బస్సు అంబులెన్స్
ముంబై : కరోనా వైరస్ లక్షణాలు కలిగిన వారిని ఆసుపత్రులకు తరలించడానికి గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఓ కొత్త ఉపాయం ఆలోచించింది. ఏసీ బస్సులను అంబులెన్సుల్లాగా మార్చి వాటిని రోగుల రవాణా కోసం ఉపయోగించాలని భావించింది. అనుకున్నదే తడవగా బ్రిహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్టు(బెస్ట్)క్ ఆ పనిని అప్పగించింది. దీంతో బెస్ట్ ఓ ఏడు ఏసీ బస్సులను అంబులెన్సులుగా మార్చి బీఎంసీకి అందించింది. వీటిలో డ్రైవర్లకు ఇన్‌ఫెక్షన్ సోకకుండా ప్రత్యేక ఏర్పాట్లు, ఎక్కువ మందిని తరలించేందుకు సౌకర్యవంతంగా ఉండటంతో మరిన్ని బస్సులను అంబులెన్సుల్లాగా మార్చాలని బీఎంసీ.. బెస్ట్‌కు పురమాయించింది. (మన దగ్గర పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు? )
బస్సు అంబులెన్స్
ప్రస్తుతం బీఎంసీ చేతిలో ఉన్న ఏడు బస్సు అంబులెన్స్‌లు తమ సేవల్ని మొదలుపెట్టాయి. కాగా, లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలోని వందల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. కొన్నింటిని మాత్రం అత్యవసర సేవల కోసం.. ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగుల రవాణా కోసం వాడుతున్నారు. ( వైరలైన కాజోల్ మెహందీ ఫంక్షన్ ఫొటో! )
Comments
Please login to add a commentAdd a comment