
సాక్షి, స్పోర్ట్స్ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమిండియా సైలెంట్ వారియర్.. ఛటేశ్వర పుజారాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
గురువారం(జనవరి 25) పుజారా పుట్టిన రోజు సందర్భంగా సచిన్ తన ట్వీటర్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘‘టీమిండియా సైలెంట్ వారియర్ పుజారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో అతను రాణించాలని కోరుకుంటున్నా’’ అని సచిన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుతం సౌతాఫ్రికాతో టీమిండియా మూడో టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Wishing the silent warrior of #TeamIndia a very very happy birthday. My best wishes for the ongoing test match, @cheteshwar1. pic.twitter.com/8X2Twqoz4R
— Sachin Tendulkar (@sachin_rt) 25 January 2018