ఇన్ఫోసిస్ కు ముప్పు తెచ్చేది వారే
ఇన్ఫోసిస్ కు ముప్పు తెచ్చేది వారే
Published Tue, Jun 13 2017 4:35 PM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM
బెంగళూరు : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ గత కొంతకాలంగా మార్కెట్లో తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఓ వైపు నుంచి హెచ్-1బీ వీసాల్లో అమెరికా కఠినతరమైన నిబంధనలు, మరోవైపు నుంచి బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు ఏర్పడిన వివాదాలతో నిత్యం వార్తల్లో నిలవడం ఆ కంపెనీని తీవ్రంగా బాధిస్తోంది. తాజాగా ఇన్ఫోసిస్ ఎదుర్కొంటున్న ముప్పులను బహిరంగంగా వెల్లడించింది. కంపెనీ బోర్డు, యాజమాన్య దృష్టిని పక్కకు మరులస్తూ యాక్టివిస్ట్ షేర్ హోల్డర్స్ తమకు ఆందోళనకరంగా మారినట్టు కంపెనీ తెలిపింది. యాక్టివిస్ట్ షేర్ హోల్డర్స్ అంటే కంపెనీలో వారికున్న హక్కులను వినియోగించుకుంటూ సంస్థ ప్రవర్తనను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేవారు. వారు కంపెనీని నడపనప్పటికీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్లపై, మేనేజ్ మెంట్ పై ప్రభావం చూపుతారు. యాక్టివిస్ట్ షేర్ హోల్డర్స్ తో పాటు గత 12 నెలలుగా మీడియా కవరేజ్ కూడా తమల్ని తీవ్రంగా బాధిస్తుందని అమెరికా సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వార్షిక ఫైలింగ్ లో తమ అధికారిక నష్టాలను వెల్లడించింది. ఇటీవలే విప్రో కూడా తన కంపెనీకి ఏర్పరుడుతున్న ముప్పును బహిరంగంగా వెల్లడించింది. ట్రంప్ విధానాల తమ వ్యాపారాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయో పేర్కొంది.
బెంగళూరు ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఇన్ఫోసిస్ లో కార్పొరేట్ ప్రమాణాలు దెబ్బతిన్నాయని ఏకంగా ఆ కంపెనీ వ్యవస్థాపకులే బహిరంగంగా బోర్డు సభ్యులకు చురకలు అంటించారు. యాక్టివిస్ షేర్ హోల్డర్స్ పై స్పందించిన కంపెనీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, యాజమాన్యం, ఉద్యోగుల దృష్టిని వారు మరలుస్తున్నట్టు పేర్కొంది. ఇటువంటి కార్యకలాపాలు తమ వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేయడంలో తమ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపింది. అయితే ఏ ఇన్వెస్టర్ల గ్రూప్ ను ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతుందో కంపెనీ వెల్లడించిలేదు. వ్యవస్థాపకులతో నడుస్తున్న వివాదం 2017 ఆర్థికసంవత్సరంలో కొంత వద్ధిని దెబ్బతీసిందని ఇన్ఫోసిస్ అంతకముందే ప్రకటించింది. తమ వ్యాపార పద్ధతులు, విధానాలు, చర్యలపై మీడియా కవరేజ్, ప్రజాపరిశీలను గత 12 నెలలుగా పెరుగుతూ వస్తుందని, ముఖ్యంగా నెగిటివ్ గా ప్రచారం విపరీతమైందని కంపెనీ ఆందోళన వ్యక్తంచేసింది.
Advertisement
Advertisement