first wicket
-
సచిన్, గంగూలీ తర్వాత ఆ రికార్డు వీరిదే..
పుణే: టీమిండియా స్టార్ ఓపెనింగ్ పెయిర్ రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ ఖాతాలో అరుదైన రికార్డు జమ అయ్యింది. వీరి జోడీ వన్డే క్రికెట్లో 5000 పరుగులకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్సి.. ఈ ఘనత సాధించిన ఏడో ఓపెనింగ్ జోడీగా చరిత్ర సృష్టించారు. ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో ఈ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్.. 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. శిఖర్ ధవన్ (56 బంతుల్లో 67; 10 ఫోర్లు) చూడచక్కని బౌండరీలతో అర్ధశతకం సాధించగా, రోహిత్ (37 బంతుల్లో 37; 6 ఫోర్లు) తనదైన శైలీలో అలరించాడు. ఈ మ్యాచ్‌లో వీరి భాగస్వామ్యం 5000 పరుగులను దాటింది. ఇక్కడ చదవండి: టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్: ఆరంభం, ముగింపు ఒకేలా! కాగా, అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన జోడీగా సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ ఉన్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 8227 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరి తరువాత స్థానాల్లో శ్రీలంక జోడీలు సంగక్కర-జయవర్దనే (5992 పరుగులు), దిల్షాన్-సంగక్కర (5475), జయసూర్య-ఆటపట్టు (5462), ఆసీస్ జోడీ గిల్‌క్రిస్ట్-హేడెన్ (5409), విండీస్ పెయిర్ గ్రీనిడ్జ్- హేన్స్ (5206) ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో రోహిత్-శిఖర్ జోడీ చేరింది. ఇక్కడ చదవండి: పాపం కోహ్లి.. ఆ విషయంలో దురదృష్టం వెంటాడుతోంది -
అదరగొట్టిన బంగ్లాదేశ్
ఓపెనర్లు తమీమ్, కైస్ శతకాలు రెండో ఇన్నింగ్స్‌లో 273/0 పాక్‌తో తొలి టెస్టు ఖుల్నా: పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనే కాదు టెస్టుల్లోనూ రాణించగలమని బంగ్లాదేశ్ జట్టు నిరూపించింది. పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్ (183 బంతుల్లో 138 బ్యాటింగ్; 13 ఫోర్లు; 4 సిక్సర్లు), ఇమ్రుల్ కైస్ (185 బంతుల్లో 132 బ్యాటింగ్; 15 ఫోర్లు; 3 సిక్సర్లు) అజేయ శతకాలతో అదరగొట్టి తమ జట్టు తరఫున చరిత్ర సృష్టించారు. తొలి వికెట్‌కు అజేయంగా 273 పరుగులు జోడించారు. బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. 296 పరుగులు వెనుకబడిన దశలో శుక్రవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి 61 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 273 పరుగులు చేసింది. ప్రస్తుతం 23 పరుగులు వెనుకబడి ఉంది. ఆటకు నేడు (శనివారం) చివరి రోజు కావడంతో మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవచ్చు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 537/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ 168.4 ఓవర్లలో 628 పరుగులు చేసింది. అసద్ షఫీఖ్ (158 బంతుల్లో 83; 6 ఫోర్లు), సర్ఫరాజ్ (88 బంతుల్లో 82; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) రాణించారు. తైజుల్ ఇస్లాంకు ఆరు వికెట్లు దక్కాయి.