సాక్షి, న్యూఢిల్లీ : సచిన్ టెండూల్కర్ ప్రసంగంపై ఆసక్తినెలకొన్న వేళ రాజ్యసభలో రగడ నెలకొనటంతో సభ వాయిదా పడింది. మైక్ అందుకున్న సచిన్ ఓవైపు ప్రసంగం కొనసాగిస్తుంటే.. కాంగ్రెస్ ఎంపీలంతా నినాదాలతో సభను మారు మ్రోగించారు.
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మన్మోహన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలియజేయాలని వారంతా డిమాండ్ చేశారు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా, విద్యార్థుల ప్రధానమైన సమస్యపైనే సచిన్ రాజ్యసభలో సుదీర్ఘంగా ప్రసగించాల్సి ఉంది. ఇక సచిన్ ప్రసంగం అడ్డుకోవటంపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రపంచవేదికగా సచిన్ ఎంతో పేరు సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి సభలో మాట్లాడుతుంటే అడ్డుకోవటం సిగ్గు చేటు. పైగా ఆయన ప్రసంగించబోయే అంశం ఎంత కీలకమైందో ప్రతీ ఒక్కరికీ తెలుసు. సభ ఉంది కేవలం రాజకీయ నేతలు మాట్లాడేందుకే కాదు కదా.. అని ఎంపీ జయాబచ్చన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment