పుణే: టీమిండియా స్టార్ ఓపెనింగ్ పెయిర్ రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ ఖాతాలో అరుదైన రికార్డు జమ అయ్యింది. వీరి జోడీ వన్డే క్రికెట్‌లో 5000 పరుగులకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్సి.. ఈ ఘనత సాధించిన ఏడో ఓపెనింగ్ జోడీగా చరిత్ర సృష్టించారు. ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో ఈ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్.. 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. శిఖర్ ధవన్ (56 బంతుల్లో 67; 10 ఫోర్లు) చూడచక్కని బౌండరీలతో అర్ధశతకం సాధించగా, రోహిత్ (37 బంతుల్లో 37; 6 ఫోర్లు) తనదైన శైలీలో అలరించాడు. ఈ మ్యాచ్‌లో వీరి భాగస్వామ్యం 5000 పరుగులను దాటింది. ఇక్కడ చదవండి: టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్: ఆరంభం, ముగింపు ఒకేలా!
కాగా, అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ ఉన్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 8227 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి తరువాత స్థానాల్లో శ్రీలంక జోడీలు సంగక్కర-జయవర్దనే (5992 పరుగులు), దిల్షాన్-సంగక్కర (5475), జయసూర్య-ఆటపట్టు (5462), ఆసీస్ జోడీ గిల్‌క్రిస్ట్-హేడెన్ (5409), విండీస్ పెయిర్ గ్రీనిడ్జ్- హేన్స్ (5206) ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో రోహిత్-శిఖర్ జోడీ చేరింది. ఇక్కడ చదవండి: పాపం కోహ్లి.. ఆ విషయంలో దురదృష్టం వెంటాడుతోంది
Comments
Please login to add a commentAdd a comment