ముంబై: క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ తెండూల్కర్ పెట్టుబడులున్న సెకండ్‌హ్యాండ్(ప్రీఓన్‌డ్) కార్ రిటైలింగ్ ప్లాట్‌ఫామ్ స్పిన్నీ.. ఉద్యోగులకు స్టాక్ కేటాయింపు పథకాన్ని(ఇసాప్) ప్రవేశపెట్టింది.
ఏడాది కాలాన్ని పూర్తిచేసుకున్న ఉద్యోగులకు తాజాగా షేర్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. గత రౌండ్‌లో ఇసాప్ పొందిన ఉద్యోగులకు జతగా అర్హత కలిగిన మరో 3,000–3,500 మందికి షేర్లు లభించనున్నట్లు వెల్లడించింది.
2021 డిసెంబర్‌లో తొలిసారి తొలి ఇసాప్ బైబ్యాక్ సౌకర్యాన్ని కల్పించినట్లు ప్రస్తావించింది. దీంతో పలువురు ఉద్యోగులు భారీగా లబ్ది పొందడంతో సొంత గృహాలను సైతం సమకూర్చుకున్నట్లు వివరించింది. కంపెనీ హైదరాబాద్‌సహా ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, ముంబై, పుణే తదితర 22 పట్టణాలలో 36 కేంద్రాల ద్వారా సేవలందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment