ముంబై : కరోనా రోగులకు అందించే చికిత్సలో భాగంగా బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ఏర్పాటు చేసిన ప్లాస్మా థెరపీ యూనిట్‌ను సచిన్ టెండూల్కర్ బుధవారం ప్రారంభించారు. సబర్బన్ అంధేరిలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో దీన్ని అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారు ప్లాస్మాను చేసి ఇతరుల ప్రాణాలను రక్షించాలని కోరారు. కరోనా కట్టడిలో ముందుండి నడిపిస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని..అయినప్పటికీ అవిశ్రామంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. (ఒక్కరోజులో రికార్డు కేసులు )
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతం కరోనా చికిత్సలో అవంలంభిస్తున్న ప్లాస్మా థెరపీ ద్వారా ఎంతో మంది ఈ వైరస్ నుంచి బయటపడ్డారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో యంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారు ప్లాస్మాను దానం చేస్తే ఇతరుల ప్రాణాలను రక్షించిన వాళ్లవుతారు. దాతలు ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అని సచిన్ పేర్కొన్నారు. ప్లాస్మా యూనిట్‌ను ప్రారంభించిన బిఎంసిను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
(కరోనా : దేశంలో సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదు)
Comments
Please login to add a commentAdd a comment