Maharashtra Lokayukta On BMC Delaying Amitabh Bungalow Wall Razing: ముంబైలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మొదటిసారిగా నిర్మించుకున్న బంగ్లా ప్రతీక్ష. ఇంద్రభవనంలా ఉండే ఈ బంగ్లా చుట్టూ వివాదం చుట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రతీక్షను అక్రమ కట్టడంగా పరిగణలోకి తీసుకుని దానిని వెంటనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు స్వాధీనం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ నేత తులిప్ బ్రియాన్ మిరండా అప్పట్లో డిమాండ్ చేశారు. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా ఈ ప్రతీక్ష బంగ్లా కాంపౌండ్ వాల్ కూల్చివేసేందుకు, భవనంలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు బీఎంసీ కుంటి సాకులు చెబుతోందని మహారాష్ట్ర లోకాయుక్త ఆరోపించింది.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కూల్చివేతకు కనీసం ఒక సంవత్సరం పడుతుందని, ఎందుకు ఆలస్యం చేస్తున్నారని మహారాష్ట్ర లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్ వీఎం కనడే తన ఇటీవలి ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే ఈ ఉత్తర్వుల్లో పనుల జాప్యంపై పశ్చిమ శివారు ప్రాంతాల డిప్యూటీ ఇంజినీర్ (రోడ్లు)కు పౌర సంఘం నోటీసు జారీ చేయాలన్నారు. రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్టర్ లేనందున బంగ్లా నుంచి కొంత భాగాన్ని స్వాధీనం చేసుకోలేదని ఇంతకుముందు బీఎంసీ తెలిపింది. శివసేన నియంత్రణలో ఉన్న పౌర సంఘం కూడా గోడను కూల్చివేసి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రోడ్డు కాంట్రాక్టర్‌ను నియమించినప్పుడు భూమిని స్వాధీనం చేసుకుంటుదని చెప్పింది.
'కూల్చివేతలను చేపట్టకపోవడానికి బీఎంసీ చెప్పిన ఈ కారణం సరైనదిగా కనిపించడం లేదు. రోడ్డు విస్తరణ చేపట్టినప్పుడల్లా అవి అమలు చేయడానికి తగిన బడ్జెట్‌ను బీఎంసీ అమలు చేస్తుంది. దీన్ని బట్టి బీఎంసీ ఆలస్యం చేస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. కుంటి సాకులు చెబుతూ సరిహద్దు గోడ కూల్చివేత చేయట్లేదు' అని లోకాయుక్త తన ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment