US Securities and Exchange Commission
-
షేర్లు అమ్మేసిన ఎలోన్ మస్క్ సోదరుడు
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ సీఈఓ ఎలోన్ మస్క్ సోదరుడు, టెస్లా ఇంక్. బోర్డు సభ్యుడు కింబాల్ మస్క్ తన వాటా షేర్లను అమ్మేశాడు. యుఎస్ సెక్యూరిటీస్ & ఎక్స్ఛేంజ్ కమీషన్ తెలిపిన వివరాల ప్రకారం కింబాల్ మస్క్ 25.6మిలియన్ డాలర్లు విలువైన షేర్లను విక్రయించారు. 48 ఏళ్ల కింబాల్ మస్క్ ఈ ఫిబ్రవరి 9న 30,000 షేర్లను సగటున 852.12 డాలర్లకు విక్రయించినట్లు యుఎస్ సెక్యూరిటీస్ & ఎక్స్ఛేంజ్ కమీషన్ తెలిపింది. అలాగే కింబాల్ మస్క్ ది కిచెన్ రెస్టారెంట్ సీఈఓ, గ్రూప్ సహ వ్యవస్థాపకుడు. టెస్లా షేర్లు బుధవారం 5.3 శాతం పడిపోయి 804.82 డాలర్లకు చేరుకుంది. టెస్లా షేర్లు 2020లో 743 శాతం పెరగగా 2021లో మరో 14 శాతం పెరిగింది. టెస్లా ఒక షేర్ ధర జనవరి 8న 880 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం టెస్లా ఇన్సైడర్లు కంపెనీలో 19.6 శాతం వాటాను కలిగి ఉన్నారు. అలాగే మరో టెస్లా బోర్డు సభ్యుడు ఆంటోనియో గ్రాసియాస్ కూడా 150,747 టెస్లా షేర్లను విక్రయించాడు. అతను కంపెనీలో 2,545 స్టాక్ హోల్డింగ్ కలిగి ఉన్నాడు. అతను భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని అమ్మేసుకున్నట్లు తెలుస్తుంది. దీనిని లాంగ్-టర్మ్ ఈక్విటీ యాంటిసిపేషన్ సెక్యూరిటీస్(LEAP) అని పిలుస్తారు. -
‘అనైతిక’ ఆరోపణలకు ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: కంపెనీ టాప్ మేనేజ్మెంట్ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతోందంటూ వచ్చిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంకా ప్రాథమిక ఆధారాలేమీ లభించలేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ‘ప్రస్తుతం ప్రాథమిక ఆధారాలేమీ లేవు. గుర్తు తెలియనివారు చేసిన ఆరోపణలపై విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సదరు ఆరోపణల విశ్వనీయత, నిజానిజాల గురించి కంపెనీ వ్యాఖ్యానించే పరిస్థితిలో లేదు‘ అని నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీకి (ఎన్ఎస్ఈ) తెలియజేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కంపెనీని నియమించుకున్నామని, అలాగే అంతర్గతంగా స్వతంత్ర ఆడిటర్ ఎర్న్స్ట్ అండ్ యంగ్‌తో కూడా చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. ఆరోపణల్లో ప్రస్తావించిన నిర్దిష్ట ప్రక్రియలను సమీక్షించాల్సిందిగా స్వతంత్ర ఆడిటర్‌ను కోరినట్లు ఇన్ఫీ వివరించింది. భారీ ఆదాయాలు చూపించడం కోసం ఇన్ఫీ సీఈవో సలిల్ పరీఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతున్నారంటూ పేరు వెల్లడించని కొందరు ఉద్యోగులు కంపెనీ బోర్డుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆధారాలు కూడా అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సత్వరం ఇన్ఫోసిస్ యాజమాన్యం విచారణ ప్రారంభించింది. అటు అమెరికాలో కూడా సెక్యూరిటీస్ ఎక్సే్ఛంజీ (ఎస్ఈసీ) దీనిపై విచారణ జరుపుతోంది. ఈ ఆరోపణల గురించి ముందుగానే ఎందుకు వెల్లడించలేదన్న దానిపై ఎన్ఎస్ఈ వివరణ కోరిన మీదట.. ఇన్ఫోసిస్ తాజా అంశాలు తెలియజేసింది. సోమవారం ఇన్ఫోసిస్ షేరు 3 శాతం పెరిగి రూ. 709 వద్ద క్లోజయ్యింది. -
ఇన్ఫోసిస్ కు ముప్పు తెచ్చేది వారే
బెంగళూరు : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ గత కొంతకాలంగా మార్కెట్లో తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఓ వైపు నుంచి హెచ్-1బీ వీసాల్లో అమెరికా కఠినతరమైన నిబంధనలు, మరోవైపు నుంచి బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు ఏర్పడిన వివాదాలతో నిత్యం వార్తల్లో నిలవడం ఆ కంపెనీని తీవ్రంగా బాధిస్తోంది. తాజాగా ఇన్ఫోసిస్ ఎదుర్కొంటున్న ముప్పులను బహిరంగంగా వెల్లడించింది. కంపెనీ బోర్డు, యాజమాన్య దృష్టిని పక్కకు మరులస్తూ యాక్టివిస్ట్ షేర్ హోల్డర్స్ తమకు ఆందోళనకరంగా మారినట్టు కంపెనీ తెలిపింది. యాక్టివిస్ట్ షేర్ హోల్డర్స్ అంటే కంపెనీలో వారికున్న హక్కులను వినియోగించుకుంటూ సంస్థ ప్రవర్తనను తమ గుప్పిట్లోకి తెచ్చుకునేవారు. వారు కంపెనీని నడపనప్పటికీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్లపై, మేనేజ్ మెంట్ పై ప్రభావం చూపుతారు. యాక్టివిస్ట్ షేర్ హోల్డర్స్ తో పాటు గత 12 నెలలుగా మీడియా కవరేజ్ కూడా తమల్ని తీవ్రంగా బాధిస్తుందని అమెరికా సెక్యురిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వార్షిక ఫైలింగ్ లో తమ అధికారిక నష్టాలను వెల్లడించింది. ఇటీవలే విప్రో కూడా తన కంపెనీకి ఏర్పరుడుతున్న ముప్పును బహిరంగంగా వెల్లడించింది. ట్రంప్ విధానాల తమ వ్యాపారాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయో పేర్కొంది. బెంగళూరు ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఇన్ఫోసిస్ లో కార్పొరేట్ ప్రమాణాలు దెబ్బతిన్నాయని ఏకంగా ఆ కంపెనీ వ్యవస్థాపకులే బహిరంగంగా బోర్డు సభ్యులకు చురకలు అంటించారు. యాక్టివిస్ షేర్ హోల్డర్స్ పై స్పందించిన కంపెనీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, యాజమాన్యం, ఉద్యోగుల దృష్టిని వారు మరలుస్తున్నట్టు పేర్కొంది. ఇటువంటి కార్యకలాపాలు తమ వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేయడంలో తమ సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపింది. అయితే ఏ ఇన్వెస్టర్ల గ్రూప్ ను ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతుందో కంపెనీ వెల్లడించిలేదు. వ్యవస్థాపకులతో నడుస్తున్న వివాదం 2017 ఆర్థికసంవత్సరంలో కొంత వద్ధిని దెబ్బతీసిందని ఇన్ఫోసిస్ అంతకముందే ప్రకటించింది. తమ వ్యాపార పద్ధతులు, విధానాలు, చర్యలపై మీడియా కవరేజ్, ప్రజాపరిశీలను గత 12 నెలలుగా పెరుగుతూ వస్తుందని, ముఖ్యంగా నెగిటివ్ గా ప్రచారం విపరీతమైందని కంపెనీ ఆందోళన వ్యక్తంచేసింది.