నేను మూడేళ్లు ఇక్కడే ఆడాను.. అతడొక అద్భుతం! ఏ బౌలర్‌ కైనా చుక్కలే: రోహిత్‌ | Rohit Sharma impressed with Arjun Tendulkars clarity of thought | Sakshi
Sakshi News home page

నేను మూడేళ్లు ఇక్కడే ఆడాను.. అతడొక అద్భుతం! ఏ బౌలర్‌ కైనా చుక్కలే: రోహిత్‌

Published Wed, Apr 19 2023 10:55 AM | Last Updated on Wed, Apr 19 2023 11:14 AM

Rohit Sharma impressed with Arjun Tendulkars clarity of thought - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో ముంబై ఇండియన్స్‌ వరుసగా మూడో విజయం సాధించింది. ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షో అదరగొట్టిన ముంబై.. 14 పరుగుల తేడాతో గెలుపొం‍దింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ముంబై ఇండియన్స్‌ చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. 

హైదరాబాద్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తిరిగి ఇక్కడ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది అని రోహిత్‌ తెలిపాడు. కాగా ఐపీఎల్‌లో డెక్కన్ చార్జర్స్‌ జట్టుకు మాడేళ్ల పాటు రోహిత్‌ ప్రాతినిధ్యం వహించాడు. 2009 ఐపీఎల్‌ సీజన్‌లో ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ సారథ్యంలోని దక్కన్‌ ఛార్జర్స్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆ జట్టులో రోహిత్‌ శర్మ కూడా భాగంగా ఉన్నాడు.

                                  

అతడొక అద్భుతం.. 
నాకు హైదరాబాద్‌లో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నేను మూడేళ్ల పాటు ఇదే స్టేడియంలో ఆడాను. ఐపీఎల్‌ ట్రోఫీని గెలిచిన డెక్కన్ చార్జర్స్‌ జట్టులో కూడా నేను ఉన్నాను. మళ్లీ ఇక్కడ ఆడడం చాలా సంతోషంగా ఉంది. ఇక​ ఈ మ్యాచ్‌లో మా యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. మా జట్టులో చాలా మందికి ఇదే తొలి ఐపీఎల్‌.

వారికి మా జట్టు మేనెజ్‌మెంట్‌ మద్దతుగా నిలిచింది. కాబట్టి వారు ఇప్పుడు అదరగొడుతున్నారు. అదే విధంగా నా బ్యాటింగ్‌ పట్ల సంతోషంగా ఉన్నాను. ఓపెనర్‌గా వచ్చి అద్భుతమైన శుభారంభం ఇవ్వడానికే నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను.

                                            

పవర్‌ ప్లేలో మా బ్యాటింగ్‌ పట్ల సంతోషంగా ఉంది. అదే విధంగా మాకు చాలా మంచి బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. కాబట్టి మా బాయ్స్‌ వారికి నచ్చిన విధంగా ఆడేందుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం. ఇక తిలక్‌ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత సీజన్‌లో ఏమి చేశాడో.. ఇప్పడూ అదే చేస్తున్నాడు. అతడు ఆడే విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.

అతడు ఏ బౌలర్‌కైనా ఆడినా ఒకేలా ఆడుతాడు. అదే అతడి స్పెషాలిటీ. మరోవైపు అర్జున్‌ కూడా అద్భుతంగా రాణించాడు. అతడు గత మూడేళ్లగా మా జట్టులో ఉన్నాడు. అతడు అన్ని విషయాలు నేర్చుకున్నాడు. అర్జున్‌ డెత్‌ ఓవర్లలో అద్భుతంగా యార్కర్లు వేస్తున్నాడు. అదే విధంగా కొత్త బాల్‌తో పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేసే సత్తా కూడా అర్జున్‌కు ఉంది" అని రోహిత్‌ పోస్ట్‌మ్యాచ్‌ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు.
చదవండిIPL 2023 SRH vs MI: అదే మా కొంపముంచింది.. లేదంటేనా! అందుకే అలా చేశా
                IPL 2023: సచిన్‌ కొడుకుతో అట్లుటంది మరి.. శబాష్‌ అర్జున్‌! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement