లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన అప్‌డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా ప్రతిరోజూ ఏదో ఒక కొత్త పోస్టుతో ఫ్యాన్స్‌కు చేరువగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఓ విభిన్నమైన ఫొటోను షేర్ చేశాడు. ఇందులో.. గాల్లో ఓ కారు తేలుతూ ఉండగా.. కింద ఉన్న మరో కారు వద్ద జనాలు గుమిగూడి ఉన్నారు. దీనికి.. ‘‘ఈ పిక్చర్‌లో ఏం జరుగుతుందో చెప్పగలరా? అనిల్ కుంబ్లే మీరేమనుకుంటున్నారు’’ అంటూ పజిల్ విసిరాడు. అంతేగాక తప్పు సమాధానాలు మాత్రమే స్వీకరిస్తానంటూ షరతు పెట్టాడు.(ప్రేయసి పోస్టుపై కేఎల్ రాహుల్ కామెంట్..)
ఈ సరదా పోస్టుకు అంతే సరదాగా స్పందించిన అనిల్ కుంబ్లే.. ‘‘నాకు సరైన సమాధానం తెలుసు. కానీ నేను దీనిని ప్రయత్నించను. ఎందుకంటే వాళ్లు తప్పు సమాధానాలే కోరుకుంటున్నారు’’ అని బదులిచ్చాడు. దీంతో ఈ ఫొటోలాగే నీ గూగ్లీలు కూడా ఆన్సర్ చేయడం కష్టమంటూ సచిన్ చమత్కరించాడు. కాగా లెగ్‌స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్న సంగతి తెలిసిందే. అతడి ఇన్‌స్టాగ్రాం నిండా వైల్డ్‌లైఫ్ ఫొటోలు దర్శనమిస్తాయి. ఇక ‘వైడ్ యాంగిల్’ పేరిట రాసిన పుస్తకంలో కుంబ్లే ఎన్నో ఫొటోలతో పాటు ఫొటోగ్రఫీ టెక్నిక్స్‌ను కూడా పొందుపరిచాడు. ఈ సీనియర్ క్రికెటర్‌లో దాగున్న మరో పార్శ్వానికి ప్రతిబింబంగా నిలిచిన ఈ బుక్‌ను 2010లో షేన్ వార్న్ ఆవిష్కరించాడు. కాగా కుంబ్లే ప్రస్తుతం ఐపీఎల్ టీం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.(ధోని కెప్టెన్ అవుతాడని అప్పుడే ఊహించా)
What do you think is happening in this pic, people? 🤔@anilkumble1074, any thoughts?
— Sachin Tendulkar (@sachin_rt) August 19, 2020
Only wrong answers accepted! 😜😋#WorldPhotographyDay pic.twitter.com/mqkxSxyj0n
Comments
Please login to add a commentAdd a comment