ఇటీవలే కంగనా రనౌత్ ఆఫీస్‌ను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీయంసీ) ధ్వంసం చేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను చాలెంజ్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు కంగనా. మీ గర్వం కూడా మా ఆఫీస్ ధ్వంసం అయినట్లే అవుతుందన్నది ఆ వీడియో సారాంశం. ఈ నేపథ్యంలో కంగనా ధైర్యాన్ని పొగుడుతూ ఓ ట్వీట్ చేశారు విశాల్. ‘‘కంగనా... నీ గట్స్‌కి నా హ్యాట్సాఫ్. ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాలను వ్యక్తపరచడానికి నువ్వెప్పుడూ వెనకాడలేదు. నీకు సంబంధించిన విషయాలు కాకపోయినా వాటి గురించి నువ్వు మాట్లాడి, ప్రభుత్వం నుంచి కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నావు. అయినా ధైర్యంగా నిలబడ్డావు. నీ వైఖరి 1920లో భగత్‌సింగ్‌ను తలపించింది. తప్పు ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఎదురుగా ఎవరైనా మాట్లాడొచ్చు అని ఓ ఉదాహరణ చూపించావు’’ అన్నారు విశాల్.
Comments
Please login to add a commentAdd a comment