వన్డేకు వయ్యారి భామల హంగులు ,రికార్డుల పరంపర సృష్టించిన విరాట్
విశాఖ స్పోర్ట్స్: విశాఖక్రీడాభిమానులు విరాట్ విశ్వరూపాన్ని మరోసారి ప్రత్యక్షంగా వీక్షించారు. ఈసారి విరాట్ కొహ్లి ఐదంకెల స్కోర్‌కు చేరుకోవడాన్ని విశాఖ అభిమానులు ఆస్వాదించారు. సచిన్‌కంటే 54 ఇన్నింగ్స్ ముందే ఈ రికార్డును సొంతం చేసుకుంటే...సచిన్ కంటే రెండేళ్ల పన్నెండు రోజుల ముందే ఈరికార్డును కోహ్లీ నమోదు చేశాడు. పరుగుల దాహంతో దూసుకుపోతున్న విరాట్ విశాఖలో మరో సెంచరీని కొట్టేశాడు. విశాఖ వేదికగా హాట్రిక్ సెంచరీల రికార్డును ఒక్క పరుగుతో తేడాతో వీక్షించలేక పోయిన విశాఖ క్రీడాభిమానుల నిరాశను విరాట్ బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈవిధంగా తీర్చాడు. అదీ విశాఖలో అత్యధిక పరుగుల రికార్డు చేసిన ధోని పాహచర్యంలో క్రీజ్‌లో ఉండగానే ఇలా జరగడంతో అభిమానుల ఉత్సాహానికి ఆదుపులేకపోయింది. ప్రేక్షకలోకం అంతా ఒక్కసారి లేచి నించుని ఇరువురు ఆటగాళ్ళకు స్టాడింగ్ ఓవెషన్ ఇచ్చింది. విరాట్ కొహ్లి 13ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 129 బంతుల్లోనే 157 పరుగులతో అజేయంగా నిలిచాడు.
రోహిత్ నిరాశ
ఈ మ్యాచ్‌లో మరో సిక్స్ బాదేస్తే రికార్డు నమోదయ్యే అవకాశం ఉన్న ఓపెనర్ రోహిత్ ఇలా వచ్చి అలా నాలుగు పరుగులు చేసేసి వెళ్ఙిపోవడం విశాఖ అభిమానుల్ని నిరాశపరిచింది. అలాగే రోహిత్– శిఖర్ ధావన్ జోడీ మరో 29 పరుగుల భాగస్వామ్యాన్ని చేస్తే సచిన్–సెహ్వాగ్‌ల సక్సెస్ పెయిర్‌ను అధిగమించి ఉండేవారు. కానీ వీరి జోడీ కేవలం 15 పరుగుల వద్దే వికెట్ కోల్పోయింది.
శభాష్ కోహ్లీ
భారత్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచి విశాఖలో అత్యధిక సెంచరీలు సాధించడమేగాకపదివేల పరుగుల మైలురాయిదాటిన స్టార్ బ్యాట్స్‌మన్ కోహ్లీకి ప్రశంసాఫలకం అందిస్తున్న దృశ్యం.
ద్వితీయార్థం మందగిస్తుందని..
టాస్ గెలిచిన విరాట్ కొహ్లి బ్యాటింగ్ చేయడానికే ఆసక్తి చూపాడు. విశాఖ పిచ్‌పై భారత్ ఏడు సార్లు ఆడితే ఐదుసార్లు చేజింగ్‌నే ఎంచుకుంది. కాని ఈసారి బ్యాటింగ్ ఎంచుకుంది. ‘వికెట్ మీద పచ్చిక లేకపోవడంతో ఇది హార్డ్ వికెట్‌గా మారింది. సెకండ్ హాఫ్‌లో పరుగులు రాబట్టడం కష్టమవుతుంది. పెద్ద స్కోర్ చేస్తే కొంత పని సులువవుతుంది. అందుకే ఖలీల్ స్థానంలో బ్యాటింగ్ చేయగల కుల్దీప్‌ను తీసుకున్నాను. స్పిన్‌కు అనుకూలించనున్న ఈ పిచ్‌పై మిడిలార్దర్‌లో కట్టడి చేసేందుకు ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లును తీసుకున్నాను.’ అని మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీ వ్యాఖ్యానించాడు.
⇔ భారత్‌లో అతివేగంగా 4000పరుగులు చేసినరికార్డు
⇔ ఫాస్టెస్ట్10000పరుగుల రికార్డు
⇔ వెస్టిండీస్‌పైఅత్యధిక సెంచరీలుచేసిన రికార్డు
⇔ ఒకే ఏడాదిలోఅతి తక్కువ ఇన్నింగ్స్‌లో1000పరుగులు
⇔ 10000పరుగులకుఅత్యధిక సరాసరి(ధోనీని దాటిన రికార్డు)
⇔ వెస్టిండీస్‌పై అత్యధికపరుగులు చేసినభారతీయ ఆటగాడు(సచిన్‌ను దాటిన రికార్డు)
⇔ 4000పరుగులకుభారత్‌లోఅత్యుత్తమ సగటు
Comments
Please login to add a commentAdd a comment