లక్షలమందికి స్ఫూర్తినువ్వు, సలాం అమీర్‌: సచిన్‌, గౌతం అదానీ ఫిదా | para cricketerAmir Hussain Lone Tendulkar Gautam Adani praises extends support | Sakshi
Sakshi News home page

Amir Hussain Lone సలాం అమీర్‌! సచిన్‌, గౌతం అదానీ ఫిదా

Published Sun, Jan 14 2024 5:20 PM | Last Updated on Sun, Jan 14 2024 6:22 PM

para cricketerAmir Hussain Lone Tendulkar Gautam Adani praises extends support - Sakshi

జమ్ము కశ్మీర్‌ బిజ్‌బెహరాలోని వాఘమా గ్రామానికి చెందిన 34 ఏళ్ల వికలాంగ క్రికెటర్ అమీర్ హుస్సేన్ లోన్‌ అందరికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.   ఏ చిన్న కష్టం వచ్చినా  ఇన్ని కష్టాలు నాకే అని తెగ ఫీల్ అయిపోతూ, నిరాశలో మునిగిపోయేవాళ్లకి నిజంగా అమీర్‌ ఇన్సిపిరేషన్‌. చేతులు లేకపోయినా ఆత్మవిశ్వాసంతో తన కిష్టమైన క్రీడలో  రాణిస్తున్నాడు. దాన్నే చాలెంజింగఠ్‌గా తీసుకోని అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.  అందుకే  ‍క్రికెట్‌ లెజెండ్‌  సచిన్‌ ప్రశంసలు దక్కించుకున్నాడు.

ఎనిమిదేళ్ల వయసులో తండ్రి మిల్లులో జరిగిన ప్రమాదంలో  అమర్‌ రెండు చేతులను కోల్పోయాడు. దీంతో క్రికెట్ అంటే ఎంతో ఇష్టమైన అమీర్‌ మొదట్లో చాలా బాధపడ్డాడు. ఎందుకంటే  బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, ఇలా  ఏది వేయాలన్నా చేతులు తప్పనిసరి. అయినా  ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. 

ఎంతో కష్టపడి తనకిష్టమైన క్రికెట్‌ను సాధన చేశాడు. మెడ, భుజం సాయంతో బ్యాట్‌ పట్టుకుని బ్యాటింగ్‌ చేయడం అలవర్చుకున్నాడు. క్రమంగా అందులో ఆరితేరాడు. అంతేకాదు కుడి కాలి వేళ్ల మధ్య బంతి పెట్టుకుని,  కాలిని తిప్పిఅలవోకగా బౌలింగ్‌  వేయడం  నేర్చుకున్నాడు. తనదైన ప్రతిభతో అందరి దృష్టినీ తన పైపు తిప్పుకున్నాడు. ఈ ప్రతిభకు మెచ్చిన ఒక  ఉపాధ్యాయుడి  ప్రోత్సాహంతో అమీర్‌ పారా క్రికెట్లోకి  ఎంట్రీ ఇచ్చాడు. 

అలా 2013 నుంచి అమీర్‌ ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడుతూ వస్తున్నాడు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ పారా క్రికెట్‌ జట్టుకు సారధ్యం వహించే స్థాయికి  చేరాడు 34 ఏళ్ల అమీర్‌.  2013, 2018లో జాతీయ టోర్నీలో ఆడాడు. బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ మ్యాచ్‌కి కూడా ప్రాతినిథ్యం వహించాడు. నేపాల్‌, షార్జా, దుబాయ్‌లోనూ అమీర్‌ హుస్సేన్‌ మ్యాచ్‌లాడాడు. క్రికెట్‌ దేవుళ్లు సచిన్‌, కోహ్లీలను  కలవాలనేదే అమీర్‌ కల.

 స్పందించిన సచిన్‌ 
క్రీడపై మక్కువ ఉన్న లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చినందుకు చాలా బాగుందంటూ  టెండూల్కర్ ఎక్స్‌లో రాశారు. తన పేరుతో ఉన్న జెర్సీ వేసుకుని క్రికెట్‌ ఆడుతున్న అమీర్‌పై సచిన్‌ ప్రశంసలు కురిపించాడు. క్రికెట్‌ పట్ల అతనికి ఉన్న ప్రేమ, అంకితభావం తనను ముగ్దుణ్ని చేసిందని సచిన్‌ ఫిదా అయిపోఆరు. అలాగే అమీర్‌ను కలిసి అతని పేరుతో ఉన్న జెర్సీని తీసుకుంటానని సచిన్‌  చెప్పడం విశేషంగా నిలిచింది.


అవసరమైన సాయం చేస్తా: గౌతం అదానీ

ప్రతికూల పరిస్థితులలో కూడా తన స్ఫూర్తిని కొనసాగించిన అమీర్‌ కృషిపై  పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్  గౌతమ్ అదానీ కూడా  ‍స్పందించారు. అదానీ ఫౌండేషన్‌ ద్వారా  సాధ్యమైన సాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.

 నాకు మాటలు రావడం లేదు: అమీర్‌ భార్య
అమీర్‌కు మద్దతుగా నిలిచిన సచిన్ , అదానీ  కృతజ్ఞతలు  చెప్పింది అమీర్‌ భార్య షోక్టీ.  సంతోషాన్ని చెప్పడానికి తన దగ్గర మాటల్లేవంటూ భావోద్వేగానికి లోనైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement