bruhan mumbai municipal corporation
-
Building Collapses: కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. పశ్చిమ బాంద్రాలో ఉన్న ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ ప్రాంత మంతా భయానకంగా మారిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు బెహ్రం నగర్ ప్రాంతానికి చేరుకుని సహయక చర్యలను ముమ్మరం చేశారు. బిల్డింగ్‌లో చాలా మంది చిక్కుకుని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరుగురిని సురక్షితంగా బయటకు తీశారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకి తరలించారు. పోలీసులు, బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు కూడా సహయక చర్యలను చేపట్టారు. అధికారులు.. ముందు జాగ్రత్తగా ఆరు అంబులెన్స్‌లను, ఐదు ఫైరింజన్లను ఘటన స్థలం వద్ద ఏర్పాటు చేశారు. At least five persons are feared trapped after a 5-storey building collapsed in Behram Nagar locality of Bandra (East), Mumbai. Five fire engines, one rescue van, and 6 ambulances have been rushed to the site: BMC — ANI (@ANI) January 26, 2022 చదవండి: రిపబ్లిక్ డే రోజు జాతీయ జెండాకు ఘోర అవమానం.. -
నేలమట్టం కానున్న దేశంలోనే మొదటి స్కై వాక్
సాక్షి, ముంబై: దేశంలోనే మొదటి స్కై వాక్‌గా గుర్తింపు పొందిన తూర్పు బాంద్రాలోని స్కై వాక్‌ను త్వరలో బీఎంసీ నేలమట్టం చేయనుంది. ఈ స్కైవాక్ ప్రమాదకరంగా మారడంతో దీన్ని తొలగించి కొత్తగా నిర్మించాలని బీఎంసీ భావించింది. ఈ పనులకు బీఎంసీ పరిపాలన విభాగం రూ.18.69 కోట్లు ఖర్చు చేయనుంది. రైలు దిగిన ప్రయాణికులు తోపులాటలు లేకుండా సులభంగా ప్రధాన రహదారిపైకి చేరుకునేందుకు 2007లో ఎంఎంఆర్డీయే స్కై వాక్‌లు నిర్మించాలనే ప్రతిపాదన తెరమీదకు తెచ్చింది. ఆ మేరకు దేశంలోనే మొదటి స్కైవాక్‌ను బాంద్రా రైల్వే స్టేషన్ నుంచి కళానగర్ వరకు నిర్మించింది. ప్రారంభంలో పాదచారులందరూ దీన్ని వినియోగించేవారు. 2015లో ఎంఎంఆర్డీయే ఈ స్కైవాక్‌ను బీఎంసీకి అప్పగించింది. కాల క్రమేనా బిచ్చగాళ్లు, మాదక ద్రవ్యాల బానిసలు, తాగుబోతులు, జూదగాళ్లు దానిపై తిష్టవేయడం మొదలుపెట్టారు. దీంతో ఆ స్కైవాక్పై పాదచారులకు ముఖ్యంగా మహిళలకు భద్రత లేకుండా పోయింది. మెల్లమెల్లగా దీని వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. ఆ తరువాత బీఎంసీ ఈ స్కైవాక్‌ను బీజేటీఐ సంస్ధ ద్వారా తనఖీ చేయించగా ప్రమాద కరంగా ఉందని తేల్చిచెప్పింది. దీంతో 2019 నుం చి ఈ స్కైవాక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు దీన్ని నేలమట్టం చేసి కొత్తగా నిర్మించాలని బీఎంసీ భావిస్తోంది. దీనికోసం రూ.16.20 కోట్లతో కూడిన టెండర్లను ఆహ్వానించింది. అందు లో ఎన్ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ 15 శాతం తక్కువ ధరకు అంటే రూ.14.25 కోట్లతో పని చేయడానికి ముందుకు వచ్చింది. దీంతో వివిధ పన్నులతోసహా రూ.18.69 కోట్లు ఖర్చుకానున్నాయి. స్కైవాక్‌పైకి ఎక్కడానికి ఇదివరకు మెట్లు ఉండేవి. కానీ కొత్తగా నిర్మించనున్న ఈ స్కైవాక్ పైకి చేరుకోవడానికి మెట్లకు బదులుగా ఎస్కలేటర్‌ను నిర్మించను న్నారు. చట్టపరంగా అనుమతులన్నీ లభించగానే 18 నెలల్లో ఈ పనులు పూర్తి చేయనుంది. -
కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల.. 300 భవనాలకు సీల్
సాక్షి, ముంబై: ముంబైలో కరోనా, ఒమిక్రాన్ రోగుల సంఖ్య పెరుగుతుండటంతో బీఎంసీ అధికారులు 300పైగా భవనాలకు సీలు వేశారు. ఒక్కో భవనంలో లేదా వింగ్‌లో 20 శాతం ఇళ్లలో కరోనా రోగులుంటే సీల్ వేస్తామని బీఎంసీ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు పెరిగిన కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని కట్టడి చర్యల్లో భాగంగా 300 పైగా భవనాలకు సీలు వేశారు. దేశ రాజధాని ఢిల్లీతోపాటు, ఆర్థిక రాజధాని ముంబైలో కూడా కరోనా రోగులు పెద్దసంఖ్యలో పెరిగారు. ముంబైలో గత రెండు రోజులుగా 25 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. శనివారం ఈ సంఖ్య మరింత పెరగడంతో బీఎంసీ అప్రమత్తమైంది. ముంబైసహా పుణే జిల్లాలో కూడా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోగులకు వైద్యం అందించే 364 మంది డాక్టర్లు కూడా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఈ వ్యాధి మరింత విస్తరించకుండా భవనాలకు, వింగ్‌లకు సీలు వేసినట్లు బీఎంసీ తెలిపింది. రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ముంబైకర్లు భయపడాల్సిన అవసరం లేదని మేయర్ కిషోరీ పేడ్నేకర్ శనివారం స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ, బీఎంసీ ఆస్పత్రుల్లో, జంబో కోవిడ్ కేంద్రాలలో తగినన్ని బెడ్లు, ఐసీయూ, ఆక్సిజన్ వార్డులు సమకూర్చామని, ఆక్సిజన్ నిల్వలు కూడా తగినన్ని ఉన్నాయని చెప్పారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కరోనా నాలుగు రెట్లు వేగంగా విస్తరిస్తోందని, అయినప్పటికీ వీకెండ్ లాక్డౌన్ విధించే ఆలోచన కూడా ప్రస్తుతం ప్రభుత్వానికి లేదన్నారు. కేసులపై ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆమె చెప్పారు. ముంబై ప్రజలు అనవసరంగా ఇంటి నుంచి బయటకు రావద్దని, కోవిడ్ నియమాలు పాటిస్తే లాక్డౌన్ అమలుచేసే అవసరం రాదని ఈ సందర్భంగా ముంబైకర్లకు సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చినవారిలోనూ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, చికిత్సకోసం ఆస్పత్రులకు వస్తున్న వారిసంఖ్య కూడా పరిమితంగానే ఉంటోందని మేయర్ వెల్లడించారు. చదవండి: ఆదిత్య ఠాక్రే సంకల్పం: ఉద్యాన వనంలో ‘ట్రీ–హౌస్’.. ప్రత్యేకతలివే.. -
బిగ్‌బీ ‘ప్రతీక్ష’ గోడ కూల్చివేతపై బీఎంసీ ఆలస్యం.. లోకాయుక్త ఫైర్
Maharashtra Lokayukta On BMC Delaying Amitabh Bungalow Wall Razing: ముంబైలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మొదటిసారిగా నిర్మించుకున్న బంగ్లా ప్రతీక్ష. ఇంద్రభవనంలా ఉండే ఈ బంగ్లా చుట్టూ వివాదం చుట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రతీక్షను అక్రమ కట్టడంగా పరిగణలోకి తీసుకుని దానిని వెంటనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు స్వాధీనం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ నేత తులిప్ బ్రియాన్ మిరండా అప్పట్లో డిమాండ్ చేశారు. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా ఈ ప్రతీక్ష బంగ్లా కాంపౌండ్ వాల్ కూల్చివేసేందుకు, భవనంలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు బీఎంసీ కుంటి సాకులు చెబుతోందని మహారాష్ట్ర లోకాయుక్త ఆరోపించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కూల్చివేతకు కనీసం ఒక సంవత్సరం పడుతుందని, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని మహారాష్ట్ర లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్ వీఎం కనడే తన ఇటీవలి ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే ఈ ఉత్తర్వుల్లో పనుల జాప్యంపై పశ్చిమ శివారు ప్రాంతాల డిప్యూటీ ఇంజినీర్ (రోడ్లు)కు పౌర సంఘం నోటీసు జారీ చేయాలన్నారు. రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్టర్ లేనందున బంగ్లా నుంచి కొంత భాగాన్ని స్వాధీనం చేసుకోలేదని ఇంతకుముందు బీఎంసీ తెలిపింది. శివసేన నియంత్రణలో ఉన్న పౌర సంఘం కూడా గోడను కూల్చివేసి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రోడ్డు కాంట్రాక్టర్‌ను నియమించినప్పుడు భూమిని స్వాధీనం చేసుకుంటుదని చెప్పింది. 'కూల్చివేతలను చేపట్టకపోవడానికి బీఎంసీ చెప్పిన ఈ కారణం సరైనదిగా కనిపించడం లేదు. రోడ్డు విస్తరణ చేపట్టినప్పుడల్లా అవి అమలు చేయడానికి తగిన బడ్జెట్‌ను బీఎంసీ అమలు చేస్తుంది. దీన్ని బట్టి బీఎంసీ ఆలస్యం చేస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. కుంటి సాకులు చెబుతూ సరిహద్దు గోడ కూల్చివేత చేయట్లేదు' అని లోకాయుక్త తన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. -
అర్జున్ కపూర్‌కి కరోనా.. ఇల్లుకు సీల్ వేసిన బీఎంసీ
బాలీవుడ్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇటీవల బీటౌన్‌కు చెందిన ప్రముఖుల కరోనా బారిన పడిన తెలిసిందే. తాజాగా హీరో అర్జున్ కపూర్‌కు బుధవారం (డిసెంబర్ 29) కొవిడ్ పాజిటివ్ అని తేలింది. అర్జున్ కపూర్‌తోపాటు అతని సోదరి అన్షులా కపూర్‌కు మహ్మమారి సోకింది. కరీనా కపూర్ ఖాన్ కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వీరిద్దర కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తమను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు. అర్జున్ కపూర్ ప్రేయసీ మలైక అరోరా కొవిడ్ పరీక్షలు చేసుకోగా ఆమెకు నెగెటివ్ వచ్చింది. ఇటీవల వారిద్దరూ ఓ డిన్నర్ డేట్‌కు వెళ్లినట్లు సమాచారం. అలాగే రియా కపూర్, తన భర్త కరణ్ బూలానీకి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని రియా కపూర్ తన ఇన్‌స్టా గ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసింది. 'ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ నేను నా భర్త కరోనా బారిన పడ్డాం. ఇది మహమ్మారి స్వభావం. మేమిద్దరం ఐసోలేట్ అవుతున్నాం. వైద్యులు సూచించిన మెడిసిన్ తీసుకుంటున్నాం.' అని తెలిపారు. అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కరోనా రావడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అప్రమత్తమైంది. ముంబైలోని అర్జున్ కపూర్ నివాసానికి సీల్ వేసింది. ఇంటి పరిసరాలను శానిటైజ్ చేస్తుంది బీఎంసీ. ఇదిలా ఉంటే గతేడాది సెప్టెంబర్‌లో అర్జున్ కపూర్ తొలిసారిగా కరోనా బారిన పడ్డాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ముంబైలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
ముంబై: మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శివాజీ నగర్‌లోని గోవండి ప్రాంతంలో ఒక భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందగా, 7 గురు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ సంఘటన ఉదయం 5 గంటల ప్రాంతంలో సంభవించినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అదే విధంగా, స్థానికుల సహయంతో క్షతగాత్రులను దగ్గరలోని రాజవాడి, సియోన్ ఆస్పత్రులకు తరలించారు. కాగా, మృతి చెందిన వారిలో ఇద్దరిని నేహషేక్, మోకర్ షేక్‌లుగా గుర్తించారు. మరికొందరిని అత్యవసర చికిత్సను అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కాగా, పోలీసులు సంఘటన స్థలం వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కల్గకుండా చర్యలు తీసుకుంటున్నారు. రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలో జనజీవనం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. అయితే, వర్షం బీభత్సంగానే భవంతి కూలీపోయి ఉంటుందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బిఎంసీ) అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మీ అయ్య ఇచ్చాడు? ముంబై మేయర్ వ్యాఖ్యలు దుమారం
సాక్షి, ముంబై: వివాదాస్పద వ్యాఖ్యలతో ముంబై మేయర్ ఇరుకున పడ్డారు. ఓ టీవీ ప్రసారంపై సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ ప్రశ్నించగా ఆమె స్పందిస్తూ పరుష వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. కాంట్రాక్ట్ ఎవరూ ఇచ్చారు? ఓ నెటిజన్ ప్రశ్నించగా మీ అయ్య? అంటూ ఆమె ట్విటర్లో తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో జరిగింది. ఓ వార్త ఛానల్ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి గ్లోబర్ టెండర్ విషయమై ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దానికి సంబంధించిన వివరాలను బుధవారం ఆ టీవీ ఛానల్ ట్విటర్లో పోస్ట్ చేసింది. దీన్ని చూసిన మిఠి రివర్ అనే నెటిజన్ స్పందిస్తూ ‘కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారు?’ (మరాఠీలో ‘కాంట్రాక్ట్ కోనలా దియా’) అని ప్రశ్నిస్తూ కామెంట్ చేశాడు. దీన్ని చూసిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మేయర్ కిశోరీ ఫడ్నేకర్ (శివసేన పార్టీ నాయకురాలు) స్పందిస్తూ ఘాటుగా బదులిచ్చారు. మీ నాన్న (మరాఠీలో ‘తుజ బాప్ల’) అని రిప్లయ్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. మేయర్ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. అయితే తప్పు తెలుసుకుని ఆమె ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. కాకపోతే అప్పటికే పలువురు స్క్రీన్షాట్లు తీయడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వ్యాఖ్యలపై వెంటనే ప్రతిపక్షాలు స్పందించాయి. ముంబై ప్రథమ పౌరురాలుగా ఉన్న ఆమె మాట్లాడే భాష ఏంటి? అని బీజేపీ కార్పొరేటర్ బాలాచంద్ర షిర్సత్ ప్రశ్నించారు. పౌరులతో మాట్లాడే తీరు ఇదేనా? అని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రాయిస్ షేక్ తెలిపారు. మాట తీరు మార్చుకోవాలని హితవు పలికారు. వెంటనే అతడికి క్షమాపణలు చెప్పాలని నెటిజన్లతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కిశోర్ ఫడ్నేకర్ ముంబైలోని లోవర్ పరేల్ స్థానం మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలిచారు. 2019లో ముంబై మేయర్‌గా ఎన్నికయ్యారు. చదవండి: ఓటేయలేదుగా ఊరు విడిచి పోండి: ఓ నాయకుడి దౌర్జన్యం చదవండి: ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం -
నీళ్ల బదులు శానిటైజర్ తాగిన కమిషనర్
సాక్షి, ముంబై : నీళ్ల బాటిల్ అనుకుని పొరపాటున శానిటైజర్ తాగిన ఘటన సోషల్ మీడియాలో నవ్వులు తెప్పిస్తోంది. కొద్దిగా శానిటైజర్ తాగిన అనంతరం వెంటనే సిబ్బంది అప్రమత్తమవడంతో ఆయన శానిటైజర్‌ను ఉమ్మేసి అనంతరం నీళ్లు తాగారు. శానిటైజర్ తాగినట్లు గుర్తించిన ఆ అధికారి నవ్వడంతో తోటి అధికారులు కూడా నవ్వుకున్నారు. ఈ ఘటన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో జరిగింది. 2021-22 సంవత్సరానికి విద్యా శాఖ బడ్జెట్‌ను బీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ రమేశ్ పవార్ సమర్పిస్తున్నారు. నివేదిక ఇచ్చిన అనంతరం అందరూ కూర్చున్న సమయంలో నీళ్లు తాగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో నీళ్ల బాటిల్ అనుకుని శానిటైజర్ డబ్బాను తీసుకొని తాగారు. ఆయన వెంట నిల్చున సహాయక సిబ్బంది వెంటనే గమనించి వారించారు. అయితే అప్పటికే ఆయన కొద్దిగా శానిటైజర్ తాగారు. వెంటనే ఉమ్మి వేసి నవ్వారు. అనంతరం సిబ్బంది నీళ్ల సీసా అందించారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
కంగనా రనౌత్‌కు బీఎంసీ మరో షాక్
న్యూఢిల్లీ : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ముంబై కార్యాలయాన్ని బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూలగొట్టిన కొద్దిరోజులకే బీఎంసీ నుంచి ఫైర్‌బ్రాండ్ నటికి మరో నోటీసు అందింది. ఖర్‌లోని ఆమె ఇంటిని అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ బీఎంసీ ఈ నోటీసులు జారీ చేసింది. పాలీహిల్‌లోని ఆమె కార్యాల్యం కంటే ఇంటి నిర్మాణంలోనే అధికంగా అవకతవకలు చోటుచేసుకున్నాయని బీఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. ఖర్ వెస్ట్ ప్రాంతంలోని భవనంలో కంగనా ఐదో అంతస్తులో ఉంటున్నారు. ఈ భవనంలో ఆమెకు మూడు ఫ్లాట్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 9న కంగనా ముంబైకి చేరుకునేందుకు సిద్ధమైన క్రమంలో ఆమె కార్యాలయాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ బీఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. తన కార్యాలయం కూల్చివేతను నిలిపివేయాలని కోరుతూ కంగనా రనౌత్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆపై కంగనా కార్యాలయ కూల్చివేతపై కోర్టు స్టే విధించి నటి పిటిషన్‌పై అఫిడవిట్ దాఖలు చేయాలని బీఎంసీని ఆదేశించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ మృతి కేసుపై ముంబై పోలీసుల దర్యాప్తు పట్ల తనకు విశ్వాసం లేదని కంగనా ప్రకటించడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే నగరంలో ఉండరాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, శివసేనల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సంజయ్ రౌత్ తనను బెదిరించారని అంటూ ముంబైని పీఓకేతో కంగనా పోల్చడం కలకలం రేపింది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరును వివరించేందుకు కంగనా మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీతో భేటీ అయ్యారు. చదవండి : మహారాష్ట్ర గవర్నర్‌తో కంగనా భేటీ -
భగత్‌సింగ్‌ను తలపించావ్
ఇటీవలే కంగనా రనౌత్ ఆఫీస్‌ను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీయంసీ) ధ్వంసం చేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను చాలెంజ్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు కంగనా. మీ గర్వం కూడా మా ఆఫీస్ ధ్వంసం అయినట్లే అవుతుందన్నది ఆ వీడియో సారాంశం. ఈ నేపథ్యంలో కంగనా ధైర్యాన్ని పొగుడుతూ ఓ ట్వీట్ చేశారు విశాల్. ‘‘కంగనా... నీ గట్స్‌కి నా హ్యాట్సాఫ్. ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాలను వ్యక్తపరచడానికి నువ్వెప్పుడూ వెనకాడలేదు. నీకు సంబంధించిన విషయాలు కాకపోయినా వాటి గురించి నువ్వు మాట్లాడి, ప్రభుత్వం నుంచి కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నావు. అయినా ధైర్యంగా నిలబడ్డావు. నీ వైఖరి 1920లో భగత్‌సింగ్‌ను తలపించింది. తప్పు ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఎదురుగా ఎవరైనా మాట్లాడొచ్చు అని ఓ ఉదాహరణ చూపించావు’’ అన్నారు విశాల్. -
ఎన్ని నోళ్లు మూయించగలరు?
ముంబై: ముంబైలోని తన కార్యాలయం లోని కొంత భాగాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేసిన తరువాత మరోసారి గురువారం బాలీవుడ్ నటి కంగన రనౌత్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గొంతును ఎవరూ నొక్కలేరని తేల్చిచెప్పారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)ని గూండారాజ్యంతో పోల్చారు. ‘ఏ సిద్ధాంతాలతో బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించారో, ఆ సిద్ధాంతాలను అధికారం కోసం అమ్మేసుకున్నారు. శివసేన నుంచి సోనియా సేనగా మారిపోయారు. నేను లేని సమయంలో బీఎంసీ గూండాలు నా ఇంటిని కూల్చేశారు’ అని ట్వీట్ చేశారు. బీఎంసీ అధికారులు బుధవారం కంగనా ఆఫీస్‌లో కొంత భాగాన్ని కూల్చివేసిన తరువాత, బొంబాయి హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. యజమాని లేని సమయంలో కూల్చివేతలు చేపట్టడంపై వివరణ ఇవ్వాలని బీఎంసీని హైకోర్టు ఆదేశించింది. కంగనపై ఫిర్యాదు నమోదు ఉద్ధవ్‌పై అనుచిత భాష ఉపయోగించినందుకు గానూ కంగనపై విఖ్రోలి పోలీస్ స్టేషన్లో బుధవారం నితిన్ మానె అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న అనంతరం, కోర్టుకు వెళ్లాల్సిందిగా ఫిర్యాదుదారుడికి సూచించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని డీసీపీ ప్రశాంత్ కదమ్ తెలిపారు. అది అక్రమ నిర్మాణమే కంగన ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలనుకున్నది దురుద్దేశంతో కాదని బీఎంసీ బొంబాయి హైకోర్టుకు తెలిపింది. ఆ నిర్మాణంలోని కొన్ని భాగాలు అక్రమంగా నిర్మించినవేనని స్పష్టం చేసింది. గవర్నర్ అసంతృప్తి కంగన రనౌత్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని మహారాష్ట్ర గవర్నర్ కోషియారి అసంతృప్తి వ్యక్తం చేశారు. హడావుడిగా కంగన కార్యాలయ భవనాన్ని కూల్చేయడాన్ని ఆయన తప్పుబట్టారని గవర్నర్ సన్నిహితులు తెలిపారు. కంగనతో కేంద్రమంత్రి అథావలె భేటీ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావలె గురువారం ముంబైలో కంగనతో సమావేశమయ్యారు. బీజేపీ మిత్రపక్షమైన అథావలె పార్టీ ఆర్పీఐ(ఏ) కంగనకు మద్దతుగా నిల్చిన విషయం తెలిసిందే. అయితే, ముంబైను పీఓకేతో పోలుస్తూ కంగన చేసిన వ్యాఖ్యలను తన పార్టీ ఖండిస్తుందని గతంలో అథావలె ప్రకటించారు. శివసేన వ్యవహరించిన తీరుపై మిత్రపక్షం ఎన్సీపీ అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. -
‘క్వీన్’ ఆఫీస్‌లో కూల్చివేతలు
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు చెందిన బాంద్రా బంగ్లాలో అక్రమ నిర్మాణాలున్నాయంటూ బీఎంసీ(ముంబై మున్సిపాలిటీ) అధికారులు బుధవారం కూల్చివేతకు దిగారు. ఈ ఘటనపై కంగన తీవ్రంగా మండిపడ్డారు. నేరుగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌నుద్దేశించి సంభోదిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ఉద్ధవ్‌ఠాక్రే, నువ్వేమనుకుంటున్నావు? మూవీ మాఫియాతో జతకట్టి నా ఇల్లు కూల్చడం ద్వారా కక్ష తీర్చుకున్నటు భావిస్తున్నావు! కానీ గుర్తుంచుకో, కాలచక్రం ఎవరికోసం ఆగదు, ఈ రోజు నా ఇల్లు కూల్చారు, రేపు నీ అహంకారం కుప్పకూలుతుంది!’ అని వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు. 2017లో కంగన ఈ బిల్డింగ్‌ను రూ.20కోట్లకు కొనుగోలు చేశారు. కంగన బిల్డింగ్‌లో నిర్మాణాలను బీఎంసీ కూల్చివేయడాన్ని నిలిపివేస్తూ ముంబై హైకోర్టు స్టే ఇచ్చింది. బీఎంసీ దురుద్దేశంతో చేసినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. యజమాని లేనప్పుడు కూల్చివేతలు ఎలా ఆరంభించారని, నోటీసులకు స్పందించేందుకు కేవలం 24గంటలే ఎందుకు సమయం ఇచ్చారని బీఎంసీని కోర్టు ప్రశ్నించింది. తన బిల్డింగ్‌లో చేపట్టిన కూల్చివేతలను నిలిపివేయాలన్న కంగన పిటీషన్‌ను విచారించిన కోర్టు తదుపరి వాదనలను గురువారానికి వాయిదా వేసింది. కంగన, శివసేన వివాదం క్రమంగా బీజేపీ వర్సెస్ శివసేన వివాదంగా రూపుదిద్దుకుంటోంది. కంగన కార్యాలయంలో కొన్ని నిర్మాణాల కూల్చివేతపై బీజేపీ స్పందిస్తూ శివసేన కక్షపూరిత రాజకీయాలు చేస్తోందని విమర్శించింది. ముంబైకి కంగన హిమాచల్ ప్రదేశ్ నుంచి కంగన బుధవారం ముంబైకి వచ్చారు. ఆమెరాకను నిరసిస్తూ శివసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎయిర్‌పోర్టు నుంచి బందోబస్తు నడుమ ఆమె ఇంటికి చేరుకున్నారు. మరోవైపు ఆర్పీఐ(ఏ) కార్యకర్తలు, కర్ణిసేన కార్యకర్తలు కంగనకు మద్దతుగా గుమిగూడారు. ఇటీవలే కంగనకు కేంద్రం వై ప్లస్ సెక్యూరిటీని కేటాయించింది. కంగన బిల్డింగ్‌లో కూల్చివేతలను హిమాచల్ ముఖ్యమంత్రి ఖండించారు.కంగన వ్యాఖ్యలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని ఎన్సీపీ లీడర్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. అలా మొదలైంది! బాలీవుడ్లో డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేస్తున్న కంగనకు శివసేన ప్రభుత్వం రక్షణ ఇవ్వాలని గతంలో బీజేపీ నేత రామ్ కదమ్ కోరారు. దీనిపై కంగన స్పందిస్తూ మూవీ మాఫియా కన్నా ముంబై పోలీసులంటే తనకు భయమని ట్వీట్ చేశారు. ముంబై పోలీసులకు బదులుగా హిమాచల్ ప్రదేశ్ లేదా కేంద్ర బలగాలు తనకు రక్షణ కల్పించాలన్నారు. దీనిపై శివసేన నేత సంజయ్ రౌత్ ఘాటుగా స్పందిస్తూ ఆమెను ముంబైకి రావద్దని, ముంబై పోలీసులను ఆమె అవమానించారని మండిపడ్డారు. దీనికి బదులుగా ముంబై ఏమైనా పీఓకేనా? అని కంగన ప్రశ్నించారు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని రౌత్ ముంబై ప్రభుత్వాన్ని కోరారు. పీఓకేలో పరిస్థితులు చూసివచ్చి మాట్లాడాలని కంగనకు సలహా ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ తాను 9న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను ఆపాలని కంగన సవాల్ విసిరారు. తనపై చేసిన వ్యాఖ్యలకు సంజయ్ క్షమాపణ చెప్పాలన్నారు. బుధవారం సంజయ్ స్పందిస్తూ తానెప్పుడూ కంగనను బెదిరించలేదని, ముంబైని పీఓకేతో పోల్చడంపైనే తాను ఆగ్రహం వ్యక్తం చేశానని తెలిపారు. కంగన బిల్డింగ్‌లో నిర్మాణాల కూల్చివేతకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చండీగఢ్‌లో ఎయిర్‌పోర్టులో వై–ప్లస్ కేటగిరీ భద్రత మధ్య కంగనా -
సుశాంత్ కేసు : క్వారంటైన్లో బిహార్ పోలీసుల విచారణ
ముంబై : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ మృతిపై బిహార్ పోలీసుల విచారణను అడ్డుకుంటున్నారని, ఈ కేసును క్వారంటైన్లోకి నెట్టారని మహారాష్ట్ర తీరును బిహార్ ఐపీఎస్ అధికారి వినయ్ తివారీ తప్పుపట్టారు. బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు తనను క్వారంటైన్ చేయలేదని సుశాంత్ కేసు విచారణను క్వారంటైన్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ దాఖలైన నేపథ్యంలో కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు ముంబై చేరుకున్న పట్నా ఎస్పీ వినయ్ తివారీని కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా బీఎంసీ అధికారులు క్వారంటైన్ చేశారు. ఆగస్ట్ 15 వరకూ క్వారంటైన్లో ఉండాలని, ఆయనకు బీఎంసీ అధికారులు క్వారంటైన్ ముద్ర వేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జోక్యంతో క్వారంటైన్ నుంచి తివారీని బీఎంసీ అధికారులు విడుదల చేశారు.క్వారంటైన్లో ఉన్న బిహార్ ఐపీఎస్ అధికారి వినయ్ తివారీని ఆయన స్వరాష్ట్రానికి వెళ్లేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు అనుమతించారు. కాగా తివారీని విడుదల చేయాలని బిహార్ పోలీసులు కోరడంతో క్వారంటైన్ గడువుకు వారం ముందుగానే ఆయనను విడుదల చేశామని బీఎంసీ అధికారి తెలిపారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తునకు సంబంధించి రియా చక్రవర్తి శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. తన సోదరుడు సౌవిక్ చక్రవర్తితో కలిసి ముంబైలోనీ ఈడీ కార్యాలయానికి చేరుకున్న రియాపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. సుశాంత్‌కు చెందిన కోట్లాది రూపాయలను అక్రమంగా దారి మళ్లించినట్టు రియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జూన్ 14న బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రా నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. చదవండి : ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా? -
ముంబై మురికివాడ ప్రపంచానికి అడుగుజాడ
ముంబై : వాళ్లంతా నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. కిక్కిరిసినట్లుండే జనం. 10 లక్షల మంది జనాభాతో ఆసియా లో అతి పెద్ద మురికివాడ ధారావి. ఏప్రిల్ 1న అక్కడ మొదటి కరోనా కేసు వెలుగులోకి రాగానే అందరూ తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. కరోనా బాం బు పేలి శవాల దిబ్బగా మారుతుందని అనుకున్నారు. కానీ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేసిన కృషి అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. డబ్ల్యూహెచ్ఓ ధారావిలో కరోనా కట్టడి చర్యల్ని కొనియాడింది. కోవిడ్–19ను నియంత్రించడం లో ప్రపంచ దేశాలకు ఆదర్శనీయంగా నిలిచిన ధారావి మురికివాడ మెరిసిన ముత్యం లా తళుకులీనుతోంది. ముంబైలో కేసులు విశ్వరూపం దాల్చి సినీ ప్రముఖుల్ని కూడా భయపెడుతున్న వేళ ధారావిలో కరోనా కేసులు రోజుకి రెండు లేదంటే మూడు మాత్రమే నమోదవుతున్నాయి. సామాజిక భాగస్వామ్యంతో ధారావి కరోనా చీకట్లను పారద్రోలి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. సవాళ్లు ► సుమారు 2.5 చ. కి మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధారావిలో జనాభా 10 లక్షలు. ఒకే చిన్న గదిలో 8–10 మంది నివాసంతో భౌతిక దూరాన్ని పాటించడం అసాధ్యం ► కమ్యూనిటీ టాయిలెట్స్ మీద ఆధారపడిన 80% ప్రజలు ► ప్రతి రోజూ 450 కమ్యూనిటీ టాయిలెట్స్ వినియోగం ► స్ట్రీట్ ఫుడ్‌పై ఆధారపడిన అత్యధిక జనం 4 టీ ఫార్ములా ► ట్రేసింగ్ 47,500 గృహాలకు వైద్యులు స్వయంగా వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి విచారించారు. ప్రతీ ఒక్క కేసు నమోదవగానే వారితో కాంటాక్ట్ అయిన 24 మందిని గుర్తించారు. వైద్యలు ప్రతీ రోజూ వచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేవారు. ఇలా 59 వేల మందిని గుర్తించారు. ► ట్రాకింగ్ 6 లక్షల మందిని స్క్రీన్ చేశారు. ప్రతీ ఒక్క పాజిటివ్ కేసుకి 5 మందిని క్వారంటైన్‌కి తరలించారు. ► టెస్టింగ్ 13,500 కోవిడ్ పరీక్షలు నిర్వహించారు ► ట్రీటింగ్ ధారావిలో ఉన్న వారు బయటకు అడుగు పెట్టకుండా విస్తృతంగా మౌలికసదుపాయాలు కల్పించారు.కేవలం 14 రోజుల్లో 200 పడకల తాత్కాలిక ఆస్పత్రిని నిర్మించి సీరియస్ కేసులకు చికిత్స అందించారు. స్వల్ప లక్షణాలున్నవారిని క్వారంటైన్ హోమ్స్‌కి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను క్వారంటైన్ హోమ్స్‌గా మార్చారు. కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి అందరి కడుపు నింపారు. కమ్యూనిటీ టాయిలెట్లను రోజుకి నాలుగైదు సార్లు శానిటైజ్ చేశారు. -
ప్లాస్మాను దానం చేయండి : సచిన్ టెండూల్కర్
ముంబై : కరోనా రోగులకు అందించే చికిత్సలో భాగంగా బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ఏర్పాటు చేసిన ప్లాస్మా థెరపీ యూనిట్‌ను సచిన్ టెండూల్కర్ బుధవారం ప్రారంభించారు. సబర్బన్ అంధేరిలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో దీన్ని అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారు ప్లాస్మాను చేసి ఇతరుల ప్రాణాలను రక్షించాలని కోరారు. కరోనా కట్టడిలో ముందుండి నడిపిస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని..అయినప్పటికీ అవిశ్రామంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. (ఒక్కరోజులో రికార్డు కేసులు ) ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ ప్రస్తుతం కరోనా చికిత్సలో అవంలంభిస్తున్న ప్లాస్మా థెరపీ ద్వారా ఎంతో మంది ఈ వైరస్ నుంచి బయటపడ్డారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో యంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారు ప్లాస్మాను దానం చేస్తే ఇతరుల ప్రాణాలను రక్షించిన వాళ్లవుతారు. దాతలు ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అని సచిన్ పేర్కొన్నారు. ప్లాస్మా యూనిట్‌ను ప్రారంభించిన బిఎంసిను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. (కరోనా : దేశంలో సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదు) -
కరోనా: కొత్త అవతారం ఎత్తిన ఏసీ బస్సులు
ముంబై : కరోనా వైరస్ లక్షణాలు కలిగిన వారిని ఆసుపత్రులకు తరలించడానికి గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఓ కొత్త ఉపాయం ఆలోచించింది. ఏసీ బస్సులను అంబులెన్సుల్లాగా మార్చి వాటిని రోగుల రవాణా కోసం ఉపయోగించాలని భావించింది. అనుకున్నదే తడవగా బ్రిహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్టు(బెస్ట్)క్ ఆ పనిని అప్పగించింది. దీంతో బెస్ట్ ఓ ఏడు ఏసీ బస్సులను అంబులెన్సులుగా మార్చి బీఎంసీకి అందించింది. వీటిలో డ్రైవర్లకు ఇన్ఫెక్షన్ సోకకుండా ప్రత్యేక ఏర్పాట్లు, ఎక్కువ మందిని తరలించేందుకు సౌకర్యవంతంగా ఉండటంతో మరిన్ని బస్సులను అంబులెన్సుల్లాగా మార్చాలని బీఎంసీ.. బెస్ట్‌కు పురమాయించింది. (మన దగ్గర పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు? ) బస్సు అంబులెన్స్ ప్రస్తుతం బీఎంసీ చేతిలో ఉన్న ఏడు బస్సు అంబులెన్స్‌లు తమ సేవల్ని మొదలుపెట్టాయి. కాగా, లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని వందల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కొన్నింటిని మాత్రం అత్యవసర సేవల కోసం.. ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల రవాణా కోసం వాడుతున్నారు. ( వైరలైన కాజోల్ మెహందీ ఫంక్షన్ ఫొటో! ) -
బిగ్‌బీ ! ఈ విషయం మీకు తెలియదా ?
ముంబయి : ముంబయి మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుకూలంగా బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. జల్సాలోని ఆయన ఇంటి ముందే పర్యావరణ ప్రేమికులు ' సేవ్ ఆరే - సేవ్ ఫారెస్ట్' ప్లకార్డులను పట్టుకొని నినాదాలు చేశారు. ‘నా స్నేహితుడు ఒకరు అత్యవసర వైద్య నిమిత్తం తన కారును వదిలి మెట్రోలో ప్రయాణించాడు. మెట్రో ద్వారానే తన పనిని తొందరగా ముగించుకొని మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. అది చూసి నాకు ఆనందం కలిగింది. వీలైనన్ని వృక్షాలను పెంచడమే కాలుష్యానికి పరిష్కారం. నేను నా తోటలో వృక్షాలను పెంచుతున్నాను. మీరు కూడా ఈ పని చేయండి అంటూ’ అమితాబ్ ట్వీట్ చేశారు. అమితాబ్ చేసిన ట్వీట్ పై ముంబయి మెట్రో ప్రధాన అధికారి అశ్విని బిడే 'కృతజ్ఞతలు బచ్చన్ జీ' అంటూ అనుకూలంగా స్పందించారు. అయితే దీనిపై పర్యావరణ ప్రేమికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘బిగ్ బీ ! తోటల నుంచి అడవులను తయారు చేయలేమన్న చిన్న విషయం మీకు తెలియదా అంటూ’ ఆందోళన నిర్వహించారు. ముంబయిలోని మెట్రోరైలు ప్రాజెక్టు కోసం ఆరే కాలనీలోని 27 వేల వృక్షాలను తొలగించాలని ముంబయి మెట్రో నిర్ణయించింది. ఇందుకు బృహత్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ కూడా అనుమతి ఇవ్వడంతో అప్పటి నుంచి పర్యావరణ ప్రేమికుల నిరసనలు కొనసాగుతున్నాయి. T 3290 - Friend of mine had a medical emergency, decided to take METRO instead of his car .. came back very impressed .. said was faster, convenient and most efficient .. 👍 Solution for Pollution .. Grow more trees .. I did in my garden .. have you ❤️ — Amitabh Bachchan (@SrBachchan) September 17, 2019 -
నిర్లక్ష్యం... బాధ్యతారాహిత్యం
దేశ ఆర్థిక, వాణిజ్య రాజధానిగా, జనాభారీత్యా అతి పెద్ద మహా నగరంగా పేరు ప్రఖ్యాతులున్న ముంబై వానాకాలం వచ్చేసరికి చిగురుటాకులా వణుకుతుంది. భారీ వర్షాలతో వరద నీరు చేరి సాధారణ జనజీవనం అస్తవ్యస్థమవుతుంది. ఇంచుమించు ఇదే సమయంలో కాలం చెల్లిన భవనాలు కూలుతున్న ఘటనలు కూడా అడపాదడపా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో వందేళ్లనాటి నాలుగంతస్తుల భవంతి కూలి 13మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయాలపాలయ్యారు. ఈ నెల మొదట్లో వచ్చిన వర్షాలవల్ల వివిధ ప్రాంతాల్లో గోడలు కూలి 27మంది చనిపోయారు. ఇలా కూలడానికి సిద్ధంగా ఉన్న గోడలు ఎక్కడెక్కడున్నాయో లెక్కేసే తనిఖీలు ఇంకా పూర్తికాలేదు. ఈలోగా ఈ భవనం కూలిపోయింది. మన దేశంలో నగరాలు విస్తరిస్తున్నాయి. భారీ భవంతులు నిర్మాణమవుతున్నాయి. విశాలమైన రోడ్లు వేస్తున్నారు. ఫ్లైఓవర్లు వస్తున్నాయి. మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. కానీ ఇవన్నీ ప్రధాన మార్గాలకే పరిమితమవుతున్నాయి. ఏ నగరం లోపలికెళ్లి చూసినా ఇరుకు సందులు, మురికి కూపాలు, ఒక పద్ధతి లేకుండా ఉన్న రోడ్లు, ప్రమాదకరంగా వేలాడే కరెంటు తీగలు దర్శనమిస్తాయి. వీటి మధ్య నుంచే వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. సారాంశంలో మౌలిక సదుపాయాలన్నీ పరమ అధ్వాన్నంగా, అస్తవ్యస్థంగా ఉంటున్నాయి. ఇవన్నీ శతాబ్దం క్రితమో, అంతకన్నా ముందో జనాభాను దృష్టిలో పెట్టుకుని రూపొందించినవి. వీటితోపాటే కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలుంటాయి. వాటిల్లో పలు కుటుంబాలు నివసిస్తుంటాయి. ఈ దుస్థితి ఒక్క ముంబై నగరానికి మాత్రమే పరిమితమైనది కాదు. దేశంలో ప్రధాన నగరాలన్నిటి స్థితీ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు జరిగిన విషాద ఘటన వంటిదే 2017లో కూడా జరిగింది. అప్పుడు 33మంది మరణించారు. ఇలాంటి భవనాలు ఇంకా ఎక్కడెక్కడున్నాయో చూసి వాటిల్లో నివాసముండేవారిని ఖాళీ చేయించి కూల్చేస్తామని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకోసం పురాతన భవంతుల్ని నాలుగు కేటగిరీలుగా విభజించారు. పూర్తి ప్రమాదకరమైనవి, పాక్షికంగా ప్రమాదకరమైనవి, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టవలసినవి, చిన్న చిన్న మరమ్మతులు సరిపోతాయనుకున్నవి అంటూ ఒక జాబితా రూపొందించారు. ఆ జాబితాలో ఇప్పుడు కూలిన భవనం ప్రమాదకరమైన కేటగిరీలో ఉంది. కానీ ఏమైంది? మళ్లీ అదే విషాదఘటన పునరావృతమైంది. ఉదయం పూట భవనం కూలితే రాత్రికి కూడా శిథిలాల తొలగింపు పూర్తికాలేదు. ఈ వ్యవధిలో కొన ఊపిరితో ఉన్న పలువురిని రక్షించారు. అసలు ఆ ప్రాంతానికి జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్డీ ఆర్ఎఫ్) వాహనాలు చేరుకోవడానికి కూడా వీలేని పరిస్థితులున్నాయి. ఇప్పుడు కూలిన భవనం లాంటివి ఆ నగరంలో 499 ఉన్నాయని ఒక సర్వే వెల్లడించింది. నగరంలో శిథిలావస్థకు చేరుకున్న భవంతులున్నాయని, వాటిల్లో చాలా భాగం ఇరుకిరుకు సందుల్లో ఉన్నాయని ప్రభుత్వానికి, బీఎంసీకి తెలుసు. ఏటా పడే భారీ వర్షాల వల్ల ఆ భవంతుల పునాదులు దెబ్బతింటున్నాయని తెలుసు. కానీ చర్యలు మాత్రం ఉండవు. కనీసం భవనాలు కూలినప్పుడు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక దళాన్ని సంసిద్ధంగా ఉంచడానికి అవసరమైన నిధులైనా అందుబాటులో ఉంచాలన్న స్పృహ ఎవరికీ లేదు. ఆ విభాగానికి గత మూడు నాలుగేళ్లుగా కేటాయింపులు 38 శాతం మేర తగ్గాయని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) గణాంకాలు చెబుతు న్నాయి. అలాగని ఆ సంస్థకు డబ్బుకేమీ లోటులేదు. ఆదాయంలో అది దేశంలోనే అగ్రగామి. ఎనిమిది లేన్ల రహదారి నిర్మాణానికి, నగరం చుట్టూ 32 కిలోమీటర్ల తీరప్రాంత రహదారి నిర్మాణానికి ఆ సంస్థ భారీ మొత్తంలో నిధులు కేటాయించింది. మన పాలకుల తీరు ఇలా ఉంటున్నది. ఆ మహానగరాన్ని ఏలడానికి బీఎంసీ ఉంటే, దాని పర్యవేక్షణలో వేర్వేరు సంస్థలు పని చేస్తున్నాయి. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంద’న్న చందంగా ఈ సంస్థల పరిధులు, అధికారాలు ఒక్కోసారి కలగలిసి గందరగోళంగా మారుతున్నాయి. ఈ సంస్థల బిల్డింగ్ కోడ్లు, నియమనిబంధనలు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. ఏ ఒక్క సంస్థకూ దేనిపైనా సంపూర్ణాధికారాలు లేకపోవడంతో ఎవరికి వారు పట్టనట్టు ఉంటున్నారు. ఏదైనా అనుకోనిది జరిగితే బాధ్యతను ఎదుటివారిపైకి నెట్టేస్తున్నారు. ఇప్పుడు కూలిన భవంతి మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(ఎంహెచ్ఏడీఏ) పరిధిలోనిదని బీఎంసీ చెబుతోంది. ఎంహెచ్ఏడీఏకు అనుబంధంగా ఉన్న ముంబై భవన మరమ్మతులు, పునర్నిర్మాణ బోర్డు(ఎంబీఆర్ఆర్)కు ఈ భవనం గురించి 2017 జూలైలో లేఖ రాశామంటున్నది. కానీ అందులో ఉన్నవారిని ఖాళీ చేయించాల్సిన బాధ్యత మా సంస్థదా, బీఎంసీదా అని ఎంహెచ్ఏడీఏ ఎదురు ప్రశ్నిస్తోంది. దాన్ని ఖాళీ చేయించి అప్పగిస్తే కూల్చివేసేవారమంటున్నది. దారుణమైన విషయమేమంటే ఈ భవనం 1986 వరకూ గ్రౌండ్ ఫ్లోర్తోనే ఉండేది. కానీ ఆ తర్వాత దానిపై మరో మూడంతస్తులు లేచాయి. పర్య వేక్షించాల్సిన సంస్థలన్నీ గాఢనిద్రపోవడం వల్లే ఇదంతా జరిగిందని స్పష్టంగానే అర్ధమవుతుంది. మనకు జాతీయ భవన నిబంధనలు(ఎన్బీసీ) ఉన్నాయి. వాటి ప్రకారం పాత భవంతుల ప్రమాణాలెలా ఉన్నాయో ఎప్పటికప్పుడు తనిఖీలు జరగాలి. భద్రతను ధ్రువీకరించాలి. నివాసానికి అనువుగా లేనివాటి నుంచి కుటుంబాలను ఖాళీ చేయించాలి. కానీ ఆ నిబంధనలు కూడా ఎవరికీ పట్టడం లేదు. ముంబై ఘటనతో అన్ని ప్రభుత్వాలూ అప్రమత్తం కావాలి. ముఖ్యంగా ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు నిపుణుల కమిటీలు ఏర్పా టుచేసి ప్రమాదకర స్థితిలో ఉన్న భవంతుల ఆరా తీయాలి. ఎన్బీసీ ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలి. చూసీచూడనట్టు వదిలేసే అధికారుల పనిబట్టాలి. లేనట్టయితే ఈ తరహా ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి. -
బ్యాన్... బ్యాన్!
చూడబోతే ఇది నిషేధాల రుతువులా కనబడుతోంది. ముంబై మహా నగరంలో ఈ నెల పదో తేదీతో మొదలుపెట్టి 13, 17, 18 తేదీల్లో మాంసం అమ్మకూడదని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మొన్న 9న ఉత్తర్వులు జారీచేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10, 17 తేదీల్లో మాంసం అమ్మకాలను నిషేధించింది. దాని స్ఫూర్తితో రాజస్థాన్ ప్రభుత్వమూ, ఈ హడావుడంతా చూసి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వమూ ఇలాంటి నిషేధాలనే విధించాయి. జైనుల పండగ పర్యూషణ్ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నిషేధాలను అమలు చేస్తున్నట్టు వీరంతా ప్రకటించారు. ఇదే సమయంలో జమ్మూ-కశ్మీర్ హైకోర్టు ఆ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఇలా తినే తిండిపై నిషేధం విధించడం కొందరంటున్నట్టు కొత్తదేమీ కాదు. 1964లో కూడా ముంబై కార్పొరేషన్లో మాంసాహార అమ్మకాలను రెండు రోజులు నిలిపి ఉంచారని చెబుతున్నారు. అక్బర్ చక్రవర్తి ఏడాదిలో ఆర్నెల్లపాటు మాంసాహారాన్ని విడనాడినప్పుడు ఓ తొమ్మిదిరోజులపాటు పరమత సహనంకోసం, ఒక మతాన్ని గౌరవించడం కోసం దానికి దూరంగా ఉండటానికి ఇబ్బందేమిటని జస్టిస్ కట్జూ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ కూడా లోగడ ప్రశ్నించింది. గుజరాత్, రాజస్థాన్‌లలో జైనులు ఎక్కువగా ఉంటారు గనుక ఆ రాష్ట్రాల్లో వారితోపాటు కొన్ని రోజులు మాంసాహారాన్ని త్యజించడం నిర్హేతుకమేమీ కాదని సుప్రీంకోర్టు అప్పట్లో అన్నదిగానీ ఇప్పుడా నిషేధం మరో రెండు రాష్ట్రాలకు కూడా పాకింది. అహింసా సిద్ధాంతాన్ని ప్రబోధించే జైన మత విశ్వాసాలను... పర్యూషణ్ సమయంలో వారు పాటించే నిష్టను అందరూ గౌరవిస్తారు. ముఖ్యంగా జైనుల ఆహారపుటలవాట్లు వారికి ఒక ప్రత్యేక గుర్తింపునిస్తాయి. ఉద్దేశపూర్వకంగానో, అనుద్దేశితంగానో మనవల్ల క్రిమికీటకాలకు హాని జరిగినా అది దుష్కర్మేనని ఆ మతం చెబుతుంది. వారి దృష్టిలో శాకాహారమంటే కేవలం మాంసాన్ని తినకపోవడం మాత్రమే కాదు... ఆయా రుతువుల్లో దొరికే కాయగూరలనూ, పండ్లనూ తినడం... వాటిని కూడా తక్కువగా తినడం, ఆ ఆహారాన్ని అందరితో పంచుకోవడం. భూమి, నీరు, అగ్ని, వాయువు, వృక్షాలు వగైరాలను నిర్లక్ష్యం చేసే వ్యక్తి వాటితో పెనవేసుకుని ఉండే తన తన సొంత అస్తిత్వానికి సైతం ముప్పు తెచ్చుకునే స్థితికి చేరుతున్నాడని ఒక సందర్భంలో వర్ధమాన మహావీరుడు చెబుతాడు. ఇలాంటి సిద్ధాంతాలను ప్రబోధించే మతాన్ని గౌరవించడం, దాని భావాలను ఇష్టపడి ఆ మతస్తులతోపాటు కనీసం పర్యూషణ్ పండగ సమయంలోనైనా కలిసి నడవాలనుకోవడం మంచిదే. అలా ఎవరైనా చేస్తామంటే దాన్ని హృదయపూర్వకంగా స్వాగతించాలి. అయితే, ఈ సిద్ధాంతాలను వివరించి, జైన మతం గొప్పదనాన్ని, అందులోని పర్యావరణ అనుకూల స్పర్శను, దానివల్ల మానవాళికి కలిగే ఉపయోగాలను వివరించడం వేరు... ఏకపక్షంగా ఒక ఉత్తర్వు జారీ చేసి ఫలానా రోజు వరకూ మాంసం అమ్మవద్దని, తినొద్దని నిషేధాలు విధించడం వేరు. మొదటిది ఒక మతంపై అవగాహనను పెంచి, దాంతో సహానుభూతిని కలిగిస్తుంది. వేరొకటి ఎందుకో, ఏమిటో తెలియకుండా బలవంతంగా రుద్ది... ఒక మంచి భావనపై అనవసర దురభిప్రాయాన్ని కలగజేస్తుంది. ఇలాంటి నిషేధాలెందుకని ప్రశ్నించినవారిని... చాన్నాళ్లుగా ఉన్నదనో, ఫలానా కాలంలో అమలు చేశారనో దబాయించడం సరికాదు. అలా ఎవరు చెప్పినా-ప్రభుత్వాలైనా, న్యాయస్థానాలైనా- సరికాదు. మన దేశంలో పుట్టుకనేది చాలావాటిని నిర్ణయించినట్టే తినే ఆహారాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఎక్కడ పుట్టి పెరిగారన్న అంశాన్నిబట్టి ఎవరి ఆహారపుటలవాట్లయినా ఉంటాయి. మాంసాహారం, శాకాహారాల్లో ఏది మంచిదనే చర్చ చాన్నాళ్లుగా ఉంది. మాంసాహారం తినేవారు కూడా కొన్ని సందర్భాల్లో వైద్యుల సలహా మేరకు తగ్గించడమో, పూర్తిగా మానేయడమో చేస్తుంటారు. ఇలా వ్యక్తిగత ఇష్టాయిష్టాలనుబట్టి, అవసరాలనుబట్టి నిర్ణయించుకోవడం సహేతుకమవుతుంది. ఒక చట్టం ద్వారానో, ఒక ఉత్తర్వు ద్వారానో మాన్పించాలని చూడటం నియంతృత్వమవుతుంది. ఇప్పుడు బృహన్ ముంబై కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్న వారిలో రకరకాల వారున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీకి మద్దతు పలుకుతున్న శివసేన కూడా ఈ నిర్ణయంపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేసింది. దీన్ని ఖండిస్తూ మాంసాహారాన్ని విక్రయించింది. ఆ పార్టీకున్న అభ్యంతరమల్లా ఒక్కటే. చాన్నాళ్లుగా పర్యూషణ్ సందర్భంగా కేవలం రెండు రోజులే ఉంటున్న నిషేధాన్ని ఇప్పుడు ఎందుకు పొడిగించాల్సివచ్చిందని అది ప్రశ్నిస్తోంది. ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించినప్పుడు బొంబాయి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనలు అందరినీ దిగ్భ్రాంతిపరిచాయి. ఈ ఉత్తర్వులో చేపల విక్రయాన్ని ఎందుకు చేర్చలేదని న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు... అది నీటిలోనుంచి బయటకు తీసిన వెంటనే చనిపోతుంది గనుక దాన్ని వధించడమనే ప్రశ్నే తలెత్తదని అక్కడి అడ్వొకేట్ జనరల్ జవాబిచ్చారు. నిషేధించడానికి ముందు అందుకు సంబంధించి ప్రభుత్వంలో ఏ కసరత్తూ జరగలేదని దీన్నిబట్టే తెలుస్తుంది. చివరకు ఇలాంటి నిషేధం ముంబై వంటి నగరంలో సరికాదని హైకోర్టు తేల్చింది. మరికొన్నాళ్లలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జైనుల ఓట్లను కొల్లగొట్టే ఉద్దేశంతోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిషేధానికి దిగిందన్న కొందరు ఆరోపిస్తున్నారు. అది నిజమైనా కావొచ్చు. ఏం చదవాలో, ఏం ఆలోచించాలో, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయాలో నిర్దేశించడం మొదలుపెట్టి ఇప్పుడు వంటింట్లో ఏం వండాలో నిర్ణయించే దశకు మన ప్రభుత్వాలు చేరుకున్నాయని ఈ నిషేధ పరంపర తెలియజెబుతోంది. ఇంకా నగుబాటుపాలు కాకముందే ఈ వేలంవెర్రికి స్వస్తి పలకడం మంచిదని పాలకులు తెలుసుకోవాలి.