13 ఏళ్ల తరువాత ఇన్ఫీ మళ్లీ..
శుక్రవారం ప్రకటించిన ఆర్థిక ఫలితాల నిరాశాజనకంగా ఉన్న నేపథ్యంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థనుంచి తరలిపోతున్న ఉద్యోగులను నిలబెట్టుకునేందుకు వారికోసం స్టాక్ ఆప్షన్ ప్రోగ్రామ్ ను పున:ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ స్టాక్ ఆప్షన్ స్కీంను మళ్లీ ప్రారంభించినట్టు ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు చెప్పారు. ఇప్పటివరకు నియంత్రిచిన స్టాక్ ఎంపిక అనుమతిని ఇకముందు సీనియర్ మిడిల్ మేనేజ్ మెంట్ స్థాయి నుంచి సీనియర్ లీడర్ల వరకు విస్తరించి నట్టు తెలిపారు. దీని ద్వారా జూనియర్ నుంచి మధ్యస్థాయి దాదాపు 7,500 ఉద్యోగులకు లబ్ది చేకూరనుందని పేర్కొన్నారు.
ఉద్యోగి స్టాక్ యాజమాన్యం ప్రణాళిక కింద సంస్థ ఉద్యోగులకు కంపెనీలో వాటాను కలిగి వుండటానికి అనుమతి ఉంటుంది. హయ్యర్ పెర్ ఫార్మర్స్ ఘర్షణ తగ్గుముఖం పట్టిందని, ఈ పరిస్థితిలో దానిగురించి ఆందోళన చెందడం లేదని రావు తెలిపారు. అటు సంస్థ నిర్ణయం ఉద్యోగులకు మోరల్ బూస్టర్ గా ఉపయోడపడుతుందని విశ్లేషకులు చెప్పారు.
జూన్ త్రైమాసికంలో ఎక్కువ ఉద్యోగులు ఇన్ఫోసిస్ వదిలి వెళ్లిపోవడంతో దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. మునుపటి త్రైమాసికం 17.3 శాతంతో పోలిస్తే ఈ ఏడాది మొదటి క్వార్టర్ లో 21 శాతం వార్షికవృధ్ధిని సాధించింది. ఇన్ఫోసిస్ త్రైమాసిక కాలంలో 13.268 ఉద్యోగులను నియమించుకోగా, 10.262 ఉద్యోగులు ఇదే కాలంలో సంస్థను వదిలిపెట్టారు. త్రైమాసికంలో 3,006 మంది నికర ఉద్యోగులు పెరిగారని ఇన్ఫోసిస్ తెలిపింది. జూన్ 30 నాటికి, ఇన్ఫోసిస్ మొత్తం ఉద్యోగులు 1.97 లక్షల మంది అయితే ఉన్నత విద్య చదివేందుకు ఎక్కువ ఉద్యోగులు కంపెనీని వీడినట్టు ఇన్ఫీ వివరించింది.