Sachin Tendulkar Daughter Sara Bollywood Debut Soon: క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ ముద్దుల తనయ సారా త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సెలబ్రిటీ కిడ్ అయిన సారాకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్ట్రాగామ్‌లో ఆమెకు 1.8 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వెండితెర ఎంట్రీకి ముందే ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న సారా ఇప్పటికే పలు బ్రాండ్‌లను ఎండార్స్ చేస్తూ మరింత పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో త్వరలోనే ఆమె ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త బి-టౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ తాజా బజ్ ప్రకారం బెసిగ్గా నటనపై ఆసక్తి ఉన్న సారా ఇప్పటికే మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది.
చదవండి: పోలీసులు ఘోరంగా అవమానించారు: ‘స్కామ్ 1992’ నటుడు ఆవేదన
ఈ క్రమంలో ఆమె బాలీవుడ్ డెబ్యూ మూవీపై కొంతకాలంగా చర్చ నడుస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె త్వరలోనే ఓ మూవీలో బాలీవుడ్ సిల్వర్ స్క్రిన్‌పై సందడి చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇందుకోసం ఆమె పలు బ్రాండ్‌లకు ఎండార్స్ చేస్తూ నటనలో శిక్షణ కూడా తీసుకుంటుందని బి-టౌన్ మీడియాలు తమ కథనంలో రాసుకొస్తున్నాయి. కాగా లండన్ యూనివర్సిటీ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేసిన సారా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఓ అంతర్జాతీయ క్లాతింగ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తోంది. అంతేకాదు ఇటీవల మోడలింగ్‌లోకి అడుగుపెట్టి..సొంతంగా డిజైన్ చేయించిన అంతర్జాతీయ క్లాతింగ్‌ను ప్రమోట్ చేసుకుంటోంది. సారా క్లాతింగ్ బ్రాండ్స్ ఈ-కామర్స్ ప్లాట్ ఫాం అజియో లక్స్‌లో(Ajio Luxe) అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment