకంలో కుంబ్లే ఎన్నో ఫొటోలతో పాటు ఫొటోగ్రఫీ టెక్నిక్స్‌ను కూడా పొందుపరిచాడు. ఈ సీనియర్ క్రికెటర్లో దాగున్న మరో పార్శ్వానికి ప్రతిబింబంగా నిలిచిన ఈ బుక్‌ను 2010లో షేన్ వార్న్ ఆవిష్కరించాడు. కాగా కుంబ్లే ప్రస్తుతం ఐపీఎల్ టీం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.(ధోని కెప్టెన్ అవుతాడని అప్పుడే ఊహించా) What do you think is happening in this pic, people? 🤔@anilkumble1074, any thoughts? Only wrong answers accepted! 😜😋#WorldPhotographyDay pic.twitter.com/mqkxSxyj0n — Sachin Tendulkar (@sachin_rt) August 19, 2020 -
ధోని కెప్టెన్ అవుతాడని అప్పుడే ఊహించా
ఢిల్లీ : భారత క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోనితో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్సీ కోసం ధోనీ పేరును తానే సూచించినట్లు సచిన్ చెప్పుకొచ్చాడు. పీటీఐతో జరిగిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. '2007లో దక్షిణాఫ్రికా వేదికగా మొదటిసారి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు నేను వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. ఎందుకంటే గాయాల ఉండడం వల్ల టోర్నీకి దూరంగా ఉండాలని భావించా. అయితే నాతో పాటు గంగూలీ, ద్రవిడ్‌లు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. అయితే టీ20 జట్టుకు ఎవరిని కెప్టెన్‌ను చేస్తే బాగుంటుందని బీసీసీఐ అడిగినప్పుడు.. నేను ఎంఎస్ ధోని పేరు సూచించా. అంతకు ముందు చాలా మ్యాచ్‌ల్లో ఫస్ట్‌స్లిప్‌లో నిల్చొని ధోనీ ఆటను, మైదానంలో అతను వ్యవహరించే తీరును దగ్గర్నుంచి పరిశీలించా. దీంతా పాటు స్లిప్స్‌లో నిలుచున్నప్పుడు ఫీల్డింగ్‌తో పాటు పలు అంశాలపై ధోనీతో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ సమయంలోనే ధోనికి మ్యాచ్‌ను పూర్తిగా చదివేస్తాడని.. భవిష్యత్తు కెప్టెన్ అతనేనని అప్పుడే ఊహించా. అందుకే బోర్డుకు ధోనీ పేరును సూచించా. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు అందరికి తెలిసిందే. ' అంటూ సచిన్ పేర్కొన్నాడు. శనివారం(ఆగస్టు 15) సాయంత్రం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఎంఎస్ ధోని సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపీఎల్ 13వ సీజన్లో కనిపించనున్నాడు. -
ఆ ఐదు నిర్ణయాలు.. ధోని ఏంటో చెప్తాయి
ముంబై : మహేంద్రసింగ్ ధోని.. ఎప్పటినుంచో తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు శనివారం(ఆగస్టు 15)తో తెరదించాడు. టెస్టుల నుంచి 2014లోనే తప్పుకున్న ధోని అప్పటి నుంచి వన్డే, టీ 20ల్లో కొనసాగుతున్నాడు. 2017లో కెప్టెన్ స్థానం నుంచి పక్కకు తప్పుకొన్న ధోని ఆటగాడిగా కొనసాగాడు. 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరిసారిగా కనిపించిన ధోని మళ్లీ జట్టులోకి రాలేదు. ఆలోగా కరోనా వైరస్ విజృంభణతో క్రికెట్ సిరీస్‌లు వాయిదా పడడం జరిగింది. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్లో ధోని రాణించి మళ్లీ టీమిండియా జట్టులో చూడాలని అతని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. కానీ ధోని తన అభిమానులందరిని షాక్‌కు గురిచేస్తూ ఆగస్టు 15 శనివారం.. 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.(మీకు సలాం, ట్రెండింగ్‌లో థాంక్యూ మహి!) అంతే.. ఇక ధోని మెన్ ఇన్ బ్లూలో కనిపించడనే విషయాన్ని అతని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అలా క్రికెటలో ధోని శకం నిరాడంబరంగా ముగిసింది.మరి అలాంటి ధోని.. కెప్టెన్సీ ప్రతిభకు ఉదాహరణగా నిలిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యర్థి జట్లపై వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో, ఎక్కడా సంయమనం కోల్పోకుండా మైదానంలో ప్రశాంతంగా జట్టును నడిపించడంలో అతనికి అతనే సాటి. ఈ నేపథ్యంలో అతను తీసుకున్న చాలా నిర్ణయాలు.. కెప్టెన్‌గా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాయి. వాటిలో ఒక ఐదింటిని ఇప్పుడు మనం ఒకసారి గుర్తుచేసుకుందాం. 2007 టీ20 వరల్డ్ కప్ : అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా 2007 మొదటి టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశ దాటితే గొప్ప అని అంతా భావించారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ ధోని నాయకత్వంలోని భారత యువజట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడింది. పాక్‌పై గెలిస్తే అభినందనలు.. ఓడితే చెప్పులు దండలు పడడం ఖాయం. ఒకవైపు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. దీంతో విజయం భారత బౌలర్లపై పడింది. పాక్ విజయానికి 13 పరుగులు కావాలి. మిస్మా-ఉల్-హక్ 37 పరుగులతో అప్పటికే క్రీజులో పాతుకుపోయాడు.. టీమిండియా బౌలర్లలో హర్భజన్, జోగిందర్ శర్మలకు ఒక్కో ఓవర్ మిగిలి ఉంది. ఇక్కడే ధోని కెప్టెన్‌గా తన తెలివిని ప్రదర్శించాడు. ఎందుకంటే అంతకుముందు భజ్జీ వేసిన 17వ ఓవర్లో మిస్బా మూడు సిక్స్‌లు కొట్టాడు. అందుకే సీనియర్ బౌలర్ హర్భజన్‌ను కాదని జోగిందర్ శర్మకు బంతిని ఇచ్చాడు. జోగి వేసిన మొదటి బంతి వైడ్‌గా వెళ్లింది.. రెండో బంతి డాట్ బాల్‌గా పడింది. ఒక మూడో బంతిని మిస్బా షార్ట్ ఫైన్‌లైగ్ మీదుగా బంతిని గాల్లోకి లేపాడు.. అక్కడున్నవారంతా అది సిక్స్ అని భావించారు. కానీ బంతి అనూహ్యంగా శ్రీశాంత్ చేతిలో పడింది. ఇంకేముంది... టీమిండియా ఖాతాలో మొదటి టీ20 ప్రపంచకప్ టైటిల్ పడింది. ఇదే కెప్టెన్‌గా ధోని మొదటి విజయానికి భీజం పడింది.(ధోని రిటైర్మెంట్పై భార్య సాక్షి భావోద్వేగ పోస్ట్) గంగూలీ, ద్రవిడ్‌ల తొలగింపు : టీమిండియాకు 2007 టీ20 ప్రపంచకప్‌ను సాధించిపెట్టిన ధోని కొద్ది రోజుల్లోనే వన్డే కెప్టెన్‌గానూ ఎంపికయ్యాడు. 2008లో ఆస్ట్రేలియా, శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్( కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్)కు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని అప్పటి బీసీసీఐ సెక్రటరీ నిరంజన్ షా దగ్గరకు వెళ్లి మన ఫీల్డింగ్‌లో సమూల మార్పులు అవసరం ఉందని , జట్టులో యువకులు ఉంటే బాగుంటుందని.. అప్పుడే ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగవుతాయని తెలిపాడు. దీంతో పరోక్షంగా దిగ్గజ క్రికెటర్లు గంగూలీ, ద్రవిడ్‌లు ఈ సిరీస్ నుంచి తప్పుకునేందుకు కారణమైన ధోనిని అప్పట్లో తప్పుబట్టారు. కానీ అనూహ్యంగా ధోని సేన తొలిసారి ఆసీస్ గడ్డపై ట్రై సిరీస్‌ను గెలిచింది. అంతేకాదు.. భారత ఫీల్డింగ్ ప్రమాణాలు కూడా బాగా మెరుగయ్యాయి. తాను అనుకున్న ఏ విషయమైన నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా చెప్పడం అతనికి అభిమానులను మరింత పెంచింది. 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్.. బ్యాటింగ్‌లో ప్రమోషన్ 2011 ప్రపంచకప్.. సొంతగడ్డపై జరగడం ఒక సానుకూలాంశం. ఈసారి కప్పు సాధించకపోతే.. మళ్లీ సాధించలేం అన్న రీతిలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన లంక 274 పరుగులు సాధించింది. బారీ బ్యాటింగ్ లైనఫ్ కలిగిన టీమిండియాకు ఈ టార్గెట్ పెద్ద కష్టం కాదనిపించింది. కానీ అనూహ్యంగా భీకరమైన ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్‌లు విఫలమవ్వడం.. కోహ్లి ఇలా వచ్చి అలా వెళ్లడం.. మలింగ భయంకరమైన బౌలింగ్‌తో బెంబెలెత్తించాడు. దీంతో యువరాజ్‌ను కాదని తానే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు ధోని. ఒక కెప్టెన్‌గా ధోని తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయం.. కానీ గంభీర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించడం.. యువరాజ్‌తో కలిసి ఆఖరు వరకు క్రీజులో నిలిచి 91 పరుగులు చేయడం.. విన్నింగ్ షాట్‌ను సిక్స్‌గా మలచడం చకచకా జరిగిపోయాయి. 28 ఏళ్ల తరువాత భారత అభిమానలు దాహం తీర్చిన ధోని కెరీర్లో ఈ నిర్ణయం కలికితురాయిలా నిలిచిపోతుంది. ఓపెనర్ల రొటేషన్ పాలసీ.. అప్పటివరకు టీమిండియా జట్టులో సచిన్, సెహ్వాగ్ రెగ్యులర్ ఓపెనర్లుగా కొనసాగుతుండేవారు. వీరి గైర్హాజరీలో మాత్రమే ఇతర ఆటగాళ్లు ఓపెనింగ్ స్థానంలో వచ్చేవారు. కానీ ధోని 2008లో సీబీ సిరీస్‌లో మాత్రం రొటేషన్ పద్దతిని అమలు పరిచాడు. సచిన్, సెహ్వాగ్, గంబీర్‌లతో కలిసి రొటేషన్ పద్దతిని పరిచయం చేశాడు. అయితే ఇది అంతగా సక్సెస్ కాకపోయినా టీమిండియా జట్టుకు రొటేషన్ ఓపెనింగ్ అనే ఒక కొత్త పద్దతిని అలవాడు చేశాడు. రోహిత్‌శర్మను ఓపెనర్‌గా ప్రమోషన్ 2013 సంవత్సరం వచ్చేసరికి ధోని విజయవంతమైన కెప్టెన్‌గా పేరు సంపాదించాడు. ఐసీసీ టీ20, వన్డే వరల్డ్‌కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోపిని గెలిచిన ఒకే ఒక్క కెప్టెన్‌గా నిలిచాడు. అప్పటివరకు మిడిల్ ఆర్డర్లో కొనసాగుతున్న రోహిత్ శర్మను ఓపెనర్‌గా పరిచయం చేసింది ఈ ఏడాదే. 2007లోనే జట్టులోకి వచ్చిన రోహిత్ ఆరు సంవత్సరాలైన అడపా దడపా మెరిసాడే తప్ప రెగ్యులర్‌గా చోటు దక్కేది కాదు. రోహిత్లో అపారమైన ప్రతిభ ఉందని కనిపెట్టిన ధోని.. 2011లో తొలిసారి దక్షిణాఫ్రికా టూర్లో ఓపెనర్‌గా ఆడించాడు. కానీ మూడు ఇన్నింగ్స్‌లు కలిపి 29 పరుగులే చేసి రోహిత్ విఫలమయ్యాడు. రోహిత్ మీద ఉన్న నమ్మకంతో 2013 జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో మళ్లీ ఓపెనర్‌గా అవకాశం ఇచ్చాడు. ఈసారి రోహిత్ .. 83 పరుగులు చేసి తన సత్తా నిరూపించాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు రోహిత్ మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.(మహేంద్రుడి మాయాజాలం) -
సచిన్ బ్యాటింగ్‌పై కపిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సచిన్ టెండూల్కర్ తన కెరీర్లో ఎక్కువ డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధించాల్సిందని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల మహిళ క్రికెట్ జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. పరుగులకు సంబంధించి సచిన్ ఖాతాలో అనేక అంతర్జాతీయ రికార్డులు ఉన్నాయని, అయితే టెస్టు క్రికెట్ విషయానికొస్తే డబుల్ సెంచరీల రికార్డులో సచిన్ టాప్ పదిలో కనిపించడని అన్నారు. మార్వన్ అటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, జావేద్ మియాందాద్, యూనిస్ ఖాన్, రికీ పాంటింగ్ లాగే సచిన్ కూడా టెస్ట్ క్రికెట్లో ఆరు డబుల్ సెంచరీలు కలిగి ఉన్నాడని పేర్కొన్నారు. కాని డబుల్ సెంచరీల రికార్డులో సచిన్ 12వ స్థానంలో ఉన్నాడన్నారు. ఎందుకంటే 200 టెస్టు మ్యాచుల్లో సచిన్ కేవలం ఆరు డబుల్ సెంచరీలు చేశాడని ఆయన పేర్కొన్నారు. (షెడ్యూల్ ఖరారు చేసేందుకు...) కపిల్ దేవ్ మాట్లాడుతూ.. “సచిన్ చాలా ప్రతిభావంతుడు. క్రికెట్ చరిత్రలో అలాంటి వ్యక్తిని చూడలేదు. సెంచరీలు ఎలా చేయాలో అతనికి తెలుసు, కానీ వాటిని డబుల్, ట్రిపుల్ సెంచరీలుగా ఎలా మలచాలో తెలియదు. సెంచరీ చేసిన తరువాత అతను సింగిల్స్ తీసుకునేవాడు.. ఎక్కువ స్పీడ్‌గా ఆడేవాడు కాదు. అతను ఎప్పుడూ క్రూరమైన బ్యాట్స్‌మన్ కాలేడు. సచిన్ కనీసం అయిదు ట్రిపుల్ సెంచరీలు, పది డబుల్ సెంచరీలు చేయాల్సి ఉండేది. ఎందుకంటే అతను ప్రతి ఓవర్లో బౌండరీ బాదేవాడు. టెస్ట్ క్రికెట్లో 51 సెంచరీలు సాధించిన సచిన్‌కు తన మొదటి డబుల్ సెంచరీ సాధించడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇది 1999లో న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో సాధ్యమైంది. వాస్తవానికి, టెండూల్కర్ 51 సెంచరీలలో కేవలం 20 మాత్రమే 150 కి పైగా స్కోర్లుగా నిలిచాయి. అయితే, 2010లో దక్షిణాఫ్రికాపై వన్డే డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మెన్ సచిన్’ అని పేర్కొన్నారు. సచిన్ తన కెరీర్లో 200 టెస్ట్ మ్యాచ్‌ల్లో 54.04 సగటుతో 15,921 పరుగులు, 463 వన్డేల్లో 44.83 సగటుతో18,426 పరుగులు చేశాడు. 2013 లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు (కపిల్ సలహాతోనే కోచ్‌నయ్యా) (ట్రిపుల్ సెంచరీ కంటే.. 136 పరుగులే మిన్న!) -
ప్లాస్మాను దానం చేయండి : సచిన్ టెండూల్కర్
ముంబై : కరోనా రోగులకు అందించే చికిత్సలో భాగంగా బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ఏర్పాటు చేసిన ప్లాస్మా థెరపీ యూనిట్‌ను సచిన్ టెండూల్కర్ బుధవారం ప్రారంభించారు. సబర్బన్ అంధేరిలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో దీన్ని అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారు ప్లాస్మాను చేసి ఇతరుల ప్రాణాలను రక్షించాలని కోరారు. కరోనా కట్టడిలో ముందుండి నడిపిస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని..అయినప్పటికీ అవిశ్రామంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. (ఒక్కరోజులో రికార్డు కేసులు ) ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతం కరోనా చికిత్సలో అవంలంభిస్తున్న ప్లాస్మా థెరపీ ద్వారా ఎంతో మంది ఈ వైరస్ నుంచి బయటపడ్డారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో యంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారు ప్లాస్మాను దానం చేస్తే ఇతరుల ప్రాణాలను రక్షించిన వాళ్లవుతారు. దాతలు ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అని సచిన్ పేర్కొన్నారు. ప్లాస్మా యూనిట్‌ను ప్రారంభించిన బిఎంసిను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. (కరోనా : దేశంలో సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదు) -
'తండ్రిగా నా కోరికలు నెరవేర్చుకుంటున్నా'
ముంబై : టీమిండియా దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌లో ఎంత నైపుణ్యతను ప్రదర్శించాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన బ్యాటింగ్ పవర్‌తోనే క్రికెట్ ప్రపంచంలో లెక్కలేనన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్న సచిన్ హెయిర్‌కట్ చేయడంలోనూ అంతే నైపుణ్యతను చూపిస్తున్నాడు. తాజాగా తన కొడుకు అర్జున్ టెండూల్కర్‌కు హెయిర్‌కట్ చేసిన వీడియోనూ ఇప్పుడు తెగ వైరల్‌గా మారింది. కొన్ని రోజుల క్రితం ఎవరి సహాయం లేకుండానే తనే సొంతంగా హెయిర్‌కట్ చేసుకున్న సచిన్ తాజాగా అర్జున్‌కు హెయిర్ ట్రిమ్ చేశాడు. సచిన్‌కు అతని కూతురు సారా టెండూల్కర్ అసిస్టెంట్‌గా వ్యవహరించడం ఇందులో మరో విశేషం.('కష్టపడి సంపాదించాలి.. డిమాండ్ చేయొద్దు') 'క్రికెటర్‌గా దేశం తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడి గెలిపించాను. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత తండ్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్నా. ఒక తండ్రిగా నా కోరికలు నెరవేర్చుకుంటున్నా.. పిల్లలతో కలిసి ఆడుకోవడం, తినడం, కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడం లాంటివి చేస్తున్నా. తాజాగా నా కొడుకు అర్జున్‌కు హెయిర్‌కట్ చేయడం కూడా అందులో బాగమే. క్రికెట్ తర్వాత నేను బాగా సక్సెస్ అయింది హెయిర్‌కట్‌లో అని చెప్పాలి. అందులోనూ హెయిర్‌కట్ చేసిన తర్వాత వాడు( అర్జున్) చాలా అందంగా ఉన్నాడు. నాకు అసిస్టెంట్‌గా పని చేసినందుకు థ్యాంక్యూ ! సారా ' అంటూ క్యాప్షన్‌లో పేర్కొన్నాడు. ('సెంచరీ కంటే భార్య చేసే హెయిర్‌కట్ కష్టంగా ఉంది') లాక్డౌన్ 4వ దశలో దేశంలోని సెలూన్ షాపులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చినా చాలా వరకు తెరుచుకోలేదనే చెప్పాలి. దీంతో యూట్యూబ్‌ను ఫాలో అవుతూ చాలా మంది తమ స్నేహితులు, ఇంట్లో వారితోనే హెయిర్ కట్ చేయించుకుంటున్నారు. ఇందులో సెలబ్రిటీలు కూడా చాలా మందే ఉన్నారు. లాక్డౌన్ మొదటి దశలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో హెయిర్ ట్రిమ్ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా సోమవారం టీమిండియా టెస్టు క్రికెటర్ చటేశ్వర్ పుజార తన భార్య పూజాతో హెయిర్ కట్ చేసుకుంటున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. -
ఒక్క చాన్స్ ఇవ్వండి.. నేనేంటో నిరూపిస్తా
మార్చి 27, 1994... ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో రెండో వన్డేకు భారత్ సన్నద్ధమైంది. అయితే ఆ రోజు ఉదయమే మెడ పట్టేయడంతో ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మ్యాచ్ ఆడటం తన వల్ల కాదన్నాడు. భారత జట్టు ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్న సమయంలో కెప్టెన్ అజహరుద్దీన్, కోచ్ అజిత్ వాడేకర్ వద్దకు సచిన్ టెండూల్కర్ వెళ్లాడు. అప్పటి వరకు మిడిలార్డర్లో ఆడుతున్న తనకు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వమని కోరాడు. వారు సందేహిస్తున్న తరుణంలో ‘ఒక్క చాన్స్’ అంటూ బతిమాలాడు. విఫలమైతే మళ్లీ అడగనని కూడా చెప్పేశాడు. అయితే ఆ తర్వాత అలాంటి అవసరమే రాలేదు. ఓపెనర్ హోదాలో తన తొలి వన్డేలో ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌తో సచిన్ భారత క్రికెట్లో కొత్త శకానికి తెర తీశాడు. ఓపెనర్‌గా సచిన్ బరిలోకి దిగిన మ్యాచ్ అతని వన్డే కెరీర్లో 70వది. అప్పటి వరకు ఆడిన 69 వన్డేల్లో సచిన్ ఒక్క శతకం కూడా నమోదు చేయలేదు. 13 అర్ధ సెంచరీలు మాత్రం అతని ఖాతాలో ఉన్నాయి. అయితే తన ఆటపై తనకున్న నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో అతను వేసిన ముందడుగు పలు ఘనతలకు నాంది పలికింది. దీనిపై అజహర్... ‘సచిన్‌లో ఉన్న ప్రతిభ గురించి ఆ సమయానికే అందరికీ తెలుసు కాబట్టి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ అతను తన పూర్తి సత్తాను ప్రదర్శించేందుకు సరైన అవకాశం కోసం ఎదురు చూశాడు. అదే ఇలా వచ్చింది’ అని చెప్పాడు. మెరుపు బ్యాటింగ్ సాగిందిలా... టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. అయితే భారత బౌలింగ్ ధాటికి జట్టు 142 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యమే అయినా తనేంటో చూపించాలనే పట్టుదలతో ఉన్న సచిన్ తొలి బంతినుంచే విరుచుకుపడ్డాడు. 49 బంతుల్లోనే 82 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు. ఇందులో 15 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఏకంగా 167.34 స్ట్రయిక్‌రేట్‌తో అతను ఈ పరుగులు చేయడం విశేషం. బౌండరీల ద్వారానే 72 పరుగులు వచ్చాయి. టి20ల జోరు సాగుతున్న ఈ కాలంలో ఇది సాధారణంగా అనిపించవచ్చు కానీ 26 ఏళ్ల క్రితం ఇలాంటి బ్యాటింగ్ అంటే అత్యంత అద్భుత ప్రదర్శనగా భావించాలి. సచిన్ కొట్టిన కొన్ని చూడచక్కటి షాట్లతో ఈడెన్ పార్క్ అదిరిపోగా, భారత అభిమానుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. అప్పటివరకు అజహర్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ (62 బంతుల్లో) రికార్డు సునాయాసంగా బద్దలైపోతుందేమో అనిపించింది. మరో 12 బంతుల్లో 18 పరుగులు చేయడం కష్టంగా ఏమీ అనిపించలేదు. అయితే లెఫ్టార్మ్ స్పిన్నర్ మాథ్యూ హార్డ్ వేసిన బంతిని ఆడే క్రమంలో ఎడ్జ్ తీసుకోవడంతో అతనికే రిటర్న్ క్యాచ్ వెళ్లింది. అలా సచిన్ సూపర్ ఓపెనింగ్ ముగిసింది. సచిన్ ధాటికి 23.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి భారత్ సునాయాసంగా విజయాన్ని అందుకుంది. మలుపు తిరిగిన కెరీర్... ఈ మ్యాచ్ తర్వాత సిద్ధూ మూడో స్థానానికి మారిపోగా, వరుసగా తర్వాతి నాలుగు ఇన్నింగ్స్‌లలో ఓపెనర్‌గా సచిన్ 63, 40, 63, 73 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. ఆ తర్వాత కొద్దిరోజులకే తన 79వ వన్డేలో సచిన్ తొలి సెంచరీని (ఆస్ట్రేలియాపై) నమోదు చేశాడు. తన 463 వన్డేల కెరీర్లో 340 మ్యాచ్‌లలో సచిన్ ఓపెనర్‌గానే ఆడాడు. తన 49 వన్డే సెంచరీలలో 45 ఓపెనర్‌గానే వచ్చాయి. ఓపెనర్‌గా మారిన తర్వాత కూడా జట్టు అవసరాలరీత్యా కొన్నిసార్లు అతను మళ్లీ మిడిలార్డర్లో ఆడాల్సి వచ్చింది. అలా నాలుగో స్థానంలో ఆడి అతను మిగిలిన 4 సెంచరీలు సాధించాడు. ఆ సమయంలో బౌలర్లపై ఎదురుదాడి చేయగల సామర్థ్యం నాకుందని, తొలి 15 ఓవర్లలో ఉన్న ఫీల్డింగ్ పరిమితులను దృష్టిలో ఉంచుకొని చూస్తే ఫీల్డర్ల పైనుంచి షాట్లు ఆడగల సత్తా ఉందని నమ్మాను. నాకు ఒక అవకాశం లభిస్తే చాలనుకునేవాడిని. అందుకే ఓపెనింగ్ చేయడం గురించి ఆలోచించాను. ఆ తర్వాత కివీస్ స్వల్ప స్కోరే చేసినా మన జట్టుకు ఘనమైన ఆరంభం ఇవ్వడం కీలకమని భావించా. కెప్టెన్, కోచ్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయవద్దనుకున్నా. ప్రశాంత మనసులో పూర్తి ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడాను. అన్నీ కలిసి రావడంతో అలవోకగా పరుగులు వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వైఫల్యం గురించి భయపడకపోవడమే నాకు విజయాన్ని అందించింది. –సచిన్ వన్డేల్లో ఓపెనర్‌గా తొలి ఇన్నింగ్స్ ఆడుతూ... బంగ్లాదేశ్‌తో 2012 మార్చి 16న ఢాకాలో జరిగిన వన్డేలో కెరీర్లో 100వ సెంచరీ పూర్తి చేసుకున్న క్షణాన.... – సాక్షి క్రీడా విభాగం -
'మెక్‌గ్రాత్ గుర్తుంచుకో.. నేనింకా క్రీజులోనే ఉన్నా'
ముంబై : క్రికెట్లో బ్యాట్స్‌మెన్‌కు, బౌలర్‌కు మధ్య జరిగే సన్నివేశాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి. తన బౌలింగ్‌లో పరుగులు తీయడానికి ఇబ్బంది పడే బ్యాట్స్‌మెన్‌ను చూస్తూ గేలి చేయడం బౌలర్ నైజమైతే.. అదే బౌలర్ మళ్లీ బౌలింగ్‌ను వచ్చినప్పుడు బౌండరీలు బాది బ్యాట్స్మన్లు ధీటుగా బదులిస్తారు. అలాంటి ఘటనలు క్రికెట్లో చాలానే చూశాం. టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆసీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌లు ఈ కోవకే చెందినవారే. వీరిద్దరు పరస్పరం తలపడినప్పుడు వారి అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ('రసెల్‌తో ఆడితే హైలెట్స్ చూస్తున్నట్లే అనిపిస్తుంది') 90 వ దశకం నుంచి 2003 సంవత్సరం వరకు తీసుకుంటే వీరిద్దరు ఎదురుపడినప్పుల్లా మ్యాచ్ సంగతి పక్కన పెట్టి అభిమానులు వీరిపై దృష్టి సారించేవారు. 1999 టెస్టు సిరీస్, కెన్యాలో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ, 2003 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లనే ఉదాహరణగా చెప్పొచ్చు. తాజాగా సచిన్ టెండూల్కర్ మెక్‌గ్రాత్‌తో జరిగిన ఒక సంఘటనను ఒక వీడియో చాట్‌లో పేర్కొన్నాడు. ఈ వీడియోనూ బీసీసీఐ తమ అధికార ట్విటర్లో షేర్ చేసింది. 1999లో భారత జట్టు ఆసీసీలో పర్యటించింది. అడిలైడ్ టెస్టు సందర్భంగా గ్లెన్ మెక్‌గ్రాత్ తనను ఎంతగా విసుగు తెప్పించాడనేది సచిన్ గుర్తు చేశాడు. ' 1999.. అడిలైడ్‌లో మొదటి టెస్టు మ్యాచ్ ఆడుతున్నాము. ఇంకా 40 నిమిషాల పాటు ఆడితే మొదటి రోజు ఆట ముగుస్తుంది. అప్పటికే నాకు మెక్‌గ్రాత్ ఐదు ఓవర్లు మెయిడిన్ వేసి చికాకు తెప్పించాడు. వాళ్లు (ఆసీస్ ఆటగాళ్లు) నాకు విసుగు తెప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు 70 శాతం బంతులను గిల్‌క్రిస్ట్ చేతుల్లో పడాలని, 10 శాతం బంతులను మాత్రమే సచిన్ బ్యాట్‌కు తగిలేలా వేయాలని మెక్‌గ్రాత్‌కు వివరించారు. మెక్‌గ్రాత్ అదే విధంగా బౌలింగ్ చేస్తుంటే చాలా బంతుల్ని వదిలేశాను. అయితే మంచి బంతులను మాత్రం నా స్టైల్లో ఆడాను. ఆట ముగిసిన తర్వాత మెక్‌గ్రాత్‌ను ఉద్దేశించి.. బాగానే బౌలింగ్ చేశావు.. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్లి మళ్లీ బౌలింగ్ చేయ్.. ఎందుకంటే నేనింకా క్రీజులోనే ఉన్నా అంటూ కౌంటర్ ఇచ్చా. తర్వాతి రోజు బ్యాటింగ్ దిగినప్పుడు మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో కొన్ని బౌండరీలు సాధించినా కొన్ని బంతులు మాత్రం బాగానే ఇబ్బంది పెట్టాయి. ఎందుకంటే తర్వాతి రోజు ఇద్దరం సమానస్థాయిలో ఉన్నాం. కానీ వాళ్లు మాత్రం నన్ను విసిగించే పనినే టార్గెట్‌గా పెట్టుకున్నారంటూ ' సచిన్ చెప్పుకొచ్చాడు. Must Watch - From his daily routine to his on-field rivalries to the famous Desert Storm innings - @sachin_rt tells it all in this Lockdown Diary. Full video 📽️ https://t.co/y7cIVLxwAU #TeamIndia — BCCI (@BCCI) April 28, 2020 -
ప్రతిష్టాత్మక అవార్డుల రేసులో 2011 ప్రపంచకప్ ఫైనల్
లండన్: ఏప్రిల్ 2, 2011... భారత క్రికెట్ అభిమాని ఎన్నటికీ మరచిపోలేని తేదీ. 28 ఏళ్ల తర్వాత మన టీమ్ మళ్లీ వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ముఖ్యంగా సీనియర్ సభ్యుడు సచిన్ టెండూల్కర్‌కు అది మరింత ప్రత్యేకం. అంతకుముందు సచిన్ ఆడిన ఐదు ప్రపంచకప్‌లు నిరాశను మిగిల్చగా... ఆరో ప్రయత్నంలో అతను విశ్వ విజేతగా నిలిచిన జట్టులో భాగమయ్యాడు. నాడు జట్టు సహచరులు అతడిని తమ భుజాలపై మోసి వాంఖడే మైదానంలో ఊరేగించారు. ఇప్పుడు అదే క్షణం ప్రతిష్టాత్మక లారెస్ స్పోర్ట్స్ అవార్డుల రేసులో నిలిచింది. 2000 నుంచి 2020 మధ్య క్రీడల్లో అత్యుత్తమంగా నిలిచిన 20 ఘటనలను నిర్వాహకులు నామినేట్ చేశారు. టీమిండియా గెలిచిన క్షణాన్ని మొత్తం దేశాభిమానుల ఆనందం కోణంలో లారెస్ ‘క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎ నేషన్’ అని టైటిల్ పెట్టింది. విజేతను తేల్చేందుకు పబ్లిక్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 17న బెర్లిన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో లారెస్ స్పోర్ట్స్ అవార్డులను ప్రకటిస్తారు. -
సచిన్‌కు భద్రతను కుదించిన ప్రభుత్వం
సాక్షి, ముంబై : క్రికెట్ దేవుడు, భారతరత్న సచిన్ టెండూల్కర్‌కు ఉన్న ఎక్స్ కేటగిరీ భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం కుదించింది. అంటే ఇప్పటి నుంచి సచిన్‌కు 24 గంటల సెక్యూరిటీ ఉండదు. కానీ ఎస్కార్ట్ సదుపాయం ఉంటుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కుమారుడు, ఎమ్మెల్యే ఆదిత్య థాక్రేకు మాత్రం భద్రతను పెంచారు. ఆదిత్యకు ఇప్పుడున్న వై ప్లస్ సెక్యూరిటీ నుంచి జెడ్ ప్లస్‌కు పెంచారు. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఆయా వ్యక్తులకున్న ముప్పును పరినణనలోకి తీసుకొన్న తర్వాత ఈ విషయంపై ఏర్పాటైన కమిటీ బుధవారం సమావేశమై ఈ నిర్ణయాలను తీసుకొంది. బీజేపీ నేత ఏక్నాథ్ ఖడ్సేకు ఉన్న వై సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. ఇకపై ఆయనకు ఎలాంటి భద్రత ఉండదు. మరో బీజేపీ నేత, ఉత్తర ప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్‌కు జెడ్ ప్లస్ నుంచి ఎక్స్ కేటగిరీకి మార్చారు. కాగా మహారాష్ట్రలో 97 మందికి ఇలాంటి భద్రతా సదుపాయాలు ఉండగా, 29 మందికి భద్రతా కేటగిరీలో మార్పులు చేశారు. -
మాజీ భార్యతో కలిసి స్టార్ హీరో సందడి
ముంబై : నగరంలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం జరిగిన యూ2 ముంబై కన్సర్ట్ బాలీవుడ్ తారాగణంతో నిండిపోయింది. ఐరిష్ రాక్ బ్యాండ్ ‘ది జోషువా ట్రీ టూర్’లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ వారి ఇద్దరి పిల్లలతో కలిసి సందడి చేశారు. విడాకులు తీసుకున్న తర్వాత హృతిక్, సుసానే ఫ్రెండ్స్‌గా కొనసాగుతుండటం విశేషం. ఐరిష్ రాక్ బ్యాండ్ పాటగాళ్లతో దిగ్గజ మ్యూజీషియన్ ఏఆర్ రెహమాన్ వేదికను పంచుకున్నారు. తన కూతుళ్లు ఖతీజా, రహీమాతో కలిసి ‘అహింస’ పాట పాడి ఆహూతులను అలరించారు. ఇక ఈ కార్యక్రమంలో భార్య అంజలితో కలిసి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొన్నారు. దీపిక-రణ్వీర్ జోడి సరికొత్త దుస్తుల్లో కార్యక్రమానికి హాజరయ్యారు. బైకర్ షార్ట్స్‌లో దీపిక.. బ్లాక్ టీషర్ట్, రెడ్ ప్యాంట్లో కన్సర్ట్కు వచ్చిన రణ్వీర్ జంట చేతులో చేయి వేసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. కునాల్ కపూర్, అతని భార్య నైనా బచ్చన్ (అభిషేక్ బచ్చన్ కజిన్), మీరా రాజ్‌పుత్, డయానా పెంటీ, అలియాభట్ చెల్లెలు షహీన్ భట్ యూ2 ముంబైలో పాల్గొన్నారు. View this post on Instagram Ahimsa 🎥@u2 #u2 #u2india #ahimsa #thejoshuatreetour2019 A post shared by U2ULTRAVIOLETBRASIL (@ultravioletu2) on Dec 15, 2019 at 8:56am PST