
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌పై బీసీసీఐ తమ అభిమానాన్ని చాటుకుంది. ఆగస్ట్14,1990 నాటి మైమరిపించే ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తు ట్వీట్ చేసింది. ఓల్డ్ ట్రఫోర్డ్ వేదికగా భారత-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సచిన్ ఏకంగా 119 పరుగులు సాధించి ఓటమి ముప్పు నుంచి తప్పించాడు. ఈ మ్యాచ్‌తోనే సచిన్‌కు మాస్టర్ బ్లాస్టర్ బిరుదు దక్కింది. ఈ ట్వీట్‌తో సచిన్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సచిన క్రికెట్ ప్రయాణంలో ఈ మ్యాచ్ ఎంతో కీలకమైనది. తొలి టెస్ట్ సెంచరీ నుంచి 100 సెంచరీల వరకు ఎన్నో రికార్డులను సచిన్ అధిగమించిన వైనం స్పూర్తిదాయకం. టెస్ట్ క్రికెట్‌లో 15,921రన్స్‌తో, వన్డే క్రికెట్‌లో 18,426 రన్స్‌తో సచిన్ చరిత్ర సృష్టించాడు.
సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాక రంజీలలో కూడా అలరించాడు. రంజీలలో 15 సంవత్సరాలకే ముంబై తరుపున ప్రాతినిద్యం వహించాడు. గుజరాత్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి తానేంటో నిరూపించుకున్నాడు. ఎన్ని విజయాలు సాధించిన ప్రపంచకప్ సాకార కల 37 ఏళ్ల వయస్సులో నెరవేరింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్లతో గెలిచి సచిన్ వరల్డ్‌కప్ కలను సాకారం చేసింది. సచిన్ రిటైర్మెంట్ తరువాత పలు ప్రతిష్టాత్మక టోర్నమెంట్లకు తన సేవలను అందిస్తున్నాడు. వీటిలో 2015 ఐసీసీ పురుషుల ప్రపంచకప్, 2017 ఐసీసీ మహిళల ప్రపంచకప్ ముఖ్యమైనవి. ప్రస్తుతం సచిన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా తన సేవలను అందిస్తున్నాడు.