న్యూఢిల్లీ: 2017 సంవత్సరానికి ఫేస్‌బుక్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పార్లమెంటేరియన్లుగా ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నిలిచినట్లు ఆ సంస్థ తెలిపింది. లోక్‌సభ సభ్యుల్లో మోదీ, రాజ్యసభ సభ్యుల్లో సచిన్ అగ్రస్థానంలో నిలిచారని వెల్లడించింది. ఈ ర్యాంకుల్ని ఫేస్‌బుక్‌లో సాగిన చర్చలు, లైక్‌లు, షేరింగ్, కామెంట్ల ఆధారంగా కేటాయించినట్లు పేర్కొంది. ఈ జాబితాలో బీజేపీ చీఫ్ అమిత్ షా, ఆ పార్టీ నేత ఆర్కే సిన్హా, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ ఎంపీ భగవంత్ మన్ కూడా చోటుదక్కించుకున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. ఇక అత్యున్నత సంస్థల జాబితాలో ప్రధాని కార్యాలయం 1.37 కోట్ల మంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో, రాష్ట్రపతి భవన్ 48.8 లక్షల ఫాలోవర్లతో రెండోస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది.
యోగి టాప్
ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలిస్థానంలో, రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే తర్వాతి స్థానంలో నిలిచారని ఫేస్‌బుక్ తెలిపింది. రాజకీయ పార్టీల్లో బీజేపీ, ఆప్, కాంగ్రెస్‌లు వరుసగా తొలి మూడుస్థానాల్లో నిలిచినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment