
మహేశ్‌బాబు
మహేశ్‌బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకరు. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హెడ్డింగ్ చూసి స్పెషల్‌గా ఫాలోయింగ్ పెరగడమేంటీ అని అనుకుంటున్నారు. ఇది సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి. ట్వీటర్ అకౌంట్‌లో మహేశ్‌బాబును సుమారు 65 లక్షలమంది ఫాలో అవుతారు. కానీ ఈ సూపర్ స్టార్ మాత్రం తన బావ గల్లా జయదేవ్, దర్శకుడు కొర టాల శివను మాత్రమే ఫాలో అవుతుంటారు. కానీ రీసెంట్‌గా ఆయన ఫాలో అయ్యేవారి సంఖ్య 2 నుంచి 8కి పెరిగింది.
అందులో దర్శకులు రాజమౌళి, క్రికెట్ ప్లేయర్స్ సచిన్ టెండుల్కర్, మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లి, రాజకీయ నాయకుడు కేటీఆర్ రచయిత టోనీ రాబిన్స్ ఉన్నారు. ట్వీటర్‌లో చాలా యక్టీవ్‌గా ఉండే మహేశ్ తను అభిమానించే వాళ్లని, తన సన్నిహితులను ఫాలో అవుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఫారిన్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న మహేశ్ జూన్ 9న ఇండియా రిటర్న్ అవుతారట. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతారు మహేశ్.
Comments
Please login to add a commentAdd a comment