ESOP Scheme
-
ఉద్యోగులకు స్విగ్గీ మరో విడత ఎసాప్ల లిక్విడిటీ ప్రోగ్రాం
న్యూఢిల్లీ: ఆన్–డిమాండ్ కనీ్వనియెన్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ అర్హులైన ఉద్యోగుల కోసం 50 మిలియన్ డాలర్లతో (దాదాపు రూ. 410 కోట్లు) ఎసాప్ లిక్విడిటీ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. గతంలో ఉద్యోగులకు ప్రోత్సాహకాల కింద ఇచి్చన షేర్లను కంపెనీ ఈ ప్రోగ్రాం ద్వారా బైబ్యాక్ చేయనుంది. తమ ఎసాప్స్‌ను సంస్థకు విక్రయించి నగదు పొందేందుకు అర్హులైన ఉద్యోగులకు ఈ రూపంలో ఒక ఆప్షన్ ఉంటుందని స్విగ్గీ తెలిపింది. గతేడాది కొనుగోలు చేసిన డైన్అవుట్కి చెందిన సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని వివరించింది. ఉద్యోగులకు సంపదను సమకూర్చే ఉద్దేశంతో దీన్ని చేపట్టినట్లు స్విగ్గీ హెడ్ (హెచ్ఆర్ విభాగం) గిరీష్ మీనన్ తెలిపారు. సుమారు 2,000 మంది ఈ ప్రోగ్రాంకు అర్హత కలిగి ఉంటారని అంచనా. రెండేళ్ల ఎసాప్ లిక్విడిటీ ప్రోగ్రాం కింద.. స్విగ్గీ గతేడాది కూడా 23 మిలియన్ డాలర్లతో (సుమారు రూ. 180 కోట్లు) ఇదే తరహా ప్రక్రియ నిర్వహించింది. -
ఉద్యోగులకు బంపరాఫర్
ముంబై: క్రికెట్ మాజీ దిగ్గజం సచిన్ తెండూల్కర్ పెట్టుబడులున్న సెకండ్‌హ్యాండ్(ప్రీఓన్డ్) కార్ రిటైలింగ్ ప్లాట్‌ఫామ్ స్పిన్నీ.. ఉద్యోగులకు స్టాక్ కేటాయింపు పథకాన్ని(ఇసాప్) ప్రవేశపెట్టింది. ఏడాది కాలాన్ని పూర్తిచేసుకున్న ఉద్యోగులకు తాజాగా షేర్లను జారీ చేయనున్నట్లు తెలియజేసింది. గత రౌండ్లో ఇసాప్ పొందిన ఉద్యోగులకు జతగా అర్హత కలిగిన మరో 3,000–3,500 మందికి షేర్లు లభించనున్నట్లు వెల్లడించింది. 2021 డిసెంబర్లో తొలిసారి తొలి ఇసాప్ బైబ్యాక్ సౌకర్యాన్ని కల్పించినట్లు ప్రస్తావించింది. దీంతో పలువురు ఉద్యోగులు భారీగా లబ్ది పొందడంతో సొంత గృహాలను సైతం సమకూర్చుకున్నట్లు వివరించింది. కంపెనీ హైదరాబాద్‌సహా ఢిల్లీ, నోయిడా, బెంగళూరు, ముంబై, పుణే తదితర 22 పట్టణాలలో 36 కేంద్రాల ద్వారా సేవలందిస్తోంది. -
ఉద్యోగులే బాస్.. అన్ అకాడమీ నుంచి ఈఎస్ఓపీ
తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు ఎడ్యుటెక్ సంస్థ అన్ అకాడమీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంస్థలో పని చేసే ఉద్యోగులతో పాటు అధ్యాపకులకు మొత్తంగా 10.5 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఎంప్లాయిస్ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ కింది ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్అకాడమీ సంస్థ సహా వ్యవస్థాపకుడు రోమన్ షైనీ ట్వీట్ చేశారు. విద్యను అందరికి అందివ్వాలనే లక్ష్యంతో మేము చేసిన ప్రయత్నాలకు సహాకరించిన అందరికీ ధన్యవాదాలు, మా సంస్థ తరఫున ఉద్యోగులకు ఎంప్లాయిస్ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఈఎస్ఓపీ) వర్తింప చేయడం ఇది నాలుగో సారి అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. 300ల మందికి బెంగళూరు వేదికగా ప్రారంభమైన అన్అకాడమీ స్టార్టప్ అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం ఈఎస్‌ఓపీకి అర్హులుగా 300ల మంది వరకు అధ్యాపకులు, టీచర్లు అర్హత సాధించినట్టు అన్ అకాడమీ తెలిపింది. గత నాలుగైదేళ్లుగా వీరంతా అన్ అకాడమీ సంస్థ అభివృద్ది కోసం పాటు పడ్డారని, అందుకే సంస్థలో వాళ్లకు భాగస్వామ్యం కల్పిస్తున్నట్టు అన్అకాడమీ తెలిపింది. ఎడ్యుటెక్‌గా స్కూలు పిల్లలకు ట్యూషన్లు చెప్పడం దగ్గర నుంచి మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, సివిల్ సర్వీస్ పరీక్షల వరకు అనేక రకాలుగా అన్అకాడమీ ఎడ్యుటెక్ సంస్థగా సేవలు అందిస్తోంది. ప్రస్తుతం అన్ అకాడమీ సంస్థ మార్కెట్ వ్యాల్యూ 3.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది. Happy to announce Unacademy's largest ESOPs buyback till date worth $10.5M for our team members and educators. This is our third buyback till date. Extremely thankful to all our team members and educators for believing in our vision of democratising education. Let’s crack it! — Roman Saini (@RomanSaini) September 4, 2021 చదవండి : భారీగా పుట్టుకొస్తున్న సాస్ స్టార్టప్‌లు, ఐపీఓకి జోష్ -
ఆ ఉద్యోగులకు ముందే దీపావళి : బంపర్ ఆఫర్
సాక్షి, బెంగళూరు : బెంగుళూరుకు చెందిన జెరోధా సెక్యూరిటీస్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన ఉద్యోగులకు రూ. 200 కోట్ల విలువైన ఎంప్లాయి స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ (ఇసోప్) ను జెరోధా ఆఫర్ చేసింది. మొత్తం ఉద్యోగుల్లో 77 శాతం మందికి ఈ పథకం కింద ప్రయోజనం చేకూరనుంది. తద్వారా దీపావళి, దసరా పండుగ సంబరాన్ని ముందే వారి ముంగిటకు తీసుకొచ్చింది జెరోధా. ఎకనామిక్ టైమ్స్ అందించిన సమాచారం ప్రకారం మొత్తం 1100 మంది ఉద్యోగుల్లో 850మందికి ఈ షేర్లను కేటాయించామని జెరోధా సీఈవో నితిన్ కామత్ ప్రకటించారు. మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు వాటాలను ఖచ్చితంగా ఉంచుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ, మొదటి సంవత్సరం తరువాత 33 శాతం షేర్లను విక్రయించుకునే అవకాశాన్ని అందిస్తోంది. ఈ ఇసోప్ షేర్లను తిరిగి కొనుగోలు చేయడానికి కంపెనీ 30-50 కోట్ల రూపాయల నిధిని కేటాయించినట్టు చెప్పారు. తమ ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉన్నారనీ, ఉద్యోగుల స్థూల ఆదాయాలు, సేవల ఆధారంగా వాటాల కేటాయింపు జరిగిందన్నారు. తమ ఉద్యోగుల ఆకస్మిక ద్రవ్య అవసరాలను తీర్చడానికి ఈ షేర్లపై ఏడాదికి 6-7 శాతం వడ్డీ అందిస్తామని కూడా కామత్ చెప్పారు. అలాగే తక్షణమే కాకపోయినప్పటికీ రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో పబ్లిక్ లిస్టింగ్‌కు వచ్చే అవకాశం ఉందని కామత్ వెల్లడించారు. కాగా భాగస్వామ్య సంస్థగా 2010లో ఏర్పాటైన జెరోధా బ్రోకరేజ్ సంస్థ రిటైల్, సంస్థాగత బ్రోకింగ్, కరెన్సీ, కమోడిటీ, మ్యూచువల్ ఫండ్స్, బాండ్ మార్కెట్లలో సేవలు అందిస్తుంది. తన విశిష్ష్ట సేవలు, డిస్కౌంట్లతో దేశీయ స్టాక్ బ్రోకరేజ్ సంస్థల్లో టాప్‌లో ఉన్న ఐసీఐసీ సెక్యూరిటీస్‌ను వెనక్కి నెట్టి ఈ ఏడాది ఆరంభంలో నెంబర్ 1 పొజీషన్లోకి దూసుకు వచ్చింది. దాదాపు 8.47 లక్షల ఇన్వెస్టర్లతో జెరోధా దేశంలోనే అతిపెద్ద బ్రోకరేజ్ సంస్థగా అవతరించింది. 2016 ఆర్ధిక సంవత్సరంలో జెరోధాకు 61,970 మంది కస్టమర్లు ఉండగా, 2019 ఆర్ధిక సంవత్సరం (9 నెలల కాలానికి ) ఆ సంఖ్య 84,7,016 కు చేరింది. -
హెచ్డీఎఫ్సీ ఉద్యోగులకు బిగ్ బొనాంజ
న్యూఢిల్లీ : ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన ఉద్యోగులకు బిగ్ బొనాంజ ప్రకటించింది. తన ఉద్యోగులకు 20 లక్షలకు పైగా ఈక్విటీ షేర్లను జారీ చేస్తున్నట్టు బ్యాంకు స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్ స్కీమ్స్(ఈఎస్ఓఎస్) కింద ఉద్యోగులకు 20,56,400 ఈక్విటీ షేర్లను గురువారం జారీచేస్తున్నట్టు బ్యాంకు తన ఫైలింగ్‌లో తెలిపింది. దీంతో బ్యాంకు పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ రూ.516,79,93,234 నుంచి రూ.517,21,06,034 పెరిగినట్టు వెల్లడించింది. ఒక్కో షేరు విలువ రెండు రూపాయలు. నేటి మార్కెట్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు 0.63 శాతం పైకి ట్రేడవుతున్నాయి. మొత్తంగా ఉద్యోగులకు అందించిన షేర్ల విలువ రూ.370 కోట్లకు పైగా ఉంది. తాజాగా ప్రకటించిన సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ అంచనాలను తాకింది. బ్యాంకు వడ్డీ ఆదాయాలు 15 శాతం పెరిగి రూ.19,670 కోట్లకు పెరిగినట్టు రిపోర్టు చేసింది. -
13 ఏళ్ల తరువాత ఇన్ఫీ మళ్లీ..
శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల నిరాశాజనకంగా ఉన్న నేపథ్యంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థనుంచి తరలిపోతున్న ఉద్యోగులను నిలబెట్టుకునేందుకు వారికోసం స్టాక్ ఆప్షన్ ప్రోగ్రామ్ ను పున:ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ స్టాక్ ఆప్షన్ స్కీంను మళ్లీ ప్రారంభించినట్టు ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు చెప్పారు. ఇప్పటివరకు నియంత్రిచిన స్టాక్ ఎంపిక అనుమతిని ఇకముందు సీనియర్ మిడిల్ మేనేజ్ మెంట్ స్థాయి నుంచి సీనియర్ లీడర్ల వరకు విస్తరించి నట్టు తెలిపారు. దీని ద్వారా జూనియర్ నుంచి మధ్యస్థాయి దాదాపు 7,500 ఉద్యోగులకు లబ్ది చేకూరనుందని పేర్కొన్నారు. ఉద్యోగి స్టాక్ యాజమాన్యం ప్రణాళిక కింద సంస్థ ఉద్యోగులకు కంపెనీలో వాటాను కలిగి వుండటానికి అనుమతి ఉంటుంది. హయ్యర్ పెర్ ఫార్మర్స్ ఘర్షణ తగ్గుముఖం పట్టిందని, ఈ పరిస్థితిలో దానిగురించి ఆందోళన చెందడం లేదని రావు తెలిపారు. అటు సంస్థ నిర్ణయం ఉద్యోగులకు మోరల్ బూస్టర్ గా ఉపయోడపడుతుందని విశ్లేషకులు చెప్పారు. జూన్ త్రైమాసికంలో ఎక్కువ ఉద్యోగులు ఇన్ఫోసిస్ వదిలి వెళ్లిపోవడంతో దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. మునుపటి త్రైమాసికం 17.3 శాతంతో పోలిస్తే ఈ ఏడాది మొదటి క్వార్టర్ లో 21 శాతం వార్షికవృధ్ధిని సాధించింది. ఇన్ఫోసిస్ త్రైమాసిక కాలంలో 13.268 ఉద్యోగులను నియమించుకోగా, 10.262 ఉద్యోగులు ఇదే కాలంలో సంస్థను వదిలిపెట్టారు. త్రైమాసికంలో 3,006 మంది నికర ఉద్యోగులు పెరిగారని ఇన్ఫోసిస్ తెలిపింది. జూన్ 30 నాటికి, ఇన్ఫోసిస్ మొత్తం ఉద్యోగులు 1.97 లక్షల మంది అయితే ఉన్నత విద్య చదివేందుకు ఎక్కువ ఉద్యోగులు కంపెనీని వీడినట్టు ఇన్ఫీ వివరించింది.